కంప్యూటర్ ఓపెన్ చేయగానే మనం ఓపెన్ చేసేది గూగుల్‌నే. ఏం కావాలన్నా.. ఏ విషయాన్ని శోధించాలన్నా గూగుల్ వాడకం తప్పని సరి. వేరే ఎన్ని సెర్చ్ ఇంజన్లు ఉన్నా గూగుల్ మాత్రమే ఉంది... అన్నట్లుగా మనం అలవాటు పడిపోయాం. అయితే మనం గూగుల్‌లో ఏం చేసినా అది సీక్రెట్‌గా రికార్డు అవుతుందని ఎంతమందికి తెలుసు. మన కార్యకలాపాల మీద మూడో కన్ను ఉన్న సంగతిని మరిచిపోకూడదు. మనం సెర్చ్ రిజల్ట్స్‌ను గూగుల్ స్క్రీన్ షాట్లు తీసి స్టోర్ చేస్తుంది. ఆండ్రాయిడ్‌లో వాడుతున్నా ఇదే పరిస్థితి ఉంటుంది. మరి గూగుల్ కార్యకలాపాలకు మనం చిక్కకుండా ఉండడం ఎలా?
రీసెంట్ ఆప్షన్‌తో
ఇటీవల గూగుల్ కొత్తగా రీసెంట్స్ అనే ఆప్షన్ ప్రవేశపెట్టింది. ఇది మనం సెర్చ్ చేసిన ఫలితాను స్క్నీన్ షాట్లు తీసి స్టోర్ చేస్తుంది. అంతేకాదు మీరు చూసిన సెట్లకు సంబంధించిన లింక్‌లను కూడా ఇది దాస్తుంది. రీసెంట్‌కు మనం వెళితే ఇంతకుముందు వాడిన లింక్‌లు మనకు కనిపిస్తాయి. ఇది మనకు ఒక రకంగా ఉపయోగం ఎందుకంటే మళ్లీ అన్ని సెర్చ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. కానీ అక్కడి దాకా బాగానే ఉంది కానీ మన రిజల్ట్స్ స్టోర్ అవుతున్న విషయాన్ని గమనించుకోవాలి. దీని వల్ల మనకు జరిగే లాభం కన్నా మన యాక్టివీటిస్ వేరే వాళ్లకు తెలియడం వల్ల వచ్చే నష్టమే ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే గూగుల్ మీద ఉన్న నమ్మకంతో మనం ఏమీ పట్టించకోం.. కానీ గూగుల్ కూడా ఒక కంపెనీ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
ఏం చేయాలంటే..
అయితే గూగుల్ మీ యాక్టివిటీస్‌ను సేవ్ చేయకుండా చేయడం ద్వారా మీరు కొంతవరకు సేఫ్‌గా ఉండొచ్చు. ఈ ఫీచర్‌ను డిజేబుల్ చేయాలంటే గూగుల్ యాప్‌లో టాప్ రైట్ కార్నర్‌లో ఉండే మూడు డాట్స్ మీద క్లిక్ చేయాలి. ఆ తర్వాత అనేబుల్ రీసెంట్ ఆప్షన్‌ను టర్న్ ఆఫ్ చేయాలి. కార్డ్స్‌ను డిలీట్ చేస్తే మీ సెర్చ్ హిస్టరీ రిజల్ట్స్ కూడా రిమూవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. రీసెంట్ ట్యాబ్‌లో మీరు ఇటీవల గూగుల్ యాప్ ద్వారా చేసిన సెర్చ్ రిజల్ట్స్ మాత్రమే ఉంటాయి బ్రౌజర్ లేదా డెస్క్‌టాప్ ద్వారా చేసిన సెర్చ్ ఫలితాలు ఉండవు. కాబట్టి అక్కడ వరకు మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ గూగుల్ త్వరలోనే అన్ని డివైజ్‌లలో రీసెంట్ ఆప్షన్‌ను విస్తరించే అవకాశాలు ఉన్నాయి.