స్మార్ట్‌ఫోన్ వచ్చాక గూగుల్ మ్యాప్స్ సామాన్యుడికి చేరువైపోయింది. కారులో ఎక్కడికన్నా వెళ్లాలన్నా, తెలియని అడ్రస్ పట్టుకోవాలన్నా జస్ట్ వాట్సాప్‌లో లొకేషన్ షేర్ చేస్తే చాలు మ్యాప్ పట్టుకుని అక్కడ వాలిపోతున్నాం. ట్రైన్, బస్ జర్నీల్లో మనం ఎక్కడున్నామో మనవారు ఎప్పటికప్పుడు చూసుకోవడానికి జీపీఎస్‌తో మ్యాప్‌ను పాయింట్ అవుట్ చేస్తే చాలు. ఇక ఫుడ్ డెలివరీ యాప్స్‌కి అయితే గూగుల్ మ్యాప్సే ఆధారం. దీనిలో లాంగిట్యూడ్ (రేఖాంశం), లాటిట్యూడ్ (అక్షాంశం) విలువ తెలిస్తే నూటికి నూరు శాతం యాక్యురేట్‌గా లొకేషన్‌ను ట్రేస్ చేయొచ్చు.
దేనికి ఉపయోగం?
సైనిక అవసరాల్లో లాంగిట్యూడ్, లాటిట్యూడ్‌లకు విశేషమైన ప్రాధాన్యం ఉంటుంది. ఎందుకంటే ఇవి అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు. ఉదాహరణకు కేఎఫ్‌సీ రెస్టారెంట్ అని మనం ఉండే ఏరియా కొడితే దానికి మరీ దగ్గరలో అలాంటిదే ఇంకో కేఎఫ్‌సీ ఉంటే దాన్ని కూడా చూపిస్తుంది. కానీ లాంగిట్యూడ్, లాటిట్యూడ్ విలువ ఎంటర్ చేస్తే కచ్చితమైన ప్లేస్‌నే చూపిస్తుంది. అందుకే ఆర్మీవాళ్లు, ఎయిర్‌ఫోర్స్ వాళ్లు దీన్నే ఉపయోగిస్తారు. అంతరిక్ష పరిశోధనల్లోనూ ఈ విలువల ఆధారంగానే వెళ్లాల్సిన గమ్యాన్ని గుర్తిస్తారు. అలాంటి లాంగిట్యూడ్, లాటిట్యూడ్ విలువలు మనకు తెలిస్తే మనం కూడా దాన్ని వాడుకోవచ్చు. కచ్చితంగా ఎంటర్ చేసి ఎలాంటి టైమ్ వేస్ట్ లేకుండా నేరుగా వెళ్లిపోవచ్చు.
లాటిట్యూడ్, లాంగిట్యూడ్‌లను ఎలా తెలుసుకోవాలి?
1. గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేయండి.
2. మీరు లాంగిట్యూడ్, లాటిట్యూడ్ తెలుసుకోవాలనుకున్న ప్లేస్‌ను ఎంటర్ చేసి సెర్చ్ కొట్టండి
3. ఇప్పుడు మీ డెస్టినేషన్‌ను మార్కర్‌తో మ్యాప్ చూపిస్తుంది.
4. మార్కర్ పాయింట్ మీద రైట్ క్లిక్ చేస్తే సెర్చ్ బాక్స్‌లో రెండు సెట్ల అంకెలు కనిపిస్తాయి.
5. అందులో కామాకు ముందున్న అంకెలు లాటిట్యూడ్, కామా తర్వాత ఉన్న రెండో అంకెల సెట్ లాంగిట్యూడ్ అన్నమాట.