స్మార్ట్‌ఫోన్...జీవితంలో నిత్యవసర వస్తువుగా మారిపోయింది. తిండిలేకుండా గడుస్తుందేమో కానీ...స్మార్ట్‌ఫోన్ లేనిది క్షణం గడవదు. స్మార్ట్‌ఫోన్ జీవితంలో అంతలా పాతుకుపోయింది. ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ కొనుగోళు చేసేవాళ్లు...ముందుగా ధర లేదా ఫీచర్స్ చూస్తుంటారు. కానీ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసేముందు తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అవే రేడియేషన్ లెవల్స్. ఇప్పుడు యువత అంతా కూడా స్మార్ట్‌ఫోన్లతో బిజిబిజీగా గడుపుతున్నారు. అతిగా సెల్ ఫోన్ వాడితే...ప్రమాదమని వైద్యులు, నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు గంటలతరబడి ఫోన్లో మాట్లాడితే...రేడియేషన్ ప్రభావంతో మెదడు సంబంధిత వ్యాధులు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. అయితే స్మార్ట్‌ఫోన్ కొనేటప్పుడు రేడియేషన్ లెవల్ ఎలా చెక్ చేయాలో తెలుసుకుందాం.
SAR ఎంత వరకు మంచిది?
SAR వ్యాల్యువ్ అనేది 16/కేజీ ఉంటే సరిపోతుంది. కాబట్టి మీ ఫోన్ ఎస్ఆర్ వ్యాల్యూవ్ 1.2లేదా 0.5 నుంచి0.6పరిధిలో ఉన్నప్పటికి ఆందోళన చెందాల్సిన పనిలేదు. మొబైల్ డివైజు వాడకాన్ని తగ్గించాలనుకుంటే మొబైల్ ఇయర్ ఫోన్లను ఉపయోగించినట్లయితే...ఎక్స్ ఫ్లోజర్ ఫోన్ రేడియేషన్ను తగ్గించుకోవచ్చు.
SAR వ్యాల్యూ ఎలా చెక్ చేయడం..
* మీ స్మార్ట్‌ఫోన్ అన్ లాక్ చేసి డైలర్ ను ఓపెన్ చేయండి
* డైలర్ లో ‘*#07# అనే కోడ్ ను టైప్ చేయండి
* ఇప్పుడు మీ స్మార్ట్‌ఫోన్ యొక్క SAR రేటింగ్ ఆటోమేటిక్ గా చూపిస్తుంది.
IMEI నెంబర్ ను తెలుసుకోవడానికి...
*మీ స్మార్ట్‌ఫోన్ లో డైలర్ ను ఓపెన్ చేయండి
* డైలర్ లో ‘*#06# అనే కోడ్ ను టైప్ చేయండి
* ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ యొక్క IMEI నెంబర్ ఆటోమేటిక్ గా చూపిస్తుంది