గతేడాది యాపిల్ ఐఫోన్ ఎక్స్ ఆర్, ఐఫోన్ ఎక్స్ఎస్, ఐఫోన్ ఎక్స్ఎస్ మాక్స్‌లకు డ్యుయల్ సిమ్ సపోర్ట్ సదుపాయాన్ని యాడ్ చేసింది. అయితే ఇంకా కొత్త టెక్నాలజీ అందుబాటులో రాని నేపథ్యం ఇంకా యాపిల్ ఫోన్స్‌లో సింగిల్ సిమ్ కార్డ్ స్లాట్‌తోనే వాడుతున్నారు. అయితే ఒక్క సిమ్‌తోనే రెండు సిమ్ కార్డులను యూజ్ చేసే ఇ-సిమ్ సాంకేతికతను యాపిల్ తీసుకొచ్చింది. ఇదే ఇ-సిమ్ టెక్నాలజీ గూగుల్ పిక్సల్ సిరీస్ ఫోన్లలో కూడా అందుబాటులో ఉంది. ప్రపంచంలోనే పెద్ద నెట్‌వర్క్ అయిన ఎయిర్‌టెల్ ఈ ఇ-సిమ్ టెక్నాలజీని తీసుకొచ్చింది. ఎయిర్‌టెల్ సిమ్‌ను ఇ-సిమ్ టెక్నాలజీగా వాడడం ఎలాగో చూద్దామా...
ఎయిర్‌టెల్ మాత్రమే
భారత్‌లో ఐఫోన్ ఎక్స్ఎస్ లాంఛ్ చేసిన వెంటనే ఎయిర్‌టెల్ మాత్రమే ఇ-సిమ్ యాక్టివేషన్‌కు తాము సపోర్ట్ చేస్తామని ప్రకటించింది. ప్రపంచంలోని మిగిలిన ఫోన్ నెట్‌వర్క్స్ కంటే మన భారత కంపెనీ ఇలా అధునాతన టెక్నాలజీన అడాప్ట్ చేసుకోవడం విశేషమే. మరి ఐఫోన్, పిక్సల్ ఫోన్లు వాడుతున్న వాళ్లు తమ ఫోన్లో సింగిల్ స్లాట్ ఉన్నా కూడా డ్యుయల్ సిమ్ ప్రయోజనాన్ని పొందడానికి ఎయిర్‌టెల్ సిమ్‌ను యూజ్ చేసుకోవచ్చు. మరి ఎయిర్‌టెల్ సిమ్‌ను ఇ-సిమ్ టెక్నాలజీగా ఎలా వాడాలో తెలుసుకుందాం.
ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి
1. ముందుగా మీ ఐఫోన్ లేదా పిక్సల్ ఫోన్‌ను అప్‌డేట్ చేసుకోవాలి. లేటెస్ట్ వెర్షన్‌కు మార్చుకోవాలి
2. 121కు ఇసిమ్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ రిజస్టర్ ఈమెయిల్ ఐడీ, రిజిస్టర్ మొబైల్ నంబర్‌ను టైప్ చేసి సెండ్ చేయాలి. 121కు కాల్ చేసి కూడా వివరాలు తెలుసుకోవచ్చు
3. ఇ-సిమ్ రిక్వెస్ట్‌ను నిర్ధారణ చేసుకోవడానికి 1 అని టైప్ చేసి రిప్లే ఇవ్వాలి.
4. ఒకసారి ఇ-సిమ్ రిక్వెస్ట్ విజయవంతం అయితే మీ మెయిల్‌కు ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది.
5. ఐఫోన్ యూజర్లు సెట్టింగ్స్‌లోకి వెళ్లి సెల్యూలర్, యాడ్ సెల్యులర్ ప్లాన్, స్కాన్ క్యూర్ కోడ్ మీద క్లిక్ చేయాలి. ఆండ్రాయిడ్ యూజర్లు సెట్టింగ్స్‌లోకి వెళ్లి నెట్‌వర్క్, ఇంటర్నెట్, మొబైల్ నెట్‌వర్క్, అడ్వాన్సడ్, కారియర్, యాడ్ కారియర్, స్కాన్ క్యూఆర్ కోడ్ మీద క్లిక్ చేయాలి.