• తాజా వార్తలు

ఆన్‌లైన్‌లో ఓట‌ర్ ఐడీ న‌మోదు చేసుకోండిలా..

  • - ఎలా? /
  • 7 సంవత్సరాల క్రితం /

ఓట‌ర్ గుర్తింపు కార్డు.. దేశంలో ప్ర‌తి పౌరుని హ‌క్కు. కానీ చాలామందికి ఓట‌ర్ ఐడీలు ఉండ‌వు. ఒక‌వేళ ఉన్నా తాము ఏ నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్నామో కూడా వారికి తెలియ‌దు. ఒక‌వేళ తెలిసినా తీరా ఓటు వేద్దామ‌ని వెళ్లేస‌రికే వాళ్ల ఓట్లు గ‌ల్లంతు అవుతాయి. చాలామందికి తెలియ‌ని విష‌యం ఏమిటంటే ఓట‌రు గుర్తింపు కార్డులను ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిశీలించి డ‌బుల్ ఎంట్రీ ఉంటే తీసేస్తారు. కానీ వాళ్లు త‌మ ఓటు ఉంద‌ని చెప్పి ఓటింగ్ కేంద్రానికి వెళ్లి గొడ‌వ చేస్తారు. అందుకే ఎప్ప‌టిక‌ప్పుడు త‌మ ఓటింగ్ స్టేట‌స్‌ను తెలుసుకోవ‌డం అంద‌రికి మంచింది. ఒక‌వేళ ఓటు మిస్ అయిన‌ట్లయితే వెంట‌నే మ‌ళ్లీ న‌మోదు చేయించుకోవాలి. ఐతే ఓట‌రు న‌మోదు కార్య‌క్ర‌మం సాధార‌ణంగా ఏడాది పొడవునా ఉండ‌దు. అందుకే చాలామంది ఈ విషయాన్ని అక్క‌డితే వ‌దిలేస్తారు. కానీ ఆన్‌లైన్‌లో ఓట‌రు న‌మోదు కార్య‌క్ర‌మం ఎప్పుడూ ఉంటుంది. ఈ విష‌యం చాలా మందికి తెలియ‌దు. అంతేకాదు మీ ఓటు న‌మోదు, ఓటు రావ‌డం కూడా వెంట వెంట‌నే జ‌రిగిపోతుంది. మ‌రి ఆన్‌లైన్‌లో ఓట‌రు గుర్తింపు కార్డు ఎలా న‌మోదు చేసుకోవాలో చూద్దామా..

1. ప్ర‌తి స్టేట్‌కి ఒక ఓట‌రు గుర్తింపు ఇచ్చేవెబ్‌సైట్ ఉంటుంది. ఉదాహ‌ర‌ణ‌కు మీరు ఆంద్ర‌ప్ర‌దేశ్ అయితే ఏపీ ఎల‌క్ష‌న్ బోర్డు వెబ్‌సైట్‌కు వెళ్లాలి. సైట్‌కు వెళ్ల‌గానే కొత్త ఓట‌రు రిజిస్ట్రేష‌న్ ఉంటుంది. ఆ లింక్‌ను క్లిక్ చేయ‌గాఏ ఫామ్ 6 వ‌స్తుంది. ఆ అప్లికేష‌న్‌ను ఓపెన్ చేసి మీ పేరు, పుట్టిన తేదీ, మీ పుట్టిన స్థ‌లం, సిటీ, జిల్లా, భాష త‌దిత‌ర వివ‌రాలు ఫిల్ చేయాలి.

2. వివరాల‌న్ని నింపాక మీకు సంబంధించిన డాక్యుమెంట్ల‌ను అప్‌లోడ్ చేయాలి. క‌ల‌ర్ పాస్‌పోర్ట్ ఫొటో, ఐడీ ఫ్రూఫ్‌, అడ్రెస్ ఫ్రూఫ్, జ‌న‌న ద్రువీక‌ర‌ణ ప‌త్రం అప్‌లోడ్ చేయాలి. ఈ వివ‌రాల‌న్ని నింపాక స‌బ్‌మిట్ బ‌ట‌న్ క్లిక్ చేయాలి.

3. ఆ త‌ర్వాత మీకొక అప్లికేష‌న్ నంబ‌ర్ వ‌స్తుంది. ఈ నంబ‌ర్‌ను ప‌దిల ప‌రుచుకోవాలి. భ‌విష్య‌త్‌లో మీ అప్లికేష‌న్ స్టేట‌స్ చూడ‌టానికి ఇది ఉప‌యోగ‌ప‌డుతుంది. ఏమైనా అనుమానాలు ఉంటే మీ సంబంధిత ఏరియా బీఎల్ఓ మిమ్మ‌ల్ని కాంటాక్ట్ చేస్తారు.
ఎవ‌రు అప్లై చేయ‌చ్చు?
ఓట‌రు ఐడీ అప్లై చేయాలంటే భార‌త పౌరుడై ఉండి 18 ఏళ్లు నిండిన వారై ఉండాలి. ఒక వ్య‌క్తికి ఒక చోట మాత్ర‌మే ఓటు ఉంటుంది. ఒక వేళ ఒక‌టికి మించి ఓట్లు ఉంటే.. మ‌న‌మే మ‌న అవ‌స‌ర‌మైన ఓటు ఉంచుకుని రెండోది తీసేయాలి. అధికారులు గుర్తిస్తే రెండు ఓట్లు పోయే అవ‌కాశాలు ఉన్నాయి. మీరు ఓట‌రు ఐడీ అప్లై చేసిన త‌ర్వాత దాని స్టేట‌స్‌ను కూడా ఎప్ప‌టిక‌ప్పుడు చెక్ చేసుకోవ‌చ్చు. మీ సంబంధిత ఎల‌క్ష‌న్ సైట్లోకి వెళ్లి ఓట‌ర్ ఐడీ కార్డు స్టేట‌స్ లింక్ మీద క్లిక్ చేయాలి. అక్క‌డ మీ రిఫ‌రెన్స్ లింక్ ఎంట‌ర్ చేయ‌గానే మీ అప్లికేష‌న్ వివ‌రాలు వ‌స్తాయి. లేక‌పోతే మీ అప్లికేష‌న్ ఐడీని ఎంట‌ర్ చేసినా మీ ఓట‌ర్ ఐడీ స్టేట‌స్ తెలుస్తుంది. మీ ఓట‌ర్ ఐడీలో ఏమైనా త‌ప్పొప్పులు ఉంటే వాటిని ఆన్‌లైన్‌లో క‌రెక్ష‌న్ చేసుకోవచ్చు. ఎల‌క్ష‌న్ సైట్లోకి వెళ్లి ఓట‌ర్ ఐడీ క‌రెక్ష‌న్ లింక్ క్లిక్ చేయాలి. ఏమైనా క‌రెక్ష‌న్ చేయాలంటే ఫామ్ 8, ఫామ్ 8ఎ నింపాల్సి ఉంటుంది. ఈ ఫామ్‌లో మీ వివ‌రాలు స‌రిగా నింపి స‌బ్‌మిట్ బ‌ట‌న్ నొక్కాలి. కొన్ని రోజుల త‌ర్వాత మీ స‌వ‌రించిన ఓట‌రు ఐడీ కార్డు మీ ఇంటికే వ‌స్తుంది.

జన రంజకమైన వార్తలు