స్నాప్‌చాట్ యాప్ గురించి మీకు తెలిసే ఉంటుంది.సాధారణంగా స్నాప్‌చాట్‌లో కెమెరాతో తీసిన ఫోటోను మీ స్నేహితులకు పంపించి వారితో చాటింగ్ చేసుకోవచ్చు. స్నాప్‌చాట్ మాదిరిగానే ఫేస్‌బుక్ కూడా ఒక కొత్త ఫీచర్‌ను యూజర్లకు అందుబాటులోకి తీసుకువచ్చింది.అదే కెమెరా ఫ్రేమ్స్.ఈ ఫీచర్‌తో ఫేస్‌బుక్‌లో స్వంతగా ఫ్రేమ్స్ ను క్రియేట్ చేసుకోవచ్చు.
మీకు నచ్చినట్లుగా స్వంతగా ఫేస్‌బుక్ కెమెరా ఫ్రేమ్ లను క్రియేట్ చేయడం చాలా సులభం. మీకు కావాల్సిందల్లా ఫోటో ఫ్రేమ్, ఫేస్‌బుక్ అకౌంట్. కెమెరా ఫ్రేమ్ లను క్రియేట్ చేసుకోవడానికి పెయింట్ డాట్ నెట్, జిఐఎంపి, క్రిట వంటి సాఫ్ట్ వేర్లను ఉచితం ఉపయోగించుకోవచ్చు. వీటితో పాటుగా అడబ్ ఫోటోషాప్, ఎఫినిటి ఫోటో వంటి ప్రీమియం సాఫ్ట్ వేర్లను కూడా ఉపయోగించుకోవచ్చు. అయితే ఫోటో ఎడిటింగ్ గురించి మీకు అవగాహన లేకపోయినా పర్వాలేదు. ఎందుకంటే ఈ సాఫ్ట్ వేర్ ద్వారా క్రియేట్ చేసిన ఫోటో ఫ్రేమ్ బ్యాక్ గ్రౌండ్ ఫోటోను సులభంగా తొలగించుకోవచ్చు.కెమెరా ఫ్రేమ్స్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం.
ఫ్రేమ్ ఫోటోను క్రియేట్ చేయాలనుకుంటే....ముందుగా మీ ఫేస్‌బుక్ అకౌంట్ ను ఓపెన్ చేయండి. ఇప్పుడు ఫేస్‌బుక్ ఫ్రేమ్ స్టూడియో ఆప్షన్ ద్వారా కెమెరా ఫ్రేమ్స్ ను క్రియేట్ చేసుకోవచ్చు. ఫ్రేమ్ స్టూడియో అనే ఒక ఆప్షన్ మీకు కనిపిస్తుంది. లేదంటే ఓపెన్ ఫ్రేమ్ స్టూడియో బటన్నుప్రెస్ చేయండి. ఇప్పుడు ఈ రెండు బటన్లు మీ స్క్రీన్ పై ఒక విండోను ఓపెన్ చేస్తాయి. ఇక్కడ మీ కెమెరా ఫ్రేమ్ ను క్రియేట్ చేసుకోవచ్చు.
డిజైన్ ...
ఫేస్‌బుక్ కెమెరా ఎఫెక్ట్ ను క్రియేట్ చేయడానికి ఫేస్‌బుక్ కెమెరా ఆప్షన్ కు ఎడమవైపు ఉన్న ప్రేమ్ క్రియేట్ ఆప్షన్ను సెలక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీరు ముందుగా క్రియేట్ చేసిన ఫ్రేమ్ ఫోటోను అప్ లోడ్ చేయండి. ఫోటోను ఫ్రేమ్ లో సరిగ్గా అమర్చండి. ఇప్పుడు కెమెరా ఫ్రేమ్ పొర్ట్రెయిట్, ల్యాండ్ స్కెప్ పై ఫోటో ఫ్రేమ్ ఎలా ఉందనేది విండోలో కనిపిస్తుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత....తదుపరి బటన్ పై క్లిక్ చేయండి.
మీ పేరు, ట్యాగ్స్, లొకేషన్, షెడ్యూల్ లాంటి వివరాలను నమోదు చేయాలి. ఇలా మీకు కావాల్సిన ఫ్రేమ్ రెడీ అవుతుంది. అయితే ఫేస్‌బుక్‌లో ఈ ఫ్రేమ్ అప్ లోడ్ కావడానికి కొన్ని గంటల సమయం పడుతుంది.