సోషల్ మీడియా అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చే పేరు ఫేస్‌బుక్. అంతగా ప్రాచుర్యంపొందిన సోషల్ మీడియా ఫ్లాట్‌ఫారం ఇది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 కోట్ల మందికి ఫేస్‌బుక్ అకౌంట్స్ ఉన్నాయంటే ఫేస్‌బుక్ ఎంత పాపులరయిందో ఊహించుకోవచ్చు. ఫేస్‌బుక్ అకౌంట్లోకి లాగిన్ అయి మీరు ఎవరి అకౌంట్‌నైనా చూడొచ్చు. అయితే ఫేస్‌బుక్ అకౌంట్లోకి లాగిన్ కాకుండా ఎవరి డిటెయిల్స్ లేదా అకౌంట్లు చూడకుండా ఫేస్‌బుక్ ఆంక్షలు పెట్టింది. అయితే దీనికి ప్రత్యామ్నాయాలు చాలానే ఉన్నాయి. మీరు మీ ఫేస్‌బుక్ అకౌంట్లోకి లాగిన్ అవకుండా అసలు ఫేస్‌బుక్ అకౌంట్ లేకపోయినా కూడా మీకు కావాల్సిన ఫేస్‌బుక్ అకౌంట్, ఫేస్‌బుక్ పేజీ, ఫేస్‌బుక్ గ్రూప్‌లను కూడా చూడొచ్చు. దీనికిచాలా మార్గాలున్నాయి. అందులో బాగా ఈజీ మెథడ్స్ ఇవీ..
1. పేరు ద్వారా ఫేస్‌బుక్ అకౌంట్‌ను సెర్చ్‌చేయడం
మీకు పేరు తెలిసి ఆ పర్సన్ ఫేస్‌బుక్ అకౌంట్ చూడాలనుకుంటే https://www.facebook.com/public/Find-Person అని బ్రౌజర్‌లో టైప్ చేయండి. లెఫ్ట్ సైడ్‌లో Find Person అని సెర్చ్ బాక్స్ కనిపిస్తుంది. అక్కడ మీరు ఎవరి అకౌంట్ చూడాలనుకుంటున్నారో ఆ పేరు టైప్ చేసి సెర్చ్ క్లిక్ చేయండి. ఆ పేరుతో ఉన్న అకౌంట్లన్నీ కనిపిస్తాయి. కరెక్ట్ అకౌంట్ మ్యాచ్ కావాలంటే ఊరి పేరు, కాలేజ్ లేదా స్కూల్ క్వాలిఫికేషన్ ఇలాంటి డిటెయిల్స్ టైప్ చేస్తే చాలు.
2. ఫేస్‌బుక్ డైరెక్టరీ ద్వారా సెర్చ్ చేయడం
వ్యక్తులే కాదు ఫేస్‌బుక్ గ్రూప్,ఫేస్‌బుక్ పేజీ లేదా ఫేస్‌బుక్‌లో ఫేవరెట్ ప్లేస్, టాపిక్ కావాలన్నా కూడా అకౌంట్లోకి లాగిన్ అవకుండానే సెర్చ్‌చేయొచ్చు. ఇందుకోసం బ్రౌజర్‌లో https://www.facebook.com/directory/ అని టైప్ చేసి క్లిక్ చేయండి. పీపుల్,పేజెస్, ప్లేసెస్ అనే మూడు ఆప్షన్లు కనిపిస్తాయి. దానికింద ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో పేర్లు, గ్రూప్‌లు,పేజీలు అన్నీ ఉంటాయి. మీకు కావాల్సిన పేరు, ప్లేస్ లాంటివి తెలిస్తే కుడివైపున ఉన్నసెర్చ్ బాక్స్‌లో టైప్ చేసి క్లిక్ చేస్తే రిలేటెడ్ అకౌంట్స్, పేజీలు, ప్లేస్‌లు, గ్రూప్స్ అన్నీ కనిపిస్తాయి. ఆ పేరు మీద క్లిక్ చేస్తే ఆ అకౌంట్లోకి వెళ్లొచ్చు. కానీ ఆ వ్యక్తి లేదా గ్రూప్, పేజీలో ప్రైవసీ సెట్టింగ్స్‌యాక్టివేట్ చేసి ఉంటే మాత్రం అవి ఈ లిస్ట్‌లో పేరు కనిపించినా వాటి డిటెయిల్స్ కనిపించవు.అవి కావాలంటే మీ అకౌంట్‌తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.
3.గూగుల్ ద్వారా సెర్చ్‌చేయడం
గూగుల్ ద్వారా కూడా సెర్చ్‌చేయొచ్చు. బ్రౌజర్‌లో “Site: Facebook.com అని టైప్ చేసి పక్కన మీకు చూడాలనుకుంటున్న ఫేస్‌బుక్ అకౌంట్ పేరును ఎంటర్ చేసిసెర్చ్‌చేయాలి. వచ్చిన రిజల్ట్స్‌ను క్లిక్ చేస్తే ఆ పేరుతో ఉన్న ఫేస్‌బుక్ అకౌంట్లన్నీకనిపిస్తాయి.
4. సోషల్ మీడియా సెర్చ్ ఇంజన్‌తో సెర్చ్‌చేయడం
https://www.social-searcher.com/ని బ్రౌజర్‌లో టైప్ చేసి క్లిక్ చేస్తే సెర్చ్ ఇంజన్‌లోకి తీసుకెళుతుంది. అక్కడ మీకుకావాల్సిన పేరును ఎంటర్ చేసి సెర్చ్ బటన్ నొక్కితే ఫేస్‌బుక్‌తోపాటు 12 సోషల్ మీడియా సైట్‌కలో ఆ పేరుతో ఉన్న అకౌంట్లన్నీ చూపిస్తుంది. ఫేస్‌బుక్, ట్విట్టర్, లింక్డిన్, గూగుల్ వంటివన్నీ ఈ లిస్ట్‌లో ఉంటాయి.
5.బ్రౌజర్ ఎక్స్‌టెన్షన్స్ లేదా యాడ్ ఆన్స్ ద్వారా సెర్చ్‌చేయడం
పైనాలుగు ఆప్షన్లే కాకుండా బ్రౌజర్ ఎక్స్‌టెన్షన్స్ లేదా యాడ్ ఆన్స్ ద్వారా కూడా సెర్చ్ చేయొచ్చు. ఇందులో రెండు ఇంపార్టెంట్ యాడ్ ఆన్స్ ఇవీ..సోషియో ట్రోప్ (Sociotrope)అనే క్రోమ్ ఎక్స్‌టెన్షన్ డౌన్‌లోడ్ చేసుకుంటే ఫేస్‌బుక్ అకౌంటే కాదు వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ అకౌంట్లు, వాటికి యాడ్ అయి ఉన్న వీడియోలు, మీడియా కూడా కనిపిస్తాయి.
హూట్ సూట్ (Hootsuite) కూడా మరో బ్రౌజర్ ఎక్స్‌టెన్షన్. అయితే పేరు ద్వారా ఎవరి అకౌంట్‌ను సెర్చ్‌చేయలేం కాబట్టి ఇది అంతగా ఉపయోగపడదు.