యూట్యూబ్‌లో వీడియోలను చూడడం, పాటలు వినడం లాంటివి మనం సర్వసాధారణంగా చేసే పనే. మీడియా కంటెంట్‌ను స్ట్రీమింగ్ చేయడానికి యూట్యూబ్ సరైన వేదిక. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందిన ఉచిత వీడియోల వేదిక. దీనిలో కోట్లాది వీడియోలు అందుబాటులో ఉన్నాయి. మ్యూజిక్ వీడియోలు మాత్రమే కాదు మూవీ ట్రయలర్స్ కూడా చూడొచ్చు. అయితే ఈ వీడియోలను మీరు ఆన్‌లైన్‌లో మాత్రమే చూసే అవకాశం ఉంటుంది మరి వీటిని డౌన్‌లోడ్ చేసుకుని చూడాలంటే ఎలా? మరి పీసీ, ల్యాప్‌టాప్, ఆండ్రాయిడ్ ఫోన్స్, ఐవోఎస్ డివైజ్‌లలో డౌన్‌లోడ్ చేసుకుని చూడడం ఎలా?
ఎంపీ3 జ్యూసెస్‌తో..
ఆన్‌లైన్‌లో వీడియో స్ట్రీమింగ్ సైట్ల నుంచి వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోవాలంటే ఎంపీ3 జ్యూసెస్ ఎంతో ఉపయోగపడతాయి. అలాగే యూట్యూబ్, వీమియో, డైలీ మోషన్ వీడియోలను కూడా సలుభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వీడియోలను ఎంపీ3 ఫార్మాట్లో కన్వర్ట్ చేయడానికి కూడా జ్యూసెస్ మంచి ఆప్షన్. ఇందుకోసం మీరెమీ రిజిస్ట్రేషన్, సైన్ అప్ చేయాల్సిన అవసరం కూడా లేదు. యూట్యూబ్ వీడియోలను హై డెఫినేషన్ క్వాలిటీతో డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఎంపీ3 జ్యూసెస్ ఉపయోగపడుతుంది. దీని సాయంతో ఎంపీ3 మ్యూజిక్‌ను డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉంది.
టబ్‌డి ఉపయోగించి..
ఉచితంగా ఎంపీ3 మ్యూజిక్‌ను డౌన్‌లోడ్ చేయడానికి టడ్‌బి మంచి ఆప్షన్. అన్ని లాంగ్వేజ్‌ల నుంచి ఇది మ్యూజిక్‌ను డౌన్‌లోడ్ చేసి పెడుతుంది. అంతేకాక యూట్యూబ్, డైలీ మోషన్ ఇతర వెబ్‌సైట్ల నుంచి వీడియోలను డౌన్‌లోడ్ చేయడానికి ఈ అప్లికేషన్ ఎంతో ఉపయోగపడుతుంది. టడ్‌బి ఫ్రీ ఎంపీ3 డౌన్‌లోడర్ సాయంతో వీడియోలను ఎంపీ3, ఎంపీ4, ఏవీఐ, వెబ్ఎం ఫార్మాట్లలోకి మార్చుకోవచ్చు. ఇదందా మీరు ఉచితంగా చేసుకునే అవకాశం ఉంది.
ఎంపీ3 కన్వర్టర్‌తో..
ఎంపీ3 కన్వర్టర్ సాయంతో యూట్యూబ్‌లో మీకు నచ్చిన వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఎంపీ3 మాత్రమే కాదు ఇతర ఫార్మాట్లలో సైతం మీరు వీడియోలను డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీని సాయంతో సులభంగా వీడియోలను వివిధ ఫార్మాట్లలో కన్వర్ట్ చేసుకుని ఆ తర్వాత కంప్యూటర్లో సేవ్ చేసుకునే అవకాశం ఉంది. ఆన్‌లైన్‌లో ఇదే అమేజింగ్ టూల్‌గా చెప్పుకోవచ్చు.