చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్లకు తమ బిజినెస్‌ను ముందుకు తీసుకెళ్లాలన్నా.. విస్తరించాలన్నా కచ్చితంగా లోన్లు తీసుకోవడం తప్పనిసరి. అంటే వ్యాపారంలో మరింత వృద్ది సాధించడానికి లేదా మౌలిక వసతుల కోసం ఈ లోన్లను తీసుకొంటూ ఉంటారు,. అయితే ఈ లోన్లను తీసుకోవడానికి ఒక్కొక్కరూ ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటారు. ఎక్కువమంది ప్రభుత్వం ఇచ్చే లోన్లను తీసుకుంటారు. కొంతమంది ప్రైవేటు సంస్థలు ఇచ్చే లోన్లపై ఆధారపడతారు. అలా లోన్లు ఇస్తున్న సంస్థల్లో బజాజ్ ఫైనాన్స్ ఒకటి. మరి బజాజ్ ఫైనాన్స్ నుంచి ప్రి అప్రూవ్డ్ లోన్స్ పొందడం ఎలాగో చూద్దామా..
బిజినెస్ లోన్ కోసం.
బిజినెస్ లోన్ కోసం అప్లై చేసే ముందు కొన్ని విషయాలు పరిగణనలోకి తీసుకోవాలి. లోన తీసుకోవడానికి అవసరమైన సాలిడ్ బిజినెస్ ప్లాన్‌ను తయారు చేసుకోవాలి. ముందుగా లోన్ అమౌంట్ ఎంత అవసరం అవుతుందో.. దానికి ఎలాంటి ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ కావాలో డిసైడ్ చేసుకోవాలి. బజాజ్ ఫైనాన్స్ తన కస్టమర్ల కోసం క్విక్, ఇజీ, ప్రి అప్రూవ్డ్ లోన్స్‌ను మంజూరు చేస్తుంది.
1. అర్హత ప్రకారం కస్టమర్లు తమ లోన్‌ను ఉపయోగించుకునే వీలు ఉంటుంది. దీనిలో వడ్డీతో పాటు ఈఎంఐ మాత్రమే కట్టే వీలు ఉంది. అసలు అమౌంట్ మాత్రం లోన్ గడువు లోపు కట్టుకోవచ్చు. ప్రి అప్రూవ్డ్ లోన్ తీసుకునే కస్టమర్లకు ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు ఉంటాయి. మిగిలిన సంస్థలతో పోలిస్తే ఈ రేట్లు తక్కువగా ఉండడమే ఇక్కడ విశేషం.
2. తక్కువ డాక్యుమెంట్లతో కూడా సులభంగా లోన్ ఇవ్వడం బజాజ్ ఫైనాన్స్ ప్రత్యేకత. ప్రి అప్రూవ్డ్ లోన్ అమౌంట్ రూ.30 లక్షల వరకూ ఉంటుంది. ఈ అమౌంట్‌ను ఇన్విస్ట్‌మెంట్‌కు, వర్కింగ్ క్యాపిటల్, ఇన్వెంటరీ, బిజినెస్ ఆపరేషన్స్ కోసం ఉపయోగించుకోవచ్చు.
3. ఏ సమయంలోనైనా సులభంగా ఈ లోన్‌కు అప్లై చేసుకోవచ్చు. తక్కువ టైమ్‌లోనే మీకు లోన్ అమౌంట్ వచ్చేస్తుంది.