• తాజా వార్తలు

ఇంటి వద్ద నుండే డబ్బు సంపాదించేందుకు 5 మార్గాలు మీకోసం

  • - ఎలా? /
  • 5 సంవత్సరాల క్రితం /

ఈ రోజుల్లో ప్రతి అంశం డబ్బుతో ముడిపడి ఉంది. డబ్బు లేకుంటే ఏ పని జరిగే అవకాశం ఉండటం లేదు. కాబట్టి అందరూ వీలైనంత ఎక్కువగా డబ్బులు సంపాదించేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఇందుకోసం ఎన్నో మార్గాలు ఉన్నప్పటికీ కొన్ని మార్గాల్లోనే డబ్బు సంపాదించాలనుకుంటారు. ఇక చాలాంది ఇంటి దగ్గర నుంచే డబ్బును సంపాదించే మార్గం కోసం వెతుకుతుంటారు. అలాంటి వారికోసం మార్కెట్లో కొన్ని రకాల మార్గాలు ఉన్నాయి, అవేంటో చూద్దాం. 

పెయిడ్ టు క్లిక్ (పీటీసీ)
పెయిడ్ టు క్లిక్ (పీటీసీ) ద్వారా డబ్బులు సంపాదించవచ్చని చాలామందికి తెలియదు. అడ్వర్టైజ్‌మెంట్లపై క్లిక్ చేసి, దాదాపు 30 సెక్లను వాటిని చదివితే మీకు డబ్బులు వస్తాయి.ఈ  పీటీసీ వెబ్‌సైట్లు  అడ్వర్టైజర్స్, వ్యూయర్ల మధ్య వారధిగా పనిచేస్తాయి. ఇవి అడ్వర్టైజర్ల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వ్యూయర్లకు వారి పనితీరును బట్టి ఇస్తాయి.వ్యూయర్లు మనీ లేదా గిఫ్ట్ కార్డుల రూపంలో డబ్బు సంపాదించవచ్చు. చాలా వెబ్‌సైట్లు ఈ సేవలు అందిస్తున్నాయి. అయితే వీటిల్లో ఎక్కువ మోసపూరిత సైట్లు ఉన్నాయి. అందుకే వెబ్‌సైట్ జాగ్రత్తగా పరిశీలించి ఎంటర్ కాగలరు. 

గూగుల్ యాడ్‌సెన్స్
గూగుల్ యాడ్‌సెన్స్ అనేది ఒక అడ్వర్టైజ్‌మెంట్ సర్వీస్. ఇది చాలా పాపులర్ అయిన సైట్. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది దీని మీద ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. అయితే ఇక్కడ మనీ సంపాదన అంత సులువు కాదు. మరి ఇందులో ఎలా సంపాదించాలనే దాని మీద చాలా మంది కుస్తీలు పడుతుంటారు. ముందుగా మీరు వెబ్‌సైట్ లేదా బ్లాగ్ లేదా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి, కంటెంట్ అందించాలి. మీ వెబ్‌సైట్ లేదా ఛానల్ ట్రాఫిక్ ప్రాతిపదికన మీకు డబ్బులు వస్తాయి.

ఆన్‌లైన్ సెల్లింగ్ 
ఆన్‌లైన్ సెల్లింగ్ ద్వారా కూడా డబ్బులు సంపాదించవచ్చు. ఇది మరొక ఆదాయ వనరు. మీరు ఇంటి  దగ్గరే  ఏదైనా ప్రొడక్టులను తయారు చేస్తూ ఉంటే.. వాటి విక్రయం కోసం ఆన్‌లైన్‌లో స్టోర్ ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రత్యేకమైన వెబ్‌సైట్‌తోపాటు ఆన్‌లైన్ రిటైలర్లు అయిన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, జొమాటో వంటి వాటితో కూడా భాగస్వామ్యం కుదుర్చుకోవచ్చు.

ఫ్రీలాన్సర్‌
ఇప్పుడు చాలా కంపెనీలు ఈ సేవలను ఆఫర్ చేస్తున్నాయి. ఆసక్తి ఉన్న యూజర్లు ఫ్రీలాన్సర్‌గా పనిచేస్తూ కూడా డబ్బులు సంపాదించవచ్చు. కంపెనీకి కావాల్సిన వాటిని ఫ్రీలాన్సింగ్ సేవల రూపంలో వారికి అందిస్తూ ఆన్‌లైన్‌లో డబ్బు సంపాదించొచ్చు. రైటర్లు, గ్రాఫిక్ డిజైనర్లు, సాఫ్ట్‌వేర్ డెవలపర్లు ఇతర రంగాల్లో పనిచేసే  వారికి ఎక్కువ డిమాండ్ ఉంది. ఇంట్లో నుంచే పనిచేస్తూ డబ్బులు పొందొచ్చు. 

ఆన్‌లైన్ మార్కెట్ ట్రేడింగ్
ఇది చాలా రిస్కుతో కూడుకున్నది. అయినప్పటికీ ఆన్‌లైన్ మార్కెట్ ట్రేడింగ్ చేయాలని ఆసక్తి ఉంటే దాని ద్వారా డబ్బులు సంపాదించవచ్చు. ప్రస్తుతం చాలా స్టాక్ బ్రోకరేజ్ కంపెనీలు ఈ సేవలు అందిస్తున్నాయి. వీటి ద్వారా ఈక్విటీలు, కమోడిటీస్‌లో ట్రేడింగ్ చేయవచ్చు. మార్కెట్‌లో లాభాలతోపాటు నష్టాలు కూడా ఉంటాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. లేకుంటే నష్టపోయే ప్రమాదం  ఉంది. 

జన రంజకమైన వార్తలు