ఫేస్‌బుక్ చూడందే.....గడవని గంటలు...వాట్సాప్ వాడనిదే...గడవని రోజులు ఇలా ఇంటర్నేట్లో ప్రతిరోజు గంటలతరబడి గడుపుతుంటాం. కానీ ప్రైవసీ గురించి ఆలోచిస్తున్నారా? మీ ఆన్ లైన్ అడుగుజాడల్ని చెక్ చేస్తున్నారా? తప్పనిసరిగా చేయాల్సిందే. ఫేస్ బుక్ లో యాక్టివ్గా ఉండటంతోపాటు...ప్రైవసీ విషయంలోనూ అంతే యాక్టివ్ ఉండాలి. ఫేస్ బుక్ లో ఫోన్ కాంటాక్టులు సింక్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే అనుకోకుండా అకౌంట్ హ్యాక్ అయితే...మీ కాంటాక్ట్ మాత్రమే కాకుండా మీ అడ్రస్ బుక్ లోని అందరి నెంబర్లు హ్యాకర్ల చేతికి చిక్కుతాయి. మన ఫోన్ లో నుంచి ఫేస్ బుక్ లోకి అప్ లోడ్ అయిన కాంటాక్ట్స్ ని ఎలా డిలీట్ చేయాలో తెలుసుకుందాం.
1.డెస్క్‌టాప్ బ్రౌజర్‌లో అయితే ఫేస్‌బుక్‌లోకి లాగిన్ అయ్యి https://www.facebook.com/mobile/messenger/contacts లింక్‌ని ఓపెన్ చేయండి.
2. ఎఫ్‌బీ మెసెంజర్ సర్వీసు ద్వారా అప్‌లోడ్ అయిన కాంటాక్ట్‌ల జాబితా కనిపిస్తుంది. డిలీట్ ఆల్ కాంటాక్ట్స్ క్లిక్ చేసి సింక్ అయిన అడ్రస్‌బుక్‌ని తొలగించండి.
3.డిలీట్ చేయడానికి ముందు మెసెంజర్‌లోకి వెళ్లి సింక్ కాంటాక్ట్స్ ఆప్షన్‌ని టర్న్‌ఆఫ్ చేయాలి. లేదంటే.. ఆటోమాటిక్‌గా మళ్లీ కాంటాక్ట్‌లన్నీ ఫేస్‌బుక్‌కి సింక్ అవుతాయి.
4. ఫేస్‌బుక్ ప్రైవసీ సెట్టింగ్స్‌ని ఎప్పటికప్పుడు చెక్ చేయండి. యాక్టివిటీ లాగ్ లోకి వెళ్లి మీ షేరింగ్‌లు, రియాక్షన్స్ రివ్యూ చేయండి. మీ ప్రమేయం లేకుండా ఏవైనా పోస్టింగ్ అవుతున్నాయోమో చెక్ చేసుకునేందుకు ఇక్కడ వీలుంది.
5. ఫోన్‌లో ఎఫ్‌బీని మరింత సురక్షితంగా వాడేందుకు మొబైల్ పిన్‌ని జనరేట్ చేసుకోవడం మంచిది. దీంతో పిన్ నెంబర్‌ని ఎంటర్ చేస్తే గానీ అప్‌డేట్స్ పోస్ట్ అవ్వవు. దీంతో ఇతరులు ఎవరైనా మీ అనుమతి లేకుండా పోస్ట్ చేయలేరు.
6 ఫేస్‌బుక్ లాగిన్ వివరాలతో ఏదైనా వెబ్‌సైట్, యాప్‌ల్లోకి లాగిన్ అయ్యుంటే వాటిని రివ్యూ చేసి తొలగించేందుకు సెట్టింగ్స్‌లోని యాప్స్ మరియు వెబ్ సైట్ విభాగంలోకి వెళ్లండి. అక్కర్లేని సర్వీసుల్ని ఎకౌంట్ యాక్సెస్ నుంచి తొలగించండి.