మీ బ్రౌజర్‌లో హిస్టరీని క్లియర్ చేసేశారు. కానీ ఆ తర్వాత అందులో ఏదో వెబ్ అడ్రస్ ఏదో కావాల్సి వచ్చింది. అరే.. అనవసరంగా హిస్టరీ క్లియర్ చేసేశామే ఇప్పుడెలా అని బాధపడుతున్నారా? ఆ చింతేమీ అక్కర్లేదు. History Search ఎక్స్‌టెన్షన్‌తో మీరు క్లియర్ చేసిన హిస్టరీని కూడా బ్రౌజర్‌లో చూసే అవకాశం ఉంది. క్రోమ్, ఫైర్‌ఫాక్స్, ఒపెరా బ్రౌజర్లలో ఈ ఎక్స్‌టెన్షన్ పని చేస్తుంది.
History Search మీ బ్రౌజింగ్ యాక్టివిటీని సెక్యూర్డ్ క్లౌడ్ అకౌంట్‌లో స్టోర్ చేస్తుంది. 3వేల కంప్లీట్ వెబ్‌పేజెస్‌ను, మీ ఫేవరెట్ 50 వెబ్‌సైట్లలో మీ బ్రౌజింగ్ హిస్టరీ ఈ అకౌంట్లో సేవ్ అవుతుంది. ఫుల్ కంటెంట్ సెర్చ్ చేస్తే వందల కొద్దీ బ్రౌజింగ్ పేజీలు మీ ముందు ప్రత్యక్షమవుతాయి. మీరు సెంట్రల్ క్లౌడ్ అకౌంట్‌లో రిజిస్టర్ కాకుండా కూడా సెర్చ్ చేసినా 500 వెబ్‌పేజీల ఇన్ఫో కనిపిస్తుంది.
* ప్రీమియం వెర్షన్ తీసుకుంటే 15,000 వెబ్‌పేజెస్, వెయ్యి ఫేవరెట్ వెబ్‌సైట్ల బ్రౌజింగ్ హిస్టరీ క్లౌడ్‌లో సేవ్ అవుతుంది. ఈ వెర్షన్‌లో 10 బ్రౌజర్లను మీ క్లౌడ్‌కు సింక్ చేసుకోవచ్చు.
ఎలా పని చేస్తుంది?
* బ్రౌజర్‌లో ఎక్స్‌టెన్షన్‌ను ఇన్‌స్టాల్ చేయాలి.
* సైన్ అప్ చేయాలి. మీకు తక్కువ సెర్చ్ రిజల్ట్స్ చాలు అనుకుంటే అన్‌రిజిస్టర్డ్‌గా కంటిన్యూ కావచ్చు.
* కీవర్డ్స్ ఉపయోగించి ఫుల్ కంటెంట్ టెక్స్ట్ సెర్చ్ చేయాలి. మీ కంటెంట్‌లోని ఏదైనా వర్డ్, ఫ్రేజ్ లేదా సెంటెన్స్‌ను ఉపయోగించి సెర్చ్ చేయొచ్చు.
* మీరు బ్రౌజ్ చేసిన పాత పేజీలను గుర్తు తెచ్చుకోవడానికి గూగుల్‌ను కూడా యూజ్ చేసుకోవచ్చు.
కొన్ని టిప్స్
మీ సెర్చ్‌ను ఏదైనా కీ వర్డ్‌తో కంప్లీట్ చేసేముందు సెర్చ్ బార్‌లో కింద ఉన్న Tools ను టాప్ చేసి Any timeను టాప్ చేస్తే మీ పాత హిస్టరీ అంతా కూడా దొరుకుతుంది. మీకు డేట్ గుర్తుంటే Past 24 hour లేదా Past week లేదా Past monthను ఉపయోగించి సెర్చ్ చేస్తే రిజల్ట్ బాగా వస్తుంది.
* బ్రౌజర్‌లో గూగుల్ Advanced Search Page ని బుక్ మార్క్ చేసి పెట్టుకుంటే సెర్చ్ ఈజీగా ఉంటుంది.
* క్రోమ్ ఎక్స్‌టెన్షన్లు Google When, Finitimus లను కూడా సెర్చ్‌లో వాడుకోవచ్చు. బింగ్‌లో అయితే DuckDuckGo మీ రిజల్ట్‌ను ఫిల్టర్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది.