• తాజా వార్తలు

ఇప్ప‌టికే ప్లే స్టోర్‌లో కొనుక్కున్న గేమ్స్‌ని, యాప్స్‌ని రీఇనిస్టాల్, రీస్టోర్ చేయ‌డం ఎలా?

  • - ఎలా? /
  • 5 సంవత్సరాల క్రితం /

ప్లేస్టొర్‌లో ఎప్పుడైనా పెయిడ్ యాప్స్‌ని ఎప్పుడైనా కొన్నారా? అయితే వాటిని కొంత‌కాలం వాడి ఆ త‌ర్వాత అన్ ఇన్ స్టాల్ చేస్తారా? మ‌రి మ‌ళ్లీ వాటిని వాడుకోవాల‌ని అనుకుంటున్నారా? .. కానీ మ‌ళ్లీ ఆ యాప్‌ల‌ను వాడాల‌ని అనుకుంటే పేమెంట్ క‌ట్టాల‌నే మెసేజ్ మీకు వ‌స్తుందా? ... అయితే మీరు బాధ‌ప‌డొద్దు. మీరు ఇప్ప‌టికే ప్లే స్టోర్‌లో కొనుక్కున్న గేమ్స్‌ని, యాప్స్‌ని రీ ఇన్‌స్టాల్ చేసుకుని మ‌ళ్లీ వాడుకోవ‌చ్చు.. ఎలాంటి రుసుము చెల్లించ‌క్క‌ర్లేదు. మ‌రి అదెలాగో చూద్దామా..

ప్లే స్టోర్ నుంచి ఇన్‌స్టాల్ చేయ‌డం

1. ప్లేస్టోర్ ఓపెన్ చేసి మెనూ ఐకాన్ మీద క్లిక్ చేయాలి

2. ఆ త‌ర్వాత మై యాప్‌, గేమ్స్ ఆప్ష‌న్ సెక్ష‌న్‌కు వెళ్లాలి

3. మై యాప్స్‌, గేమ్స్ సెక్ష‌న్‌లో లైబ్ర‌రీ ఆప్ష‌న్ ఎంచుకోవాలి

4. ఆ పేజీలో మీరు స్క్రోల్ చేసుకుంటూ ముందుకెళితే మీకు న‌చ్చిన యాప్‌లు క‌నిపిస్తాయి.

5. యాప్‌లు లొకేట్ చేసిన త‌ర్వాత వాటి మీద ట్యాప్ చేసి ఇన్‌స్టాల్ బ‌ట‌న్ మీద క్లిక్ చేస్తే చాలు. 

పీసీ నుంచి ఇన్‌స్టాల్ చేయ‌డం..

1.  పీసీలోకి వెళ్లి ప్లే స్టోర్‌లో మై యాప్స్ విభాగంలోకి వెళ్లాలి.

2,. లేక‌పోతే మీ స్మార్ట్‌ఫోన్‌ను యూజ్ చేసి ఇన్‌కాగ్నిటో లేదా ప్రైవేట్ మోడ్ ద్వారా మైయాప్స్ యూజ్ చేయాలి

3. ఈమెయిల్ అడ్రెస్‌ను యూజ్ చేసి లాగిన్ కావాలి. ఈ మెయిల్ ఐడీ మీరు యాప్స్ ప‌ర్చేజ్ చేయ‌డానికి వాడిందై ఉండాలి

4.  మై యాప్స్‌లో సెర్చ్ చేసుకుంటూ వెళితే మీకు సంబంధించిన యాప్స్ లొకేట్ అవుతాయి

5. ఆ త‌ర్వాత ఆ యాప్స్ మీద క్లిక్ చేసి ఇన్‌స్టాల్ బ‌ట‌న్ నొక్కాలి. 

జన రంజకమైన వార్తలు