ప్రముఖ గృహోపకరణాల సంస్థ హేయిర్ దేశంలో తొలిసారిగా ‘‘హేయిర్ వాష్ యాప్’’ద్వారా స్మార్ట్‌ఫోన్ ఆధారిత లాండ్రీ సేవలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. పూర్తి ఆటోమేటెడ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT) సాంకేతిక పరిజ్ఞానంతో ఈ సేవలను అందిస్తుంది. వినియోగదారులు ఈ సేవల కోసం తమ ఫోన్లద్వారా చెల్లింపులు చేయడం మాత్రమే కాదు... సేవలను రిజర్వు చేసుకోవచ్చు... సమయం నిర్ణయించుకోవచ్చు... పర్యవేక్షించవచ్చు. డిజిటల్‌గా సాగే ఈ ప్రక్రియవల్ల దుస్తులు ఉతకడంలో సరికొత్త అనుభవం కలుగుతుంది. ప్రతి వాషింగ్ మెషీన్ క్లౌడ్ కనెక్షన్ కలిగి ఉండి ‘‘హేయిర్ వాష్ యాప్’’ సహాయంతో వ్యక్తిగతంగా నడిపించగల వీలుంటుంది. దుస్తులు ఉతికే ప్రక్రియ సాగినంత సేపూ ఈ యాప్ మనకు సహాయపడుతుంది- ఉతుకు ముగిశాక దుస్తులు తీసుకోవాల్సిందిగా సూచిస్తుంది. లాండ్రీ వినియోగానికి సంబంధించిన గత రికార్డును పూర్తిస్థాయిలో నిర్వహిస్తుంది. ఈ సేవలద్వారా వినియోగదారులు ఇటు దుస్తులు ఉతకడం సాగుతుండగానే అటు తమ ఇంటి పనులను ఏకకాలంలో పూర్తిచేసుకోవచ్చు.
ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన ఉతుకు కోసం హేయిర్ స్మార్ట్ లాండ్రీ సేవల్లో భాగమైన వాషింగ్ మెషీన్లలో ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన ‘‘డబుల్ స్టెరిలైజ్ ఫంక్షన్’’ సదుపాయం ఉంది. ‘‘ఓజోన్ స్టెరిలైజేషన్, హై టెంపరేచర్ స్టెరిలైజేషన్’’వంటి సాంకేతిక పరిజ్ఞానంవల్ల ఒకరి దుస్తులనుంచి మరొకరి దుస్తులకు బ్యాక్టీరియా, ఇతర కాలుష్యం సోకకుండా నివారించవచ్చు. ఈ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ యుగంలో ప్రపంచంలో అగ్రగామిగా నిలవాలన్న హేయిర్ దార్శనికతను ముందుకు తీసుకెళ్లడం కోసం తమతో అనుబంధంగల వినియోగదారులకు అత్యాధునిక పరిష్కారాలు అందుబాటులోకి తెస్తామని హేయిర్ అప్లయెన్సెస్ ఇండియా, ప్రెసిడెంట్ ఎరిక్ బ్రగాంజా తెలిపారు.