మనం కంప్యూటర్‌లో ఫొటోలు అప్‌లోడ్ చేసే విషయంలో ఎక్కువమంది ఎదుర్కొనే సమస్య ఒకటుంది. అదే ఫొటోలను అప్‌లోడ్ చేయడం.. సాధారణంగా ఫొటోలు చాలా ఎక్కువ రిజల్యూషన్ ఉంటాయి. ఇలాంటి ఇమేజ్‌లను అప్‌లోడ్ చేయడం చాలా కష్టం. అందువల్ల ఫొటో షాప్ లాంటి వాటిని వాడి రిజల్యూషన్ తగ్గించి వాటిని అప్‌లోడ్ చేస్తూ ఉంటాం. కానీ అన్ని సందర్భాల్లో ఫొటోషాప్‌ను వాడడం కష్టం. మరి హై రిజల్యూషన్ ఫొటోలను లో రిజల్యూషన్ ఫొటోలుగా కన్వర్ట్ చేయడం ఎలా?
ఏఐ ఇమేజ్ ఎన్‌లార్జర్
ఇమేజ్ రిజల్యూషన్ తగ్గించడం కోసం ఆన్ లైన్‌లో చాలా యాప్‌లు అందుబాటులోకి వచ్చాయి. కానీ వాటిలో బాగా అందుబాటులో ఉండి ఉపయోగపడే యాప్ ఏఐ ఇమేజ్ ఎన్‌లార్జర్. ఇది ఆన్‌లైన్ ఇమేజ్ ఎన్‌హాన్సర్ సర్వీస్. ఇది ఇమేజ్‌లను ఎన్‌హాన్స్ చేయడం, తగ్గించడ లాంటి పనులు చేసిపెడుతుంది. దీనిని క్లిక్ చేసి ఇంటర్‌ఫేస్ ఓపెన్ చేయాలి. మీరు అనుకున్న ఫొటోను డ్రాగ్ చేసి ఇందులో డ్రాప్ చేయాలి. రిలవెంట్ ఫైల్ ఫార్మాట్లోనే ఈ ఇమేజ్‌లను డ్రాప్ చేయాలి.
ఎలా చేయాలంటే..
ఏఐ ఇమేజ్ ఎన్‌హాన్సర్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. దీనిలో ఇమేజ్‌ను డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఆన్‌లైన్‌లో నేరుగా ఈ ఎన్‌హాన్సర్‌ను యూజ్ చేసుకోవచ్చు. ఈ యాప్‌ని క్లిక్ చేసి అందులో ఫైల్ ఆప్షన్ క్లిక్ చేసి యాడ్ ఇమేజ్ ద్వారా ఫొటోలను అప్‌లోడ్ చేయాలి. 3 ఎంబీలోపు సైజుతో జేపీజీ, జేపీఈజీ, పీఎన్‌జీ ఫైల్ ఫార్మట్లలో ఇమేజ్‌లను అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ ఇమేజ్‌లు లో రిజల్యూషన్‌లో ఉంటే హై రిజల్యూషన్‌కు కన్వర్ట్ చేసుకోవచ్చు. హై ఉంటే లోకు మార్చుకోవచ్చు.