• తాజా వార్తలు

వాట్సాప్ లో మనం ఎవరినైనా బ్లాక్ చేసినప్పుడు ఏంఏం జరుగుతుంది?

  • - ఎలా? /
  • 5 సంవత్సరాల క్రితం /

వాట్సాప్ లో మనకు తెలియని అనుచిత నెంబర్స్ నుంచి మెసేజ్, డాక్యుమెంట్స్, ఫోటోలు వస్తూ చికాకు పెట్టిస్తుంటాయి. ఆ సమయంలో మనం ఆ నెంబర్ ను బ్లాక్ చేస్తాం. కానీ వాట్సాప్ లో మనం వారిని బ్లాక్ చేసినప్పుడు ఏం జరుగుతుందో మీకు తెలుసా.....తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదవండి. 

చివరిసారిగా ఎప్పుడు చాట్ చేశారో చూడొచ్చు....
వాట్సాప్ చాట్ లిస్టులో మీరు బ్లాక్ చేసినవారి పాత మెసేజ్ లు, లేదా మీడియా ఫైళ్లతో ఎలాంటి ప్రమాదం ఉండదు. ఎందుకంటే అవి మీ ఫోన్లో స్టోర్ చేయబడి ఉంటాయి. 
కొత్త మెసేజ్ లు....
మీకు సంబంధించిన విషయాలను గోప్యంగా ఉంచడానికి వాట్సాప్ బ్లాక్ చేసినట్లు కనిపించదు. కాబట్టి మీరు బ్లాక్ చేసిన వ్యక్తి ఇప్పటికీ టైపింగ్ బాక్స్ ను చూడవచ్చు. మెసేజ్  కూడా పంపుతాడు. కానీ ఆ మెసేజ్ లు మీకు కనిపించవు. మీరు బ్లాక్ చేసిన వ్యక్తిని వాట్సాప్ లో కాంటాక్ట్ కాలేరు. మెసేజ్ పంపించాలనుకుంటే...బ్లాక్ చేసిన వ్యక్తిని అన్ బ్లాక్ చేసినట్లయితేనే....మెసేజ్ పంపించవచ్చు. 
బ్లాక్ చేసిన మెసేజ్ లను చూడటం...
ఒక కాంటాక్ట్ ను అన్ బ్లాక్ చేసిన తర్వాత...అకౌంట్ బ్లాక్ చేసిన సమయంలో వచ్చిన మెసేజ్ లు మీ ఫోన్లో కనిపించావు. అలాంటి మెసేజ్ లను తిరిగి పొందటానికి ఛాన్స్ లేదు. 
రీడ్ రిసీప్స్.....
రీక్యాప్ చేయడానికి వాట్సాప్ మెసేజ్ రిసీప్స్ చూపించడానికి మూడు రకాల టిక్కులు, లేదా చెక్ మార్కులు ఉంటాయి. ఒకటి గ్రే కలర్, రెండోది డబుల్ గ్రే కలర్, మూడోది బ్లూ కలర్ లో ఉంటుంది. బ్లూ కలర్ లో ఉన్నట్లయి మెసేజ్ చదివినట్లు అర్థం. బ్లాక్ చేసిన వ్యక్తి మెసేజ్ లు పంపించినప్పుడు...ఈ వ్యక్తికి ఒక గ్రే కలర్ టిక్ మార్క్ మాత్రమే కనిపిస్తుంది. 
కాల్ రింగ్ అవడం.....
బ్లాక్ చేసిన వ్యక్తి ఇప్పటికీ మీ వాట్సాప్ నెంబర్ కు కాల్ చేయవచ్చు. కాల్ చేసినట్లయితే రింగ్ అవుతున్నట్లు వినిపిస్తుంది. కానీ వాట్సాప్ కు  కాల్ వచ్చినట్లు మీకు ఎలాంటి డిస్ ప్లే కనిపించదు. మీకు ఎలాంటి ఇన్ కమింగ్ కాల్ కూడా రాదు. అన్ బ్లాక్ చేసేంత వరకు బ్లాక్ చేసిన కాంటాక్ట్ నెంబర్ కు కాల్ చేయలేరు. 
ఆన్ లైన్ , లాస్ట్ సీన్ చూడటం.....
వాట్సాప్ లో రెండు రకాల స్టేటస్ లు ఉంటాయి. ఆన్ లైన్, చివరిగా చూసినది. మీరు వాట్సాప్ లో యాక్టివ్ గా ఉన్నప్పుడు....యాప్ ముందు భాగంలో మీ వాట్సాప్ కాంటాక్ట్ లు ఆన్ లైన్లో స్టేటస్ చూస్తారు. చివరిసారి వ్యక్తి వాట్సాప్ ఉపయోగించిన టైంను చూపిస్తుంది. అయితే లాస్ట్ సీన్ స్టేటస్ ను నిలిపివేయవచ్చు. కానీ ఆన్ లైన్ లో ఉన్నట్లు స్టేటస్ ను మాత్రం నిలిపివేయలేరు. 
కానీ మీరు ఎవరినైనా బ్లాక్ చేసినప్పుడు...మీరు ఆన్ లైన్లో ఉన్నప్పుడు వారు చూడలేరు. చాట్ థ్రేడ్లో మీరు పేరు కింద ఉన్న స్టేటస్ లొకేషన్ ఖాళీగా కనిపిస్తుంది. 
ప్రొఫైల్ పిక్చర్ ....
మీరు ఎవరినైనా బ్లాక్ చేసినప్పుడు...వాళ్లు మీ ప్రొఫైల్ పిక్చర్ చూడలేరు. మీ కాంటాక్ట్ డిఫాల్ట్ వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్ కనిపిస్తుంది. మీరు బ్లాక్ చేసిన వ్యక్తి ప్రస్తుత, భవిష్యత్ ప్రొఫైల్ పిక్చర్ అప్ డేట్ చేసినట్లయితే మీరు చూడవచ్చు. కానీ మీరు బ్లాక్ చేయకపోయినట్లయితే...ఇమేజ్ చూస్తారు. 
ఎవరినైనా బ్లాక్ చేయడం ఎలా...
మీ ఆండ్రాయిడ్ ఫోన్లో ఒకరిని బ్లాక్ చేయడానికి వాట్సాప్ యొక్క ఎగువ కుడి కార్నర్ లో మూడు డాట్స్ ఉన్నగుర్తును నొక్కండి. సెట్టింగ్స్ > అకౌంట్>ప్రైవసీ>బ్లాక్ కాంటాక్ట్స్ కు నావిగేట్ చేయండి. యాడ్ ఐకాన్ పై నొక్కండి. ఇప్పుడు మీరు బ్లాక్ చేయాలనుకున్న కాంటాక్ట్ ను సెలక్ట్ చేసుకోండి. 
వాట్సాప్ బ్లాక్....
ఐఫోన్ లో సెట్టింగ్స్ > అకౌంట్>ప్రైవసీ> బ్లాక్> కొత్తది యాడ్ చేయండి. మీరు బ్లాక్ చేయాలనుకుంటున్న కాంటాక్ట్ సెలక్ట్ చేసుకోండి. అన్ బ్లాక్ చేయడానికి స్టెప్స్ ఫాలో అవ్వండి. బ్లాక్ చేసిన లిస్టు నుంచి కాంటాక్ట్ తొలగించండి. మీకు తెలియని నెంబర్స్ బ్లాక్ చేయడానికి...వారి చాట్ ను ఓపెన్ చేసి బ్లాక్ ఐకాన్ ను నొక్కండి. 
వాట్సాప్ బ్లాక్ చేసినట్లు తెలుసుకోవడం ఎలా....
మిమ్మల్ని ఎవరు బ్లాక్ చేయారో గుర్తించేందుకు ప్రత్యేకంగా ఎలాంటి యాప్ అంటూ ఏదీ లేదు. కానీ మిమ్మల్ని బ్లాక్ చేయారు అని మీరు అనుకున్నట్లయితే....మీ డౌట్ ను క్లియర్ చేసుకునేందుకు షేర్ లాక్ చూడండి. ఎందుకంటే మీరు ఎవరినైనా బ్లాక్ చేసినప్పుడు అనేక విషయాలు జరుగుతాయి. వాటిని మీరు గుర్తించాలి 
 

జన రంజకమైన వార్తలు