స్మార్ట్‌ఫోన్‌లలో స్టోరేజ్ స్పేస్ కీలక పాత్ర పోషిస్తుంది. ఫోన్‌లలో స్టోరేజ్ స్పేస్ ఎంత ఎక్కువు ఉంటే అంత మంచిది. స్మార్ట్‌ఫోన్‌లలో నిరుపయోగంగా ఉన్న డేటాను ఎప్పటికప్పుడు తొలగించుటం ద్వారా స్టోరేజ్ స్పేస్‌ను పెంచుకోవచ్చు. నేటి స్పెషల్ స్టోరీలో భాగంగా ఆండ్రాయిడ్ ఫోన్‌లలో తలెత్తే స్టోరేజ్ స్పేస్ సమస్యలను సులభంగా పరిష్కరించుకునేందుకు పలు తీరైన మర్గాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఆండ్రాయిడ్ బిల్ట్-ఇన్ స్టోరేజ్ టూల్‌ను ఉపయోగించుకోవటం ద్వారా...
మోడ్రెన్ వర్షన్ ఆపరేటింగ్ సిస్టంలతో వస్తోన్న ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ లలో స్టోరేజ్ వినియోగానికి సంబంధించిన పక్కా సమాచారం క్లియర్ కట్ గా చూపించబడుతోంది. లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ యూజర్లు ఈ సదుపాయాన్ని వినియగించుకోవాలనుకుంటున్నట్లయితే సెట్టింగ్స్‌లోకి వెళ్లి స్టోరేజ్ ఆప్షన్ ను సెలక్ట్ చేసుకున్నట్లయితే యాప్స్, పిక్షర్స్, వీడియోస్, ఆడియో ఫైల్స్, డౌన్ లోడ్స్, క్యాచీ డేటా ఇంకా ఇతర ఫైల్స్ ఎంతెంత్ స్టోరేజ్ స్పేస్‌ను ఆక్రమించుకున్నాయన్నది తెలుస్తుంది.
Files Go టూల్
గూగుల్ ఇటీవల Files Go పేరుతో సరికొత్త యాప్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ టూల్ సహాయంతో వివిధ రకాల అవసరాల నిమిత్తం వినియోగించుకున్న స్పేస్‌ను విజువలైజ్ చేసుకునే వీలుంటుంది. ఈ యాప్‌ను ప్లే స్టోర్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకునే వీలుంటుంది.
SD Card
యాప్స్ కారణంగా స్టోరేజ్ సమస్యలను ఫేస్ చేస్తున్న ఆండ్రాయిడ్ యూజర్లు ఫోన్ మెమురీలోని కొన్ని యాప్స్‌ను SD cardలోకి మూవ్ చేసుకోవటం ద్వారా ఇంటర్నల్ స్టోరేజ్ స్పేస్‌ను ఖాళీ చేసుకోవచ్చు. అయితే ఫోన్‌తో పాటుగా వచ్చే ప్రీ-ఇన్‌స్టాల్డ్ యాప్స్‌ను SD cardలోకి మూవ్ చేయటం కుదరదు. కాబట్టి, మీరు అప్పుడప్పుడూ వినియోగించుకునే యాప్స్‌ను మాత్రమే ఎక్స్‌టర్నల్ స్టోరేజ్‌లోకి మూవ్ చేసుకోవటం మంచిది.
లిమిటెడ్ స్టోరేజ్ ఆప్షన్‌లతో లభ్యమవుతున్న పలు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ సౌకర్యం అందుబాటులో ఉండదు. మరి ఇటువంటి ఫోన్‌లలో స్టోరేజ్ స్పేస్‌ను క్లియర్ చేసుకోవటం ఎలా...ఫోన్‌లోని పాత మెసేజ్‌లను డిలీట్ చేయటం ద్వారా స్టోరేజ్ స్పేస్‌ను పెంచుకోవచ్చు. ఫోన్‌లోని ఫోటోలు, వీడియోలను గూగుల్ డ్రైవ్ క్లౌడ్ సర్వీసులలోకి మూవ్ చేయటం ద్వారా ఫోన్ స్టోరేజ్ స్పేస్ మరింత ఆదా అవుతుంది.
పాటలను ఫోన్‌లో స్టోర్ చేసుకుని వినే బదులు, యూట్యూబ్ వంటి ఆన్‌లైన్ స్ట్రీమింగ్ సర్వీసుల ద్వారా వినటం వల్ల బోలెడంత స్టోరేజ్ స్పేస్ ఆదా అవుతుంది. బ్రౌజర్ హిస్టరీలోకి వెళ్లి ఎప్పటికప్పుడు క్యాచీ ఫైల్స్‌ను క్లియర్ చేసుకోవటం ద్వారా ఫోన్ స్టోరేజ్ స్పేస్ పెరగటంతో పాటు ఇంటర్నెట్ బ్రౌజింగ్ కూడా వేగంగా ఉంటుంది. ఫోన్‌లోని పనికిరాని యాప్స్‌ను ఎప్పటికప్పుడు డిలీట్ చేయటం ద్వారా స్టోరేజ్ స్పేస్ ఆదా అవుతుంది.
డేటా కేబుల్ సహాయంతో ఫోన్‌లోని డేటాను ఎప్పటికప్పుడు కంప్యూటర్ హార్డ్‌డిస్క్‌లోకి మూవ్ చేయటం అలవాటు చేసుకన్నట్లయితే స్టోరేజ్ స్పేస్ ఆదా అవటంతో పాటు ఫోన్ పై ఒత్తిడి మరింత తగ్గుతుంది. స్మార్ట్‌ఫోన్‌లలోని ఫోటోలను గూగుల్ ఫోటోస్, డ్రాప్‌బాక్స్, మైక్రోసాఫ్ట్, వన్‌డ్రైవ్, ఫ్లికర్ వంటి ఆన్‌లైన్ క్లౌడ్ అకౌంట్‌లలోకి మూవ్ చేసుకోవటం ద్వారా ఫోన్ స్టోరేజ్ పై మరింత భారం తగ్గుతుంది. ఆండ్రాయిడ్ డివైస్‌లోని ఫోటోస్ యాప్, గూగుల్ ఫోటోస్‌తో ఇంటిగ్రేట్ అయి ఉంటుంది కాబట్టి ఫోటోస్ అన్ని గూగుల్ క్లౌడ్ అకౌంట్‌లో స్టోర్ కాబడతాయి. వీటిని photos.google.comలోకి వెళ్లటం ద్వారా ఎక్కడి నుంచైనా యాక్సిస్ చేసుకోవచ్చు.