మనం ఈమెయిల్స్‌ని పంపుతూ ఉంటాం. కానీ సాధారణంగా ఒకసారి ఒకే మెయిల్‌ని పంపడం మనకు అలవాటు. మరి అదే ఒకేసారి ఎక్కువ ఈమెయిల్స్ పంపాలంటే.. అది కూడా పీడీఎఫ్ రూపంలో పంపాలంటే..! ఇది చాలా కష్టం అనుకుంటున్నారా?..కానీ ఈ స్టెప్స్ పాటిస్తే చాలా సులభమైన ప్రక్రియ... మరి ఆ స్టెప్స్ ఏమిటో తెలుసుకుందాం..
క్లౌడ్ హెచ్‌క్యూ
మల్టీపుల్ ఈమెయిల్స్‌ని పీడీఎఫ్ మాదిరిగా ఫార్వర్డ్ చేయడానికి ఒక టూల్ ఉంది.. దాని పేరే క్లౌడ్ హెచ్‌క్యూ.. దీని సాయంతో బల్క్ మెయిల్స్‌ని మనం ఫార్వర్డ్ చేసే అవకాశం ఉంటుంది. దీని ద్వారా సెలక్టెడ్ ఈమెయిల్స్ ఒక మెయిల్‌లో, సెలక్టెడ్ ఈమెయిల్స్‌ని ఈఎంఎల్ అటాచ్‌మెంట్స్‌లా, సెలక్టెడ్ ఈమెయిల్స్‌ని పీడీఎఫ్ అటాచ్‌మెంట్‌లా, ఈ మెయిల్స్‌ని ఒక మెయిల్ నుంచి ఇంకో అకౌంట్‌కు మైగ్రేట్ చేయడం లాంటి పనులును ఈ టూల్ ద్వారా మనం చేసుకోవచ్చు.
పీడీఎఫ్ ఇలా చేసుకోవాలి
మల్టీపుల్ జీమెయిల్ అకౌంట్స్‌ని ఒకేసారి పీడీఎఫ్‌లా మార్చుకోవడానికి క్లౌడ్ క్యూ ఉపయోగించాలి. ముందుగా క్లౌడ్ క్యూ ఎక్స్‌టెన్షన్‌ని మీ బ్రౌజర్‌లో యాడ్ చేసుకోవాలి. ఇది ఒకసారి ఇన్‌స్టాల్ అయిన తర్వాత ఆటోమెటిక్‌గా మీ జీమెయిల్‌ని లోడ్ చేసుకుంటుంది. ఈమెయిల్‌లో మీకు ఫార్వర్డ్ బటన్‌ని యాడ్ చేస్తుంది. మల్టీపుల్ ఈమెయిల్స్‌ని ఫార్వర్డ్ చేయాలంటే ఇన్బాక్స్ ఓపెన్ చేసి మీరు ఫార్వర్డ్ చేయాలనుకుంటున్న మెయిల్స్ సెలక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫార్వర్డ్ బటన్ క్లిక్ చేస్తే చాలు. దానికంటే ముందు ఫార్వర్డ సెలెక్టెడ్ ఈమెయిల్స్ ఇన్ ద ఒన్ ఈమెయిల్ యాజ్ పీడీఎఫ్ అటాచ్‌మెంట్ ఆప్షన్ క్లిక్ చేయాలి. అంతే ఈ మెయిల్స్ అన్ని పీడీఎఫ్‌గా కన్వర్ట్ అయి ఫార్వర్డ్ అవుతాయి.