జియో.. జియో.. జియో... భారత్ ఊగిపోతుంది ఈ ఫీవర్. ఎందుకంటే ఆఫర్ల మీద ఆఫర్లతో అద్భుతమైన కొత్త కొత్త ఎత్తుగడలతో జియో దూసుకుపోతుంది. అందులో భాగంగా వచ్చిందే జియో 4జీ ఫీచర్ ఫోన్. ఈ ఫీచర్ ఫోన్‌ను ఎప్పుడు దక్కించుకుందామా అని వినియోగదారులు కూడా ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. ఈనెల 24 నుంచి జియో ఫోన్ ప్రి బుకింగ్ మొదలు కాబోతోంది. కానీ ఈ ఫోన్‌ను ఎలా బుక్ చేయాలో చాలా మందికి తెలియదు. కొంతమంది ఏమైనా డైరెక్ట్‌గా మెసేజ్ వస్తుందేమో అని చూస్తుంటే.. కొంతమంది మెయిల్ వస్తుందేమో అనే ఆలోచనలో ఉన్నారు. కానీ అందరికి తెలియని విషయం ఏమిటంటే ప్రిబుకింగ్ చేసుకోవడానికి ఒక పద్ధతి ఉంది అదేంటో చూద్దాం.
ఎలా రిజిస్టర్ చేసుకోవాలంటే...
జియో ఫోన్‌ను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాలని అనుకునే వాళ్లు జియో.కాం అఫీషియల్ వెబ్‌సైట్ ద్వారా రిజిస్టర్ కావాలి. సింగిల్ డివైజ్ కావాలా లేదా ఏదైనా బిజినెస్ కోసమా అనేది కూడా ముఖ్యమే. ఒకటే పీస్ కావాలంటే పెద్దగా నిబంధనలు ఉండవు. అదే ఎక్కువ పీస్‌లు కావాలి. అంటే మాత్రం కొన్ని నిబంధనలు ఉన్నాయి.
1. ముందుగా రియలన్స్ జియో అఫీషియల్ సైట్ జియో.కామ్‌లోకి వెళ్లాలి..
2. ఆ తర్వాత కీప్ మీ పోస్టెడ్ అనే ట్యాబ్ మీద క్లిక్ చేయాలి.
3. ఒక పొపప్ పేజ్‌తో ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది.
4. ఆ ఫామ్‌లో మీ పేరు. ఈమెయిల్ ఐడీ, ఫోన్ నంబర్, పోస్టల్ కోడ్ తదితర వివరాలు నింపాలి
5. ఆ తర్వాత సబ్‌మిట్ బటన్ ప్రెస్ చేయాలి.
6. స్మార్ట్ ఫోన్లలో అయితే మై జియో యాప్‌ను ఉపయోగించి ఆర్డర్ చేచ్చు.
7. ఆఫ్ లైన్ ద్వారా అయితే మీకు దగ్గర్లోని జియో కేర్ సెంటర్‌కు వెళ్లాలి.
గమనిక: 1500 రూపాయిలు కాషన్ డిపాజిట్‌గా చెల్లించాలి. వీటిని మూడేళ్ల తర్వాత తిరిగి చెల్లిస్తారు.
జియో ఫోన్ టైమ్ లైన్
జియో ఫోన్ అనౌన్స్‌మెంట్: 2017 జులై 21,
జియో ఫోన్ టెస్టింగ్: 2017, ఆగస్టు 15
జియో ఫోన్ ప్రి బుకింగ్: 2017, ఆగస్టు 24
జియో ఫోన్ లభ్యం: 2017 సెప్టెంబర్