ఒకేసారి ఎక్కువమందికి ఎస్ఎంఎస్‌లు పంపడానికి ఆండ్రాయిడ్‌లో ఒక ఆప్షన్ ఉంది. అదే మెయిల్ మెర్జ్ ఎస్ఎంఎస్. పర్సనలైజ్డ్ ఎస్ఎంఎస్‌లను మల్టీపుల్ కాంటాక్ట్స్‌కు పంపడానికి ఇది ఉపయోగపడుతుంది. సాధారణంగా గ్రూప్ ఎస్ఎంఎస్‌లు పంపాలంటే ప్రత్యేకించి ఆ కాంటాక్ట్స్‌ను పర్సనలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి సందర్భంలోనే మీకు మెయిల్ మెర్జ్ బాగా ఉపయోగపడుతుంది. ఆండ్రాయిడ్ ఫోన్లో మెయిల్ మెర్జ్ ఎస్ఎంఎస్‌ను ఉపయోగించుకోవాలంటే ఇందుకోసం కొన్ని ఉచిత యాప్స్ ఉపయోగించుకోవాలి. అదెలాగో చూద్దాం..
కస్టమ్ ఎస్ఎంఎస్ టెంప్లెట్
ఈ ఉచిత పర్సలైజ్డ్ యాప్స్ ద్వారా మీరు కస్టమ్ టెంప్లెట్‌లను పొందొచ్చు. దీని ద్వారా మీకు మెసేజ్ బాడీ, టాగ్స్ లాంటివి లభిస్తాయి. వాటిలో ఎస్ఎంఎస్ చేసుకుని మీకు అవసరమైన వాళ్లకు ఒకేసారి మెసేజ్ సెండ్ చేయచ్చు. దీని కోసం మీ ఫోన్ బుక్ నుంచి మల్టీపుల్ కాంటాక్ట్స్ సెలక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది అచ్చంగా జీమెయిల్ ఈమెయిల్స్, ఫేస్‌బుక్ మెసేజ్‌ల మాదిరే ఉంటుంది.
ఎస్ఎంఎస్ మాస్టర్
మెయిల్ మెర్జ్ ఎస్ఎంఎస్ చేయడానికి ఎస్ఎంఎస్ మాస్టర్ యాప్ ఉత్తమం. దీన్ని పర్సలైజ్డ్ మెసేజ్‌లను ఒకేసారి పంపడానికి ఉపయోగిస్తారు. కస్టమ్ మెసేజ్‌లను క్రియేట్ చేసి..మల్టీపుల్ రిసీపియంట్స్‌కు మెసేజ్ పంపడానికి ఉపయోగిస్తారు. ఇది కామన్ ట్యాగ్స్‌ను వాడుకుంటుంది. మీరు ఈ ఫీచర్ ద్వారా అన్‌లిమిటెడ్ ఎస్ఎంఎస్‌లను.. అన్‌లిమిటెడ్ యూజర్లకు పంపుకోవచ్చు.
మాస్ టెక్ట్
ఆండ్రాయిడ్‌లో ఎస్ఎంఎస్‌లు భారీగా పంపడానికి ఉపయోగించే యాప్ మాస్ టెక్ట్. ఒకేసారి పర్సనలైజ్డ్ మెసేజ్‌లు పంపడానికి ఇదో మంచి ప్రత్యామ్నాయంగా చెప్పొచ్చు. ఎస్ఎంఎస్‌లు అందుకునే రిసీపియంట్స్ పేర్లను ట్యాగ్‌లుగా యూజ్ చేయడం ద్వారా ఇది అందరికి సందేశాలు వెళ్లాలయన్న విషయాన్ని స్పష్టమయ్యేలా చేస్తుంది. ఎంతమందికి ఎన్ని మెసేజ్‌లు పంపాలనే విషయంపై ఎలాంటి లిమిట్ లేదు.
ఎస్ఏ గ్రూప్ టెక్ట్ లైట్
మెయిల్ మెర్జ్ ఎస్ఎంఎస్‌లు పంపడానికి మరో మంచి ఆప్షన్ ఎస్ఏ గ్రూప్ టెక్ట్ లైట్. మిగిలిన యాప్‌లలో పోలిస్తే ఇది కొంచెం భిన్నమైనది. మీరు ఒకేసారి ఎక్కువమందికి ఎస్ఎంఎస్‌లు పంపాలంటే ఎక్సైల్ ఫైల్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. మన కాంటాక్ట్‌లు ఉన్న ఎక్సైల్ ఫైల్ ఇంపోర్ట్ చేసిన తర్వాత ఏమైనా పారామీటర్స్ తప్పామో లేదో ఎడిట్ చేసుకునే అవకాశం ఉంది. దీనిలో ఎస్ఎంఎస్, ఆటో సెండ్ ఎస్ఎంఎస్ ఆంటి అదనపు ఫీచర్లు కూడా ఉన్నాయి. దీనిలో మెసేజ్‌ల లిమిట్ 120 మాత్రమే.