• తాజా వార్తలు

పేటీఎం, బుక్ మై షోల‌లో సినిమా టికెట్ల అడ్వాన్స్ బుకింగ్ ఎలా?

  • - ఎలా? /
  • 6 సంవత్సరాల క్రితం /

దేశంలో ఆన్‌లైన్ సినిమా టికెట్ల బుకింగ్ వ్యాపారం జోరందుకుంది. ప్ర‌స్తుత చ‌ల‌న‌చిత్ర యుగంలో ఆన్‌లైన్ బుకింగ్‌కు జ‌నం స‌హ‌జంగానే ప్రాధాన్య‌మిస్తున్నారు. సుల‌భ చెల్లింపు సౌక‌ర్యంతోపాటు క్యూల‌లో తొక్కిస‌లాట వంటి జంఝాటాలేమీ లేక‌పోవ‌డ‌మే ఇందుకు కార‌ణం. పైగా సినిమా టికెట్ల ధ‌ర‌లు ఆకాశాన్నంటుతున్న త‌రుణంలో ఆయా వెబ్‌సైట్లు వివిధ‌ డిస్కౌంట్ ఆఫ‌ర్‌్తో ప్రేక్షకాభిమానుల‌ను ఆక‌ట్టుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాయి. ఇలా ఆన్‌లైన్‌లో  సినిమా టికెట్లు అందించే వెబ్‌సైట్ల‌లో... ‘పేటీఎం, బుక్ మై షో’వంటివిసహా Ticketplease.com, Chalcinema.com, ticket4u.in, Justtickets.in, Ticketnew.com, Easymovies.in, PVR Cinemas.com, AGS Cinemas and SPI Cinemas కూడా ప్రముఖమైనవిగా పేరొందాయి. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధానంగా పేటీఎం, బుక్ మై షో వేదిక‌ల‌ద్వారా టికెట్ల అడ్వాన్స్ బుకింగ్ ఎలాగో తెలుసుకుందాం...
PAYTMలో టికెట్ బుకింగ్ ఇలా...
పేటీఎం వేదిక‌గా సినిమా టికెట్లను కంప్యూట‌ర్‌, ల్యాప్‌టాప్‌ల‌లో వెబ్‌సైట్‌ద్వారా లేదా ఆండ్రాయిడ్‌ మొబైల్‌లో పేటీఎం యాప్ లేదా మొబైల్‌లోనూ వెబ్‌సైట్‌ద్వారా అడ్వాన్స్‌గా బుక్ చేసుకోవ‌చ్చు. అయితే, ఫేక్‌ వెబ్‌సైట్లు మోసం చేసే ప్ర‌మాదం ఉందిగ‌నుక జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాలి. మొద‌ట‌ ‘‘పేటీఎం’’ హోమ్ పేజీలోకి వెళ్లి Moviesపై క్లిక్ చేయగానే అది మిమ్మ‌ల్ని https://paytm.com/movies URLలోకి తీసుకెళ్తుంది. ఇప్పుడు క‌నిపించే సూచ‌న మేర‌కు మీ న‌గ‌రాన్ని ఎంపిక చేసుకోవాలి. అటుపైన ఏ భాష‌లో సినిమాలు కావాలో ఆ భాష‌ను ఎంపిక చేసుకోవాలి. అదే స‌మ‌యంలో ‘‘మీ న‌గ‌రంలో’’ ప్ర‌ద‌ర్శిస్తున్న పాపుల‌ర్ సినిమాల‌నే కాకుండా త్వ‌ర‌లో విడుద‌ల కాబోయే చిత్రాల‌ను కూడా వెబ్‌సైట్ చూపుతుంది. అయితే, వాటినుంచి మీరు చూడాలనుకుంటున్న ప్ర‌స్తుత‌ సినిమాను ఎంచుకోండి. ఇది పూర్త‌య్యాక పేటీఎంతో అవ‌గాహ‌న‌ ఒప్పందంగ‌ల‌ థియేట‌ర్ల పేర్లు, వాటిలో మీరు ఎంచుకున్న సినిమా ప్ర‌ద‌ర్శ‌న వేళ‌లు కూడా క‌నిపిస్తాయి. అందులో ప్ర‌ద‌ర్శ‌న వేళ‌ల‌ను చూసుకుని మీకు అనువైన స‌మ‌యంపై క్లిక్ చేయాలి. దీంతోపాటు వీఐపీ, ప్రీమియం, ఎగ్జిక్యూటివ్‌, బాక్స్‌, బాల్క‌నీ వంటి విభాగాల్లో మీకు కావాల్సిన సీట్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. అటుపైన M-Ticket లేదా E-Ticketల‌లో ఏది కావాలో కూడా ఎంచుకోవాలి. ఇక మీరు చెల్లించాల్సిన మొత్తాన్ని ఒక‌సారి బాగా చూసుకుని, “Continue Booking” బ‌ట‌న్‌ను ట్యాప్ చేయాలి. ఇదంతా చేసేముందుగానే మీరు మీ అకౌంట్‌లో లాగిన్ అయి ఉంటారు... ఉండాల‌ని కూడా మీకు తెలుసుగా!
BOOKMYSHOWలో టికెట్ బుకింగ్ ఇలా...
‘‘బుక్ మై షో’’ వెబ్‌సైట్ కాస్త భిన్నంగా ఉంటుంది. ఇందులో సినిమాల‌కు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ మాత్ర‌మే కాకుండా వివిధ వేడుక‌లు, క్రీడ‌లు చూడటానికి కూడా టికెట్లు బుక్ చేసుకునే స‌దుపాయం ఉంది. ఇక సినిమా టికెట్ బుకింగ్ ప్ర‌క్రియ‌కు వ‌స్తే- ముందుగా అధికారిక www.bookmyshow.com వెబ్‌సైట్‌లోకి వెళ్లండి. అక్క‌డ మీరు మీ న‌గ‌రాన్ని ఎంపిక చేయ‌వ‌చ్చు లేదా మీ లొకేష‌న్ అన్వేష‌ణ‌కు వెబ్‌సైట్‌ను అనుమ‌తించ‌వ‌చ్చు. అటుపైన మీ స‌మీప ప్రాంతాల్లో ప్ర‌ద‌ర్శిస్తున్న సినిమాల జాబితాను అది మీ ముందుంచుతుంది. వాటినుంచి మీరు కోరుకున్న సినిమాను, ప్ర‌ద‌ర్శించే స‌మ‌యాన్ని ఎంచుకుని ప్రొసీడ్ కావాలి. ఆ త‌ర్వాత మిగిలిన ప్ర‌క్రియ అంతా పేటీఎం త‌ర‌హాలోనే ఉంటుంది.

జన రంజకమైన వార్తలు