ఒకప్పుడు ఏమైనా వీడియోలు, సినిమాలు చూడాలంటే కచ్చితంగా డీవీడీలు లేదా సీడీలు అవసరం అయ్యేవి. కానీ ఇంటర్నెట్ అంతటా విస్తరించాక ఇక డీవీడీలు, సీడీల అవసరం లేకుండా పోయింది. అందరు నేరుగా ఆన్‌లైన్‌లోనే సినిమాలు, వీడియోలు చూసేస్తున్నారు. ఇందుకోసం చాలా సైట్లు అందుబాటులోకి వచ్చాయి కూడా. వీటిన్నిటిలోకి ఫేమస్ యూట్యూబ్. దీనిలో ఉండని వీడియో అంటూ ఉండదు. అయితే సినిమాలు, టీవీ సీరియల్స్, షోల కోసం ప్రత్యేకం అమేజాన్ ప్రైమ్, హాట్ స్టార్, నెట్‌ఫ్లిక్స్ లాంటి సైట్లు ఇప్పడు మనకు అందుబాటులో ఉన్నాయి. మరి ఈ వీడియోలను ఇంటర్నెట్ ఉంటే మాత్రమే చూడగలం. మరి ఆఫ్‌లైన్‌లో కూడా వీటిని చూసే అవకాశం ఉంటే బాగుంటుంది కదా! మరి అలా చూడడం ఎలా?
యూట్యూబ్‌లో అయితే..
ముందుగా ఐఫోన్‌లో లేదా స్మార్ట్‌ఫోన్లో యూట్యూబ్ యాప్‌ను ఓపెన్ చేయాలి. మీకు నచ్చిన వీడియోపై ట్యాప్ చేసి ఆఫ్ లైన్ వీవింగ్ ద్వారా డౌన్‌లోడ్ చేయాలి. ఆ తర్వాత డౌన్‌లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఆపై వీడియో క్వాలిటీ మీద ట్యాప్ చేసి డౌన్‌లోడ్ చేయాలి. ఆ తర్వాత ఓకే బటన్ ప్రెస్ చేయాలి. ఇలా ఎన్ని వీడియోలనైనా మీరు డౌన్‌లోడ్ చేసుకుని ఆఫ్‌లైన్‌లో చూసుకోవచ్చు.
నెట్‌ఫ్లిక్స్
యూట్యూబ్‌లాగేనే నెట్‌ఫ్లిక్స్‌లో కూడా వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. టీవీ షోలు, మూవీస్ ఆఫ్‌లైన్‌లో చూసుకోవచ్చు. నిజానికి షోలు ఆఫ్‌లైన్‌లో మీకు దొరకవు. కానీ ముందుగా మీరు డౌన్‌లోడ్ చేసుకుంటే వాటిని చూడొచ్చు. నెట్‌ఫ్లిక్స్ ఓపెన్ చేసుకుని మీరు ఏ మూవీ కావాలో దాన్ని డౌన్‌లోడ్ చేయాలి. మూడు హారిజాంటల్ లైన్స్ మీద ఉన్న మెనూ బటన్ మీద క్లిక్ చేయాలి. ఆ తర్వాత డౌన్‌లోడ్ బటన్ మీద ట్యాప్ చేయాలి. అంతే మీదు నెట్‌ఫ్లిక్స్ వీడియోలను ఆన్‌లైన్‌లో ఆస్వాదించొచ్చు.
అమెజాన్ ప్రైమ్ వీడియో
అమోజన్ ప్రైమ్ వీడియో యాప్‌ను ఓపెన్ చేసి మీకు నచ్చిన వీడియోను ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాత దాన్ని డౌన్‌లోడ్ చేయాలి. వీడియో ఐకాన్ మీద ట్యాప్ చేయాలి. ఆ తర్వాత డౌన్‌లోడ్ బటన్‌పై ప్రెస్ చేయాలి. ఆ తర్వాత మీరు డౌన్‌లోడ్ లిస్టులో మీరు డౌన్‌లోడ్ చేసి అన్ని మూవీస్, వీడియోలు కనిపిస్తాయి. నచ్చిన వాటిని ప్లే చేసుకోవచ్చు.