• తాజా వార్తలు

మీ సెల్ నెంబ‌‌ర్ మార‌కుండానే..  ఎయిర్‌టెల్ లేదా ఐడియా నెట్‌వ‌ర్క్‌లోకి మార‌డం ఎలా? 

  • - ఎలా? /
  • 3 సంవత్సరాల క్రితం /

ఒక‌ప్పుడు ఏదైనా సిమ్‌కార్డు తీసుకుంటే స‌ర్వీసు న‌చ్చినా న‌చ్చ‌క‌పోయినా చాలామంది దాన్నే కొన‌సాగించేవారు. అందుకు కార‌ణం కొత్త నెట్‌వ‌ర్క్‌కు మారితే అల‌వాట‌యిన నెంబ‌ర్ పోతుందని. ఎంతోమంది దీన్ని ఫేస్ చేస్తున్నార‌ని ట్రాయ్ మొబైల్ నంబ‌ర్ పోర్టబులిటీ తెచ్చింది.  అంటే మీ నంబ‌ర్ మార‌కుండానే నెట్‌వ‌ర్క్ మార్చుకోవ‌చ్చు. ఇది వ‌చ్చి చాలాకాలం అయినా ఇప్ప‌టికీ దీనిమీద అంద‌రికీ పూర్తిగా తెలియ‌దు. అందుకే మొబైల్ నెంబ‌ర్ పోర్టబులిటీ గురించి మ‌రొక్క‌సారి రిమైండ్ చేసుకుందాం.  మీరు ఐడియా, బీఎస్ఎన్ఎల్‌, జియోల్లో ఏదో ఒక సిమ్ వాడుతున్నార‌నుకుంందాం. దాన్నుంచి మీరు ఆ నంబ‌ర్ అలాగే ఉంచి ఎయిర్‌టెల్ నెట్‌వ‌ర్క్‌లోకి మారాల‌నుకుంటే ఈ కింది స్టెప్స్  ఫాలో అవ్వండి

ఎయిర్‌టెల్‌కు పోర్ట్ అవ‌డం ఎలా?
*ముందుగా ప్లేస్టోర్ లేదా యాపిల్ స్టోర్ నుంచి ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.
* యాప్ ఓపెన్ చేసి మీ ప్లాన్ సెలెక్ట్ చేసుకోవాలి. త‌ర్వాత మొబైల్ నెంబ‌ర్ పోర్ట‌బులిటీ కోసం రిక్వెస్ట్ పెట్టాలి.
* ఎయిర్‌టెల్ ఈ రిక్వెస్ట్ తీసుకున్నాక మీ ఇంటికి ఒక ఎగ్జిక్యూటివ్‌ను పంపిస్తుంది. అత‌ను మీ డిటెయిల్స్ తీసుకుని కొత్త సిమ్ ఇస్తాడు.
* దాన్ని మీ ఫోన్‌లో వేసి యాక్టివేట్ చేస్తే 24 గంట‌ల్లోగా మీ నంబ‌ర్ ఎయిర్‌టెల్‌లోకి మారిపోతుంది.  

 

వొడాఫోన్ ఐడియాకు పోర్ట్ అవ‌డం ఎలా?
* మీరు ఇత‌ర నెట్‌వ‌ర్క్‌లు వాడుతున్నారా?  మీ నంబ‌ర్ మార‌కుండానే   వొడాఫోన్ ఐడియాకు మారాల‌నుకుంటున్నారా అయితే ప్లేస్టోర్ లేదా యాపిల్ స్టోర్‌లోకి వెళ్లి వొడాఫోన్ ఐడియా యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
* యాప్ ఓపెన్ చేసి ఎంఎన్‌పీ పేజీలోకి వెళ్లండి. అందులో మీ పేరు, కాంటాక్ట్ నంబ‌ర్‌, ఊరిపేరు ఎంట‌ర్ చేయండి.
*మీకు స‌రిప‌డే వొడాఫోన్ ఐడియా ప్లాన్‌ను సెలెక్ట్ చేసుకోండి.
* ఇప్పుడు స్విచ్ టూ వొడాఫోన్ బ‌ట‌న్ క్లిక్ చేయండి.
* మీ అడ్ర‌స్‌, ఫోన్ నంబ‌ర్ యాడ్ చేస్తే వొడాఫోన్ ఐడియా  కొత్త సిమ్ మీ ఇంటికే డెలివ‌రీ అవుతుంది. 

జన రంజకమైన వార్తలు