• తాజా వార్తలు

ఐ ఫోన్‌,  ఐ ప్యాడ్‌ల‌కు ట‌చ్‌స్క్రీన్ హోంబ‌ట‌న్ యాడ్ చేయ‌డం ఎలా?

  • - ఎలా? /
  • 7 సంవత్సరాల క్రితం /



ఐవోఎస్ డివైస్‌ల్లో హోం బ‌ట‌న్ చాలా కీల‌కం.. అదే అతిపెద్ద బ‌ట‌న్ కూడా. ఐ ఫోన్ లేదా ఐ పాడ్‌లో మీరు ఏం చేస్తున్నా స‌రే హోం బ‌ట‌న్ కీని ఒక్క‌సారి ప్రెస్ చేస్తే చాలు నేరుగా హోం స్క్రీన్‌కు వెళ్లిపోతారు. చాలా ఆండ్రాయిడ్ డివైస్‌ల‌లో ఈ సౌక‌ర్యం ఉండ‌దు.  అయితే ఐ ఫోన్‌కు ప్ల‌స్‌పాయింట్‌గా ఉన్న ఈ హోం బ‌ట‌న్‌ను చాలా ఎక్కువ‌గా వాడ‌డ‌డం వ‌ల్ల అది కొంత‌కాలానికి అన్‌రెస్పాన్సివ్‌గా మారిపోతుంది. దీంతో డివైస్ మిమ్మ‌ల్ని ఫ్ర‌స్టేట్ చేస్తుంది. మీరు మీ ఐ ఫోన్ లేదా ఐ ప్యాడ్‌తో ఇలాంటి ప్రాబ్ల‌మ్‌ను ఎదుర్కొంటున్నారా? అయితే సాఫ్ట్‌వేర్ హోం బ‌ట‌న్‌ను మీ ఐ ఫోన్ లేదా ఐ ప్యాడ్ లో ఎనేబుల్ చేసుకోవ‌చ్చు. అదెలాగో చూడండి.. 
1. సెట్టింగ్స్ ఓపెన్ చేయండి
2. General > Accessibilityలోకి వెళ్లండి.
3. INTERACTION సెక్ష‌న్‌ను స్క్రోల్ చేసి  AssistiveTouchను టాప్ చేయండి  
4. త‌ర్వాత స్క్రీన్‌లో AssistiveTouch ను గ్రీన్లో పెట్టండి 
5. స్క్రీన్ మీద గ్రే క‌ల‌ర్ బాక్స్ మీద తెల్ల‌టి  సర్కిల్ వ‌స్తుంది. స‌ర్కిల్ ను టాప్ చేసి బాక్స్‌ను స్క్రీన్ సైజ్‌కు ఎక్స్‌పాండ్ చేయండి. ఆ బాక్స్‌లో స్క్వేర్ గా ఉన్న హోం బ‌ట‌న్ ఫిజిక‌ల్ హోం బ‌ట‌న్ మాదిరిగానే ప‌ని చేస్తుంది. ఈ గ్రే బాక్స్ అన్ని యాప్స్‌లో వాడుకునేలా క‌నిపిస్తుంది.  

జన రంజకమైన వార్తలు