• తాజా వార్తలు

మీ ఆండ్రాయిడ్ ఫోన్లో లొకేషన్ ట్రాకింగ్ డిజాబుల్ చేయడం ఎలా

  • - ఎలా? /
  • 5 సంవత్సరాల క్రితం /

మీ ఆండ్రాయిడ్ ఫోన్లో లొకేషన్ ఆన్ లో ఉన్నా ఆఫ్ లో ఉన్నా అనుక్షణం గూగుల్ మిమ్మల్ని ట్రాక్ చేస్తుంటుంది. మీ పర్మిషన్ లేకుండానే లొకేషన్ డేటాను గూగుల్ సేవ్ చేసుకుంటుంది. లొకేషన్ హిస్టరీ ఆఫ్ చేసినా సరే....గూగుల్ యాప్స్ కొన్ని మీ లొకేషన్ డేటాను సేకరిస్తాయి. మరి మీ ఆండ్రాయిడ్ ఫోన్లో లొకేషన్ ట్రాకింగ్ డిజాబుల్ ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

ఆండ్రాయిడ్, ఐఫోన్లలో లొకేషన్ సర్వీసు టర్న్ ఆఫ్ చేయడం...
ఆండ్రాయిడ్....
* సెట్టింగ్స్ కు వెళ్లండి
* గూగుల్ లో గూగుల్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ట్యాబ్ పై నొక్కండి
* డేటా మరియు పర్సనల్ ట్యాబ్ కు వెళ్లండి. 
* లొకేషన్ హిస్టరిపై నొక్కండి. లొకేషన్ మార్చడానికి స్లడర్ను టర్న్ ఆఫ్ చేయండి. 
*లొకేషన్ హిస్టరి కింద ఉన్న స్క్రీన్ దిగువన డిలిట్ హిస్టరి లొకేషన్ ను నొక్కండి. 
 ios
* సెట్టింగ్స్ ఓపెన్ చేయండి
* ప్రైవసీ ఆప్షన్ కు వెళ్లండి.
* లొకేషన్ హిస్టరిలో ట్యాబ్ చేయండి...తర్వాత స్లైడ్ ను ఆపేయండి. 

మీకు కావాల్సిన లొకేషన్ను తెలుసుకోవడానికి కొన్ని యాప్స్ కూడా ఉన్నాయి. ఉదాహరణకు గూగుల్ మ్యాప్స్ మీ లొకేషన్ తెలుసుకోవడానికి ఉపయోగకరంగా ఉండదు. అలాంటి సమయంలో ప్రత్యామ్నాయంగా మీరు మీ లొకేషన్ యాక్సెస్ యాప్స్ ను కూడా టర్న్ ఆఫ్ చేయవచ్చు. 
ఆండ్రాయిడ్ ఫోన్లో ఎలా అనుసరించాలో తెలియాలంటే ఈ స్టెప్స్ ఫాలో అవ్వాలి. 
ఉదాహరణకు ఒప్పో ఎఫ్ 11 ప్రోలో సెట్టింగ్స్ >సెక్యూరిటీ> పర్మిషన్స్>యాప్>యాప్ పర్మిషన్>లొకేషన్ కు వెళ్లడం
ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లు డిఫరెంట్ కస్టమ్ మెనూని కలిగి ఉంటాయి. కాబట్టి ఈ సూచనలు మీ ఫోన్ మీద ఆధారపడి ఉంటాయి. 
ఐఫోన్, ఐప్యాడ్ ల కోసం....
సెట్టింగ్స్ కు వెళ్లి ప్రైవసీ లో లొకేషన్ సర్వీసును ఓపెన్ చేయండి. ఇప్పుడు మీ లొకేషన్ యాక్సెస్ కలిగి ఉన్న యాప్స్ లిస్టును చూస్తారు. ప్రతి యాప్ పై నొక్కండి. మీ లొకేషన్ యాక్సెస్ ను అందించడానికి ఏ యాప్ బాగుంటుందో చూడండి..

వెబ్, యాప్ యాక్టివిటీ ఆన్ లేదా ఆఫ్ చేయడం ఎలా....
* మీ కంప్యూటర్లో యాక్టివిటీ కంట్రోల్స్ పేజిని చూడండి
*ఇప్పుడు మీరు మీ గూగుల్ అకౌంట్ కు సైన్ ఇన్ చేయమని అడుగుతుంది. 
* వెబ్, యాప్ యాక్టివిటిని ఆన్ లేదా ఆఫ్ చేయండి. 
 

జన రంజకమైన వార్తలు