ప్రభుత్వరంగ మేజర్ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) కూడా క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డులు కలిగిన తమ కస్టమర్లకు ఎన్నో వెసులుబాట్లు కల్పిస్తోంది. IRCTC టికెట్లను ఆన్ లైన్లో బుక్ చేసుకునేందుకు SBI అవకాశాన్ని కల్పిస్తోంది. దీంతో పాటుగా టిక్కెట్ బుకింగ్ పైన పలు రివార్డులు, క్యాష్‌బ్యాక్ వంటివి ఇస్తోంది. ఎస్బీఐ కార్డు ద్వారా మీరు టిక్కెట్ బుక్ చేయాలనుకుంటే ఈ కింది పద్ధతుల ద్వారా చేయవచ్చు.
ఎస్బీఐ కార్డ్ ద్వారా పేమెంట్.. స్టెప్ బై స్టెప్
ముందుగా యూజర్లు https://www.irctc.co.in/nget/train-search ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తరువాత మీరు ఫస్ట్ టైమ్ యూజర్ అయితే రిజిస్టర్ కావాలి. ఇప్పటికే రిజిస్టర్ అయి ఉంటే యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవండి.
అక్కడ కనిపించే Plan My Travel and Book Ticket ఆప్షన్‌లో డిపార్చర్, అరైవల్ స్టేషన్ వంటి సమాచారం ఇవ్వండి. అలాగే తేదీ, జర్నీ చేయబోయే క్లాస్ వంటి వాటిని ఎంచుకోండి.
ట్రెయిన్‌ను ఎంచుకోండి
IRCTC డిస్‌ప్లేలో కనిపించే ట్రెయిన్ జాబితా నుంచి మీరు వెళ్లవలసిన ట్రెయిన్‌ను సెలక్ట్ చేసుకోండి. ఆ తర్వాత Book Ticket పైన క్లిక్ చేయండి. ఇందులో మీరు ప్రయాణీకుల వివరాలు ఇవ్వాలి. మీకు టిక్కెట్లు చేరేందుకు మీ ఇంటి అడ్రస్‌ను కన్‌ఫర్మ్ చేయాలి. -ఆ తర్వాత టిక్కెట్‌కు అయ్యే అమౌంట్ ఎంతో అక్కడ డిస్‌ప్లే అవుతుంది.
SBI కార్డు ద్వారా పేమెంట్
ఆ తర్వాత State Bank of India పేమెంట్ ఆప్షన్‌ను ఎంచుకోండి. దీంతో మీరు ఎస్బీఐ ఆన్‌లైన్ సైట్‌కు వెళ్తారు. ఎస్బీఐకి చెందిన యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవండి. ఆ తర్వాత పేమెంట్ కన్‌ఫర్మ్ చేయండి. ట్రాన్సాక్షన్ విజయవంతమయ్యాక ట్రాన్సాక్షన్ ఐడీ, డేట్ ఆప్ ట్రాన్సాక్షన్ మీకు వస్తుంది. ఆ తర్వాత IRCTC టిక్కెట్స్‌ను మీరు పేర్కొన్న అడ్రస్‌కు డెలివరీ చేస్తుంది. టిక్కెట్ డెలివరీ బాధ్యత మొత్తం IRCTCనే చూసుకుంటుంది.
టిక్కెట్ క్యాన్సిల్ చేయాలంటే...
టిక్కెట్ క్యాన్సిల్ చేసేందుకు కంప్యూటరైజ్డ్ రైల్వే టిక్కెట్ కౌంటర్‌కు వెళ్లండి. మీ అమౌంట్ మీకు క్రెడిట్ అవుతుంది. అయితే ప్రతి ట్రాన్సాక్షన్ పైన రూ.10 సర్వీస్ ఛార్జ్ ఉంటుంది. రైలు ప్రయాణీకులకు గరిష్ట ప్రయోజనాలు అందించేందుకు IRCTC... SBIతో జత కట్టింది. ఎస్బీఐ ప్లాటినమ్ కార్డుతో ఆఫర్లు ఇస్తోంది. టిక్కెట్ బుక్ చేస్తే రివార్డు పాయింట్స్ వస్తాయి. ఎస్బీఐ ప్లాటినమ్ కార్డు ఉపయోగిస్తే మీరు దాదాపు టిక్కెట్ ఉచితంగా పొందినట్లుగా ఉంటుంది.. ఇప్పటికే 350 రివార్డు పాయింట్స్‌లా ఫ్రీబీస్ ప్రొవైడ్ చేస్తోంది. 1.8 శాతం ట్రాన్సాక్షన్ ఛార్జీలు మాఫీ అయ్యే అవకాశముంది. 2.5 శాతం ఫ్యూయల్ సర్‌ఛార్జీ తగ్గవచ్చు. రైల్వే బుకింగ్ పైన పది శాతం వ్యాల్యూ బ్యాక్ ఉంటుంది.