• తాజా వార్తలు

వాట్స‌ప్‌లో ఫాంట్ స్ట‌యిల్ ప‌ర్మినెంట్‌గా మార్చ‌డం ఎలా?

  • - ఎలా? /
  • 5 సంవత్సరాల క్రితం /

వాట్స‌ప్‌... ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎక్కువ‌గా ఉప‌యోగించే మెసేజింగ్ స‌ర్వీస్‌. ఈ సోష‌ల్ మీడియా యాప్ వాడ‌ని స్మార్ట్‌ఫోన్ దాదాపు ఉండ‌డ‌దు అనేది వాస్త‌వం. కాలం గ‌డుస్తున్న‌కొద్దీ వాట్స‌ప్‌లో ఎన్నో మార్పులు చేర్పులు జ‌రుగుతున్నాయి. ప్ర‌తి అప్‌డేష‌న్‌లో వాట్స‌ప్‌లో కొత్త ఫీచ‌ర్లు వ‌స్తున్నాయి. అయితే వాట్స‌ప్‌లో ఒక ఫాంట్ స్ట‌యిల్ ఉంటుంది. మ‌నం మెసేజ్‌లు టైప్ చేసేట‌ప్పుడు అదే ఫాంట్ స్ట‌యిల్‌లోనే  టైప్ చేయాల్సి ఉంటుంది. అయితే వాట్స‌ప్ ఫాంట్ స్ట‌యిల్‌ను మార్చుకోవ‌చ్చా.. ఒక‌వేళ మార్చుకుంటే అది ప‌ర్మినెంట్‌గా ఉండిపోతుందా? అదెలాగో చూద్దాం..

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌తి రోజూ వాట్స‌ప్‌ను యూజ్ చేసే వాళ్లు ఏకంగా వంద కోట్ల మంది ఉన్నారు.  ఆ వంద కోట్ల‌లో మీరూ ఒక‌రు. సాధార‌ణంగా మ‌నం ప్ర‌తిరోజూ చేసే ప‌నిని మ‌ళ్లీ చేయాల‌ని అనుకోరు.  55000 వేల మంది వాట్స‌ప్ ఉద్యోగులు ప్ర‌తిరోజూ కొత్త అప్‌డేట్స్ కోసం ప్ర‌య‌త్నిస్తూనే ఉంటారు. మ‌న లైఫ్ స్ట‌యిల్‌కు త‌గ్గ‌ట్టుగా వాట్స‌ప్‌లో మార్పుల కోసం నిత్యం ప్ర‌య‌త్నాలు జ‌రుగుతూనే ఉంటాయి. అందులో భాగంగానే ఫాంట్ స్ట‌యిల్‌ను మార్చ‌డం గురించి కూడా వాట్స‌ప్ కొన్ని మార్పులు చేసింది. నిబంధ‌న‌లను అనుస‌రించి ముందుకెళ్తే మ‌నం ప‌ర్మినెంట్‌గా ఒకే ఫాంట్‌ను కూడా సెట్ చేసుకోవ‌చ్చు.

1. ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో వాట్స‌ప్ యాప్ ఓపెన్ చేయాలి... మీరు లాగిన్ కాకుండే ఉంటే వెంట‌నే లాగిన్ కావాలి

2.చాట్ అన్న ఆప్ష‌న్ మీద ట‌చ్ చేయాలి. ఇది మిడి సెక్ష‌న్‌లో ఉంటుంది. ఆ చాట్ సెక్ష‌న్‌లో మెసేజెస్ మీద క్లిక్ చేయాలి 

3. మీరు ఎవ‌రికి మెసేజ్‌లు పంపాల‌నుకుంటున్నారో వారికి డిఫ‌రెంట్ యూనిక్ స్ట‌యిల్ ఫాంట్‌ను సెల‌క్ట్ చేయాలి.

4.  కొత్త చాట్ స్టార్ చేయాల‌నుకుంటే చేజింగ్ మీద క్లిక్ చేసి మీకు న‌చ్చిన పాంట్‌ను ఎంచుకోవ‌చ్చు. 

5. ఆ త‌ర్వాత మీరు చాటింగ్ మొద‌లుపెట్టొచ్చు. మీరు మెసేజ్ టైప్ చేయ‌గానే మీరు భిన్న‌మైన ఫాంట్‌లో టైప్ చేస్తున్న‌ట్లు మీకు అర్ధం అయిపోతుంది.

జన రంజకమైన వార్తలు