ఆండ్రాయిడ్ ఫోన్లో మీరు తీసే ఫోటోలన్నీ మీ జీమెయిల్ అకౌంట్‌తో లింకయి ఉన్న గూగుల్ ఫోటోస్‌లో ఆటోమేటిగ్గా సేవ్ అవుతాయి. మీరు సింక్ చేసుకుంటే గూగుల్ డ్రాప్ బాక్స్‌లో కూడా ఆటోమేటిగ్గా సేవ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఆ ఫోటోలను డ్రాప్‌బాక్స్‌లో సేవ్ చేసుకోవాలంటే మాత్రం కష్టమైన పనే. అయితే మీ ఆండ్రాయిడ్ ఫోన్లో తీసిన ఫోటోలను డ్రాప్‌బాక్స్‌లో కూడా ఆటోమేటిగ్గా సేవ్ అయ్యేలా చేసుకోవచ్చు. ఐఎఫ్‌టీటీటీ యాప్‌తో ఇది సాధ్యమవుతుంది.
ఇలా చేయాలి..
1. మీ ఆండ్రాయిడ్ ఫోన్లో ఐఎఫ్ టీటీటీ యాప్ డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేసుకోండి.
2. తర్వాత యాప్‌లో ఒక యాప్‌లెట్ ఇన్‌స్టాల్ చేయాలి. ఇందుకోసం యాప్ ఓపెన్ చేసి దానిలో కింద ఉన్న My applets బటన్ టాప్ చేయాలి.
3. ఇప్పుడు + బటన్ క్లిక్ చేసి యాప్‌లెట్ ట్రిగ్గర్ ఛానల్ సెలెక్ట్ చేసుకోవాలి. దీని కోసం “Android Photos” అని టైప్ చేసి అప్లికేషన్ సెలెక్ట్ చేసుకోవాలి.
4.తర్వాత స్టెప్‌లో దీన్ని మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఉన్న గూగుల్ అకౌంట్‌తో కనెక్ట్ చేయమని అడుగుతుంది. ఇలా కనెక్ట్ చేయగానే “Android Photos” ఛానల్‌తో కనెక్ట్ అయి ఉన్న Any New Photo, New Screenshot వంటివన్నీ కనిపిస్తాయి. వాటిలో నుంచి Any New Photo అనే యాప్‌లెట్ ట్రిగ్గర్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఫోటో తీసినప్పుడల్లా ఇది ట్రిగ్గర్ అవుతుంది.
5. ఇప్పుడు కొత్త యాప్‌లెట్‌గా డ్రాప్‌బాక్స్ అప్లికేషన్‌ను యాప్‌లెట్ యాక్షన్ ఛానెల్‌గా సెలెక్ట్ చేయాలి.
6. డ్రాప్‌బాక్స్ సెలెక్ట్ చేశాక దీనికి సంబంధించిన యాక్షన్స్ అన్నీ స్క్రీన్ మీద కనిపిస్తాయి. ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోటోలను డ్రాప్‌బాక్స్‌లో ఆటోమేటిగ్గా అప్లై చేయడానికి Add File from URLను యాప్ లెట్ యాక్షన్ గా సెలెక్ట్ చేసుకోవాలి.
7. ఈ యాక్షన్‌ను కంప్లీట్ చేయడానికి ఫైల్ యూఆర్ఎల్ లింక్, డ్రాప్‌బాక్స్ ఫోల్డర్ పాత్, మొదలైనవి సెలెక్ట్ చేసి Create Action బటన్ టాప్ చేయాలి. వీటిని ఐఎఫ్‌టీటీటీ యాప్‌లెట్‌లో సేవ్ చేయాలి.
8. దీంతో యాప్‌లెట్ యాక్టివేట్ అయి మీరు ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఫోటో తీయగానే ఆ ఫోటో డ్రాప్‌బాక్స్‌లో ఆటోమేటిగ్గా అప్‌లోడ్ అవుతుంది.
ఏమిటి ఉపయోగం?
స్మార్ట్‌ఫోన్ వచ్చాక ప్రతి చిన్న విషయాన్నిఫోటో తీస్తున్నాం. జీమెయిల్‌కు లింకయి ఉన్న గూగుల్ డ్రైవ్‌లో 15 జీబీ వరకే స్పేస్ ఉంటుంది. ఆపైన కావాలంటే కొనుక్కోవాలి. అదే వన్‌డ్రైవ్‌లో కూడా సేవ్ చేసుకుంటే అదనపు స్పేస్ మీకు అందుబాటులోకి వచ్చినట్టే కదా.