• తాజా వార్తలు

పేటీఎం నుండి మీ ఆధార్‌ను డీ-లింక్ చేయ‌డం ఎలా?

  • - ఎలా? /
  • 6 సంవత్సరాల క్రితం /

దేశ ప్ర‌జ‌లు త‌మ మొబైల్ నంబ‌ర్లు, బ్యాంకు ఖాతాలు, డిజిట‌ల్ వాలెట్లు త‌దిత‌రాల‌తో ఆధార్‌ను అనుసంధానించే అవ‌స‌రం లేద‌ని సుప్రీం కోర్టు ఇటీవ‌లి తీర్పులో స్ప‌ష్టం చేసింది. అయిన‌ప్ప‌టికీ ఫొటో, వ్య‌క్తిగ‌త గుర్తింపు నిర్ధార‌ణ ప‌త్రంగా ఆధార్ చెల్లుబాటు కొన‌సాగుతుంద‌ని పేర్కొంది. కానీ, ఇక‌పై కొత్త బ్యాంకు ఖాతా తెర‌వ‌డానికి, మొబైల్ క‌నెక్ష‌న్ తీసుకోవ‌డం వంటివాటికోసం ఆధార్ త‌ప్ప‌నిస‌రి కాద‌ని తీర్పులో ప్ర‌క‌టించింది. ఈ నేప‌థ్యంలో డిజిట‌ల్ మొబైల్ పేమెంట్ యాప్ పీటీఎం ఖాతాస‌హా ఇత‌ర‌త్రా అనుసంధానించిన మీ ఆధార్ వివ‌రాల‌ను డీ-లింక్ చేయ‌డం గురించి ఆలోచిస్తున్నారా? అయితే, ముందుగా పేటీఎం నుంచి ఇలా డీ-లింక్ చేయండి:-
   మొట్ట‌మొద‌ట పేటీఎం క‌స్ట‌మ‌ర్ కేర్ నం.01204456456కు కాల్ చేసి, IVRతో క‌నెక్ట్ కండి. ఆ త‌ర్వాత వినిపించే ఆప్ష‌న్ల‌లో మీ భాష కోసం 1 నొక్కండి. అనంత‌రం KYC సంబంధిత వివ‌రాల కోసం 2 నొక్కండి. మీరు కాల్ చేసిన ఫోన్ నంబ‌రుకు సంబంధించి KYCపై సందేహం ఉన్న‌ట్ల‌యితే మ‌రోసారి 1 నొక్కండి. మ‌రేదైనా ఫోన్ నంబ‌రుకు సంబంధించిన KYCపై సందేహాలుంటే 2 నొక్కి ఆ ఫోన్ నంబ‌రును ఎంట‌ర్ చేయండి. క‌స్ట‌మ‌ర్ కేర్‌ను అందుకోవ‌డానికి 1 నొక్కండి. ఇప్పుడు మీ పీటీఎం ఖాతా పాస్ కోడ్ ఎంట‌ర్ చేయండి. అటుపైన క‌స్ట‌మ‌ర్ కేర్ ఎగ్జిక్యూటివ్‌తో మాట్లాడేందుకు 9 నొక్కండి. వారు అందుబాటులోకి రాగానే పేటీఎంతో అనుసంధానించిన మీ ఆధార్ నంబ‌రును తొల‌గించాల్సిందిగా కోరండి. 
   ఇదంతా పూర్త‌య్యాక మీ గుర్తింపును నిర్ధారించుకోవ‌డం కోసం క‌స్ట‌మ‌ర్ కేర్ ఎగ్జిక్యూటివ్ మీ పుట్టిన తేదీ, ఈమెయిల్ ఐడీ త‌దిత‌రాల‌ వివ‌రాలు అడుగుతారు. మీరు ఆ వివ‌రాల‌న్నీ ఇచ్చిన త‌ర్వాత మీ ఖాతాను ప‌రిశీలించి నిర్ధారిస్తారు. అనంత‌రం సంపూర్ణ నిర్ధార‌ణ కోసం మీ ఆధార్ కార్డు ఫొటోను పంపాల్సిందిగా కోరుతూ ఈమెయిల్ పంపుతారు. మీరు ఆ ఫొటో పంపిన త‌ర్వాత ఆధార్ డీ-లింక్ కోసం మీ అభ్య‌ర్థ‌న‌ను రూఢి చేసుకోవాల‌ని సూచిస్తూ మ‌రో ఈమెయిల్ పంపుతారు.  మీరు అది పూర్తిచేశాక పేటీఎం ఖాతానుంచి మీ ఆధార్ వివ‌రాలు తొల‌గించ‌డానికి 72 గంట‌ల స‌మ‌యం ప‌డుతుంది. ఆ గ‌డువు ముగిశాక పేటీఎం నుంచి ఆధార్ తొల‌గింపు పూర్త‌యిన‌ట్లు నిర్ధారిస్తూ మీకు మెయిల్ అందుతుంది.

జన రంజకమైన వార్తలు