కాలర్ ట్యూన్, రింగ్‌టోన్‌లకు అర్థం, వాటిమధ్య తేడా ఏమిటో అందరికీ సులభంగా తెలిసే విషయం కాదు... కానీ, మొబైల్ వినియోగదారులంతా ఓ కాలర్ ట్యూన్ సెట్ చేసుకోవడం ఈ రోజుల్లో పరిపాటిగా మారింది. అసలు ఈ రెండింటికీ మధ్య భేదం ఏమిటంటే... ఎవరైనా కాల్ చేసినపుడు మనకు వినిపించేది ‘రింగ్‌టోన్’... అదే సమయంలో మనకు కాల్ చేసినవారికి వినిపించేది ‘కాలర్ ట్యూన్’ అన్నమాట! ఇక ఇంతకుముందు కాలర్ ట్యూన్ కావాలంటే ప్రత్యేక రీచార్జి చేసుకోవాల్సి వచ్చేది. అయితే, JIO (Reliance Jio Infocomm Limited) రంగప్రవేశం తర్వాత కాలం మారిపోయింది. ఇప్పుడు కాలర్ ట్యూన్ ఉచితంగా లభిస్తోంది. ఈ నేపథ్యంలో ఎయిర్‌టెల్ కస్టమర్లు తమ ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ సిమ్‌లలో ఉచితంగా కాలర్/హలో ట్యూన్ సెట్ చేసుకోవడం ఎలాగో తెలుసుకుందాం. ఇందుకుగల మార్గాల్లో SMS, టోల్-ఫ్రీ నంబర్, ఇంటర్నెట్ ఆన్‌లైన్, యాప్స్ వంటివి కొన్ని... కాబట్టి ఆయా మార్గాల్లో కాలర్/హలో ట్యూన్‌ను ఉచితంగా సెట్ చేసుకునేందుకు ‘స్టెప్ బై స్టెప్’ గైడ్ ఇది.
STEP 1: మీ మొబైల్‌లో మెసేజ్ బాక్స్ ఓపెన్ చేయండి. అందులోనుంచి ‘‘SET<space><song code?’’ టైప్ చేసి, 543211 నంబరుకు మెసేజ్ పంపండి. అయితే, ‘‘సాంగ్ కోడ్ ఏమిటి? ఆ పూర్తి జాబితా కనుగొనడం ఎలా’’గన్న సందేహం మీ మదిలో మెదిలే ఉంటుంది. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా... ఎయిర్‌టెల్ అధికారిక వెబ్‌సైట్ ‘‘www.airtelhellotunes.in’’లోకి వెళ్తే సరి!
STEP 2: మీకిష్టమైన పాటను ఓ ఫోన్‌కాల్‌తో కాలర్ ట్యూన్‌గా సెట్ చేసుకోవాలంటే- మీ ఎయిర్‌టెల్ నంబర్ నుంచి 543211కు కాల్ చేయండి. ఆ తర్వాత కంప్యూటర్‌లో కనిపించే స్టెప్స్‌ను ఫాలో అయిపోవడమే.
STEP 3: ఏదో ఒక పాటను సెట్ చేసుకున్న తర్వాత కొంతకాలానికి దానిపై మొహం మొత్తి, తొలగించాలని భావిస్తే- ‘‘STOP’’ అని 543211 నంబరుకు SMS పంపితే సరిపోతుంది. మళ్లీ కొత్త ట్యూన్ కావాలంటే ఏం చేయాలో తెలుసుగా! ఇక JIOను ఢీకొనడంలో భాగంగా ఎయిర్‌టెల్ ఈ నెల 22వ తేదీన రూ.419 రూపాయల రీచార్జితో 105 GB డేటా, పరిమితిలేని వాయిస్ కాల్స్ ప్లాన్‌ను ఆఫర్ చేసింది. కాలర్ ట్యూన్స్‌కు దీనికి సంబంధం లేదండోయ్! కేవలం ఎయిర్‌టెల్ కొత్త ప్లాన్ గురించి మీకు సమాచారం ఇవ్వడం కోసమే చివరగా ఈ విషయం ప్రస్తావించబడింది.