• తాజా వార్తలు

గూగుల్ డాక్స్ లో వాయిస్ డిక్టేషన్ని యూజ్ చేయడం ఎలా?

  • - ఎలా? /
  • 4 సంవత్సరాల క్రితం /

వాయిస్ని ఉపయోగించడం ద్వారా టెక్ట్ డాక్యుమెంట్లను టైప్ చేయడం చాలా కాలం క్రితమే ఆరంభం అయింది. జస్ట్ మైక్రో ఫోన్ ద్వారా కూడా మీ పీసీ తో మాట్లాడే అవకాశం ఉండేది. అయితే దీని వల్ల ఉపయోగాల కన్నా ఇబ్బందులే ఎక్కువగా ఉండేవి. చాలా తక్కువ వాయిస్ తో మాట్లాడితే తప్ప కంప్యూటర్ రికగనైజ్ చేసే అవకాశం ఉండేది కాదు. అంటే రోబోలు మాట్లాడినట్లే మాట్లాడాల్సి వచ్చేది.  కాలం మారింది. వాయిస్ రికగనైజేషన్లో ఎన్నో ఆవిష్కరణలు వచ్చాయి. వాటిలో ప్రధానమైంది గూగుల్ డాక్స్ వాయిస్. మరి  గూగుల్ డాక్స్ వాయిస్ డిక్టేషన్ ను  ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుందామా..

టైపింగ్ చేయడం ద్వారా..

క్రోమ్ బ్రౌజర్ ద్వారా మాత్రమే ప్రొపర్ వాయిస్ డిక్టేషన్ సాధ్యం అవుతుంది  మీ మొబైల్లో గూగుల్ డాక్స్ యాప్ వాడుతుంటే కనుక గూగుల్ కీ బోర్డు మైక్రోఫోన్ ద్వారా టెక్ట్ ని డిక్టేట్ చేసే అవకాశం ఉంది.  గూగుల్ డాక్స్ ద్వారా వాయిస్ టెక్ట్స్ ఆప్షన్ వాడుకోవాలంటే కచ్చితంగా మైక్రోఫోన్ ఉండాలి. విండోస్ 10లో మీరు రైట్ క్లిక్ చేయడం ద్వారా స్పీకర్ ఆప్షన్ కనిపిస్తుంది. ఆ తర్వాత ఓపెన్ సౌండ్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయాలి. స్క్రీన్ మీద ఇన్ పుట్ ఆప్షన్ కింద ఉండే మైక్ ద్వారా మీరు మాట్లాడే అవకాశం ఉంది. మీరు వాయిస్ మాట్లాడుతుంటే టెక్ట్ టైప్ అయిపోతుంది. 

బిల్ట్ ఇన్ మైక్రోఫోన్

ల్యాప్ టాప్లో అయితే మైక్రోఫోన్ బిల్ట్ ఇన్ గా ఉంటుంది. మనకు మంచి క్వాలిటీ మైక్ ఉంటే చాలు వాయిస్ ద్వారా టెక్ట్ ని కన్వర్ట్ చేయచ్చు. మీరు ఎక్కడ టెక్ట్ టైప్ చేయాలని అనుకుంటున్నారో అక్కడ కర్సర్ పెట్టి టూల్స్ లోకి వెళ్లి వాయిస్ టైపింగ్ ఆప్షన్ క్లిక్ చేయాలి. లేదా కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఎస్ ఆప్షన్ ని క్లిక్ చేయడం ద్వారా కూడా ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు. అందులో మైక్రోఫోన్ బొమ్మ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి డిక్టేషన్ స్టార్ట్ చేయచ్చు. రియల్ టైమ్ లో మీరు ఏం చెబితే అది టైప్ అయిపోతుంది. 

జన రంజకమైన వార్తలు