ఇండియన్ మొబైల్ మార్కెట్‌లో బాగా పాపులరయిన స్మార్ట్ ఫోన్ బ్రాండ్స్‌లో వివో కూడా ఒకటి. పెర్‌ఫార్మెన్స్ విషయంలో రెడ్‌మీ, ఒప్పోతో పోటీపడుతున్న ఈఫోన్లలో కెమెరా మంచి క్వాలిటీతో ఉంటుంది. 2జీబీ, 3జీబీ ర్యామ్ ఉన్న ఈ ఫోన్లలో ఇంటర్నల్ మెమరీ కూడా 16జీబీ, 32 జీబీకి మించి ఉండదు. దీనికితోడు విచ్చలవిడిగా యాప్స్ డౌన్‌లోడ్ చేసేస్తే ఫోన్ స్లో అయిపోతుంది. మెమరీ చాలకపోవడంతో అది ర్యామ్ కూడా బర్డెన్ అయి ఫోన్ పెర్‌ఫార్మెన్స్ డల్ అవుతుంది. యాప్స్‌ను ఎస్‌డీ (మెమరీ) కార్డ్‌లోకి మూవ్ చేసుకుంటే ర్యామ్ మీద రామ్ మీద కూడా ప్రెజర్ తగ్గించవచ్చు. వివో ఫోన్లో యాప్స్‌ను ఎస్డీ కార్డ్‌లోకి ఎలా మూవ్ చేయాలో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదివేయండి.
ఎలా చేయాలంటే..
1. మీ వివో ఫోన్‌లో Settings ఆప్షన్ క్లిక్ చేయండి.
2. స్క్రోల్ డౌన్ చేసి Apps ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ అయి ఉన్న అన్ని యాప్స్ లిస్ట్ కనిపిస్తుంది.
3. ఇప్పుడు మీరు ఎస్డీ కార్డ్‌లోకి ఏ యాప్‌ను మూవ్ చేయాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోండి.
4. యాప్ సెలెక్షన్ పూర్తయిన తర్వాత స్క్రీన్‌కి కుడి వైపున మధ్యలో ఉన్న Change బటన్‌ను క్లిక్ చేయండి.
5.ఇప్పుడు మీ యాప్‌ను ఫోన్ ఇంటర్నల్ స్టోరేజ్ నుంచి ఎస్డీ కార్డ్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు.
ఎస్డీ కార్డ్ నుంచి ఫోన్‌లోకి పంపాలంటే..
యాప్స్ ఫోన్ నుంచి ఎస్డీ కార్డ్‌లోకి మాత్రమే కాదు రివర్స్‌లో ఎస్డీ కార్డ్ నుంచి ఫోన్ ఇంటర్నల్ స్టోరేజ్‌లోకి కూడా మూవ్ చేయొచ్చు. దానికి కూడా సేమ్ ప్రొసేజరే. యాప్స్‌ను ఎటు నుంచి ఎటు మూవ్ చేయాలన్నా ఒకటే ఒక ఇబ్బంది. ఎక్కువ యాప్స్‌ను ఒకేసారి మల్టిపుల్ సెలెక్ట్ చేసి మూవ్ చేయలేం. ఒకదాని తర్వాత ఒకటి మూవ్ చేయాల్సిందే. క్లాస్10, ఆ పైన ఉన్న ఎస్డీ కార్డ్‌ను వాడితే యాప్స్ మూవ్ చేయడం, ఏదైనా డేటా డౌన్‌లోడ్ చేసుకోవడం సులువుగా అవుతుంది.