• తాజా వార్తలు

ఫేస్‌బుక్ మెసేంజర్‌లో సీక్రెట్ ఛాటింగ్ చేయడం ఎలా ?

  • - ఎలా? /
  • 5 సంవత్సరాల క్రితం /

సోషల్ మీడియాలో దూసుకుపోతున్న ఫేస్‌బుక్ మెసేంజర్ యాప్ లో చాలా మంది ఛాట్ చేస్తుంటారు.  అయితే ఈ ఛాట్ అందరికీ కనిపిస్తూ ఉంటుంది. అయితే అలా కనపడకుండా చాట్ చేసుకోవడం ఎలా అని చాలామంది ఆలోచిస్తుంటారు. అందుకు ఆప్సన్ ఉందా అని అడుగుతుంటారు. అలాంటి ఆప్సన్ ఫేస్‌బుక్‌ మెసెంజర్‌లో ఉందనే చెప్పవచ్చు. ఫేస్‌బుక్‌ మెసెంజర్‌లో మీరు ఎవరితోనైనా రహస్యంగా ఛాటింగ్ చేసుకోవచ్చు. ఆ మెసేజ్‌లు ఎక్కువ సేపు ఉండవు. వెంటనే డిలిట్ అయిపోతాయి. దీన్నే సీక్రెట్ కాన్వర్జేషన్ అంటారు. మరి ఫేస్‌బుక్ మెసెంజర్‌లో సీక్రెట్ కాన్వర్జేషన్ ఎలా ఉపయోగించుకోవాలి? దాంతో సీక్రెట్ ఛాటింగ్ ఎలా సాధ్యమవుతుందో తెలుసుకోండి.

ముందుగా మీరు మీ మెసెంజర్ యాప్ ఓపెన్ చేయాలి. మీరు ఎవరితో అయితే రహస్యంగా ఛాట్ చేయాలనుకుంటున్నారో వారి పేరుపై క్లిక్ చేసి ఛాట్ విండో ఓపెన్ చేయాలి. ఆ ఛాట్ విండోలో టాప్ రైట్‌లో ఇన్ఫో ఐకాన్ కనిపిస్తుంది. ఆ ఐకాన్ క్లిక్ చేయాలి. అందులో 'Go to Secret Conversation' ఆప్షన్ క్లిక్ చేయాలి. ఆ తర్వాత సీక్రెట్ కాన్వర్జేషన్ స్టార్ట్ చేయాలి. టైమర్ కూడా సెట్ చేసుకోవచ్చు. మీరు సెట్ చేసిన టైమ్‌ని బట్టి మెసేజెస్ డిలిట్ అవుతాయి.

ఈ సీక్రెట్ కాన్వర్జేషన్‌లో మెసేజెస్‌తో పాటు ఫోటోలు, స్టిక్కర్స్, వీడియోస్, వాయిస్ రికార్డింగ్స్ పంపుకునే అవకాశం  ఉంది. అయితే ఇందులో గ్రూప్ మెసేజెస్, గిఫ్ ఫైల్స్, వాయిస్ లేదా వీడియో కాలింగ్, పేమెంట్స్ సాధ్యం కావు. ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ కాబట్టి మెసేజెస్, ఫోటోలు, వీడియోలు మాత్రమే పంపుకోవచ్చు. ఇంకో సమస్య ఏంటంటే మీరు సీక్రెట్‌గా ఛాటింగ్ చేసినా అవతలి వ్యక్తి స్క్రీన్‌షాట్‌తో మెసేజెస్ షేర్ చేసే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు మన జాగ్రత్తలో మనం ఉండటమే మంచిది. 

జన రంజకమైన వార్తలు