మనం ఫొటోలు దాచుకోవడానికి లేదా ఫైల్స్ భద్రం చేసుకోవడానికి ఎక్కువగా ఉపయోగించేది గూగుల్ డ్రైవ్‌నే. ఇది సేఫ్ అండ్ సెక్యూర్ కావడంతో మన విలువైన సమాచారాన్ని కూడా ఇందులో భద్రపరుచుకుంటాం. ఒకవేళ డ్రైవ్‌లో మెమరీ అయిపోయినా డబ్బులు కట్టి మరీ మెమరీని పెంచుకుంటాం. అయితే గూగుల్ డ్రైవ్‌ను పబ్లిక్ యాక్సెస్ ఫైల్‌గా ఎలా ఉపయోగించుకోవాలో తెలుసా... దీన్ని డైరెక్ట్ డౌన్‌లోడ్ లింక్‌ను ఎలా జనరేట్ చేసుకోవాలో ఐడియా ఉందా? ..దానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి అవేంటంటే..
డౌన్‌లోడ్ మేనేజర్
గూగుల్ డ్రైవ్‌కు సంబంధించిన డౌన్‌లోడ్ లింక్‌ను ఏ పైల్‌లోకి అయినా డౌన్‌లోడ్ చేసుకుని దాన్ని సిస్టమ్‌లో ఎక్కడైనా వాడుకునే సదుపాయం ఉంది. అయితే డాక్యుమెంట్ డౌన్‌లోడ్ లింక్‌ను జనరేట్ చేయాలంటే ముందుగా వాటిని వెబ్‌లో పబ్లిష్ చేయాలి. మనం గూగుల్ డ్రైవ్‌లో ఏదైనా కంటెంట్ షేర్ చేశామంటే ఆ లింక్ డైరెక్ట్‌గా ఉండదు. అందుకే ఆ లింక్‌ను డౌన్‌లోడ్ మేనేజర్ సాఫ్ట్‌వేర్ ద్వారా లేదా డబ్ల్యూజీఈటీ లేదా సీయూఆర్ ఎల్ ద్వారా ఆ లింక్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇందుకోసం గూగుల్‌డ్రైవ్ ఎక్స్‌టెన్షన్‌ను ఉపయోగించుకోవాలి. అప్పుడు ఏ లొకేషన్‌లోనైనా మీరు గూగుల్ డ్రైవ్‌ను యాక్సెస్ చేసే అవకాశం ఉంటుంది.
ఎలా వాడాలంటే..
గూగుల్ డ్రైవ్ ఎక్స్‌టెన్షన్ టూల్ ద్వారా ఎలాంటి ఫైల్స్ లింక్స్ సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ముందుగా ఎక్స్‌టెన్షన్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఆ తర్వాత అన్ని పర్మిషన్లు ఇవ్వాలి. ఆ తర్వాత గూగుల్ డ్రైవ్‌ను ఓపెన్ చేసి ఏ ఫైల్ మీదైనా రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్ ఆప్షన్ క్లిక్ చేయాలి. తర్వాత డౌన్‌లోడ్ లింక్ జనరేటర్ మీద క్లిక్ చేయాలి. కొన్ని సెకన్లలోనే మీకు అవసరమైన లింక్ జనరేట్ అవుతుంది. ఈ డౌన్‌లోడ్ లింక్‌ను డౌన్‌లోడ్ మేనేజర్ ద్వారా ఎక్కడైనా ఉపయోగించే అవకాశం ఉంటుంది. పెద్ద సైజు ఉన్న ఫైల్స్‌ను కూడా మనం దీని ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.