సెల్‌ఫోన్ సిమ్ కార్డ్ నుంచి బ్యాంక్ అకౌంట్ దాకా, ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఫైలింగ్ నుంచి ఇంటర్మీడియట్ ప్రవేశాల వరకు అన్నింటికీ ఇప్పుడు ఆధారే ఆధారం. అందుకు తగ్గట్లుగానే ఇండియాలో దాదాపు 90% మంది ఆధార్ నమోదు చేయించుకున్నారు. అయితే అందులో ఇచ్చిన వ్యక్తిగత వివరాలు దుర్వినియోగం అవుతాయేమోనన్న భయం చాలా మందిలో ఉంది. ఆధార్ కార్డ్ కోసం ఇచ్చిన బయోమెట్రిక్ డిటైల్స్ (ఐరిస్, ఫింగర్ ప్రింట్, ఫొటో) వంటివి ఇప్పటివరకు మిస్‌యూజ్ కాలేదని, అలాగే ఎలాంటి సైబర్ అటాక్‌కు గురి కాలేదని ఆధార్ నమోదు సంస్థ యూఐడీఏఐ (UIDAI) పదేపదే చెబుతోంది. అయినా సేఫ్టీ కోసం బయోమెట్రిక్ డేటా లాక్ చేసుకోండి అని సూచిస్తోంది.
బయోమెట్రిక్స్‌ను లాక్/ అన్‌లాక్ చేయడం ఎలా?
* https://resident.uidai.gov.in/biometric-lock యూఆర్ ఎల్‌ను బ్రౌజర్‌లో టైప్ చేయండి
* ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి
* సెక్యూరిటీ కోడ్ లేదా కేప్చా ఎంటర్ చేయండి
* ఇప్పుడు మీకు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి లాక్ చేసుకోవచ్చు.
* అన్‌లాక్ కూడా సేమ్ ప్రొసీజర్‌లో చేయవచ్చు.
* ఆధార్ నమోదు చేసుకున్నప్పుడు మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్‌కే ఓటీపీ వస్తుంది కాబట్టి ఆ నెంబర్ కంపల్సరీగా ఉండాలి. మీ మొబైల్ నెంబర్ ఆధార్‌లో రిజిస్టర్ కాకపోయినా, నెంబర్ మారినా ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్‌కు వెళ్లి ఫాం నింపి ఆ నెంబర్‌ను మీ ఆధార్ డిటెయిల్స్‌కు ఎటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది.
లాక్ చేశాక ఏమవుతుంది?
బయోమెట్రిక్ లాక్ అయ్యాక దాని అథెంటికేషన్ కూడా బ్లాక్ అవుతుంది. ఆధార్ యూజర్ కూడా తన ఫింగర్ ప్రింట్స్, ఐరిస్‌ను యూజ్ చేయలేడు. లాక్ ఎలా చేశామో అదే ప్రొసీజర్‌లో అన్‌లాక్ చేస్తేనే యూజ్ చేయగలుగుతారు. లాక్ ఓపెన్ చేసి యూజర్ వాడిన తర్వాత దాన్ని అలాగే వదిలేసినా 10 నిముషాల్లో ఆటోమేటిగ్గా లాక్ అయిపోతుంది. బయోమెట్రిక్స్ లాక్ చేసినా ఆధార్ నెంబర్‌తో లింకప్ అయి ఉన్న బ్యాంక్ ట్రాన్స్‌ఫర్స్, ఇతర ట్రాన్సాక్షన్స్ అన్నీ యథాప్రకారమే నడుస్తాయి. బయోమెట్రిక్స్ లాక్ అయ్యాక మీరు ఫింగర్‌ప్రింట్ లేదా ఐరిస్‌తో ఆధార్ డేటాను యాక్సెస్ చేయాలని చూస్తే 330 ఎర్రర్ కోడ్ వస్తుంది.