• తాజా వార్తలు

ఎయిర్ టెల్ లో బ్యాల‌న్స్ ట్రాన్స్‌ఫ‌ర్ చేయడం ఎలా?

  • - ఎలా? /
  • 6 సంవత్సరాల క్రితం /

ఓ టెలికాం నెట్‌వ‌ర్క్ క‌నెక్ష‌న్‌గ‌ల ఫోన్ నంబ‌ర్ నుంచి అదే నెట్‌వ‌ర్క్‌లోని మ‌రో నంబ‌రుకు టాక్‌టైమ్‌, డేటా బ్యాల‌న్స్‌ను ఎలాంటి ఇబ్బందీ లేకుండా బ‌దిలీ చేసుకోవడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. అది ‘‘ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌, ఐడియా, ఎయిర్‌సెల్‌, రిల‌య‌న్స్‌, రిల‌య‌న్స్ జియో, ఎంటీఎన్ఎల్‌, బీఎస్ఎన్ఎల్‌, టాటా డొకోమో, ఎంటీఎస్‌, టెలినార్‌, వీడియోకాన్‌...’’ నెట్‌వ‌ర్క్ ఏదైనా స‌రే- ఎటువంటి జంఝాటం లేకుండా బ‌దిలీ చేసుకోవ‌చ్చు. ఒక్కో నెట్‌వ‌ర్క్‌లో ఆయా USSD కోడ్స్‌, ప‌ద్ధ‌తులు ఎలా ఉంటాయో చూసేముందు మీ నెట్‌వ‌ర్క్ క‌స్ట‌మ‌ర్ కేర్ నంబ‌రును సిద్ధంగా ఉంచుకోండి:- 
ఎయిర్‌టెల్ బ్యాల‌న్స్ ట్రాన్స్‌ఫ‌ర్‌ 
ఈ ఫీచ‌ర్‌ను ఎయిర్‌టెల్ ఇటీవ‌లే ప్రారంభించింది. దీన్ని వాడుకోవ‌డం ఎలాగంటే- మీరు ఎయిర్‌టెల్ క‌స్ట‌మ‌ర్ కావ‌డంతోపాటు మీ మిత్రుడు లేదా మ‌రెవ‌రైనా అదే నెట్‌వ‌ర్క్ నంబ‌ర్ క‌లిగి ఉండాలి. మీ టాక్‌టైమ్ లేదా డేటా బ్యాల‌న్స్ నుంచి వారికి బ‌దిలీ చేయాల‌ని భావిస్తే గుర్తుంచుకోవాల్సిన అంశాలిలా ఉంటాయి:-  మీరు రూ.5, 10, 20 వ‌గైరా  డినామినేష‌న్ల‌లో టాక్‌టైమ్ లేదా డేటా బ్యాల‌న్స్‌ను బ‌దిలీ చేసుకోవ‌చ్చు. అదీ ఒక రోజులో ఒక్క‌సారి మాత్ర‌మే ఇందుకు వీలుంటుంది. ఇలా బ్యాల‌న్స్‌ ట్రాన్స్‌ఫ‌ర్ చేసినందుకుగాను ఆ విలువ‌తోపాటు కొంత బ్యాల‌న్స్‌ను స‌ర్వీస్ చార్జికింద‌ ఎయిర్‌టెల్ త‌గ్గిస్తుంది. మీరు పొర‌పాటున ఒక నంబ‌రుకు బ‌దులు మ‌రొక నంబ‌రుకు బ‌దిలీ చేస్తే అందుకు నెట్‌వ‌ర్క్ బాధ్య‌త వ‌హించ‌దు.
బ‌దిలీ ఎలా చేయాలంటే...
మీ ఎయిర్‌టెల్ నంబ‌రు నుంచి మొద‌ట *141# డ‌య‌ల్ చేయండి. అప్పుడు మీకు ‘‘Please Exit Now and you will receive the Main Menu’’ అన్న మెసేజ్ క‌నిపిస్తుంది. అలా క‌నిపించ‌గానే exit నొక్కి కాసేపు ఆగితే, Menu ప్ర‌త్య‌క్ష‌మ‌వుతుంది. అప్పుడు ‘టాక్‌టైమ్ షేరింగ్‌’ కోసం Answer  బ‌ట‌న్ సెలెక్ట్ చేసి, ముందు ‘‘1’’ని, త‌ర్వాత ‘‘send’’ను నొక్కండి. ఆపైన మీరు ఎంత టాక్‌టైమ్ పంపాల‌నుకుంటున్నారో ఆ విలువ‌ను ఎంట‌ర్ చేయండి (ఇలా క‌నిష్ఠంగా రూ.5, గ‌రిష్ఠంగా రూ.40దాకా పంపించ‌వ‌చ్చు). టాక్‌టైమ్ అయితే ఇలా రోజులో ఐదుసార్లు, నెల‌లో 30 సార్లు బ‌దిలీ చేసుకోవ‌చ్చు. అనంత‌రం స‌ర్వీసు చార్జీ ఎంత‌న్న‌ది క‌నిపిస్తుంది. ఆ త‌ర్వాత మీ మిత్రుడి ఫోన్ నంబ‌రును ఎంట‌ర్ చేసి, ‘send’ బ‌ట‌న్ నొక్కండి. అటుపైన ఈ లావాదేవీకి సంబంధించిన వివ‌రాలతో మీకు మెసేజ్ వ‌స్తుంది. అలాగే మీరు బ‌హుమ‌తిగా బ‌దిలీ చేసిన టాక్‌టైమ్ గురించి మీ మిత్రుడికీ మెసేజ్ వెళ్తుంది.

జన రంజకమైన వార్తలు