మన మూడ్ ఎప్పుడూ ఒకేలా ఉండదు. పరిస్థితికి తగ్గట్టుగా.. సమయానికి తగ్గట్టుగా మారిపోతూ ఉంటుంది. అయితే మన మూడ్ ని ట్రాక్ చేసి దాన్ని సద్వినియోగం చేసుకునే కొన్ని యాప్‌లు ఉన్నాయి.. మరి అలాంటి యాప్‌లు ఏంటో.. వాటిని ఎలా యూజ్ చేసుకోవచ్చో తెలుసుకుందామా..
డేలియో
మూడ్ ట్రాక్ చేయడానికి అందుబాటులో ఉన్న యాప్‌లలో డేలియో కూడా ఒకటి. రోజు మొత్తంలో మన మనసు ఎలా ఉంటుంది.. ఆలోచనలు ఎలా ఉంటున్నాయో ఈ యాప్ గ్రహిస్తుంది. ఒకసారి యాప్ ఓపెన్ చేయగానే.. మీకు ఆ రోజు మూడ్ ఎలా ఉందో అడుగుతుంది. గుడ్, బ్యాడ్, సాడ్ ఇలాంటి ఆప్షన్లు ఉంటాయి. ఒకసారి మూడ్ ఐకాన్ సెట్ చేసుకున్న తర్వాత మళ్లీ ఎడిట్ చేసుకోవచ్చు. రిలాక్స్, రీడింగ్, గుడ్ మీల్, షాపింగ్, స్పోర్ట్స్ లాంటి యాక్టివిటీస్ కోసం కూడా ఈ యాప్‌లు ఉంటాయి. మీ మూడ్ కు సంబంధించిన స్టాట్స్‌ని కూడా ఈ యాప్ చూపిస్తుంది.
రెఫ్లెక్సియో
మన మూడ్‌ని ట్రాక్ చేయడానికి రెఫ్లెక్సియో యాప్ యూజ్ అవుతుంది. ఈ యాప్ ప్రతి రోజు ఒక ప్రశ్నకు సమాధానం చెబుతుంది. మీరు యాప్ ఓపెన్ చేయగానే టైమ్ లైన్ ఆఫ్ క్వశ్చన్స్ కనిపిస్తాయి. ప్రతిరోజూ ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. మీరు ఎన్ని ఆలోచనలను యాడ్ చేస్తే రిజల్ట్స్ అంత బాగుంటాయి. మాగ్జిమమ్ 1000 క్యారెక్టర్స్ వరకు మన ఆలోచనలను పొందుపరచొచ్చు.
ఈమూడ్స్ ట్రాకర్
ఈ మూడ్స్ బైపోలార్ మూడ్ ట్రాకర్ కూడా ఈ కోవకే చెందుతుంది. మీ మూడ్స్‌ని ప్రతిబింబించడానికి గ్రాఫ్స్, రిపోర్ట్స్ ఉపయోగిస్తారు. డిప్రెషన్, మూడ్ డిజార్డర్స్‌ని కూడా ఈ యాప్ ద్వారా మేనేజ్ చేసుకునే అవకాశం ఉంది. ఈ యాప్‌ను ఓపెన్ చేయగానే గత రాత్రి మీ నిద్ర ఎలా ఉంది. మూడ్ ఎలా ఉంది. యాంగ్జైటీ ఎలా ఉంది, సైకోటిక్ సింటమ్స్ ఉన్నాయా లాంటి వివరాలను ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు.