మీ జియో గురించి పూర్తి సమాచారం తెలుసుకోవడానికి యూఎస్ఎస్‌డీ కోడ్స్
అతి తక్కువ సమయంలో ఇండియన్ టెలికం రంగంలో పాతుకుపోయిన రిలయన్స్ జియో తన నెట్‌వర్క్‌ను పెంచుకోవడానికి కొత్త కొత్త ఆఫర్లు ప్రకటిస్తోంది. బోల్డన్ని ఆఫర్లు, రీ చార్జి ప్లాన్లు.. ఇప్పటివరకూ బిల్లింగ్ గురించి కూడా ఎక్స్‌పీరియన్స్ లేకపోవడంతో అసలు తాము ఏ ప్లాన్‌లో ఉన్నామో.. ఎంత టాక్‌టైం ఉంది? డేటా బ్యాలన్స్ ఎంత? ప‌్లాన్ వ్యాలిడిటీ ఇంకెన్ని రోజులుంది వంటి వివరాలు తెలుసుకోవాలంటే కాస్త కష్టమే. అయితే ఈ USSD Codes తెలిస్తే మీ జియో నంబర్‌కు సంబంధించిన ఎటువంటి సమాచారమైనా మీ చేతుల్లో ఉన్నట్లే.
యూఎస్ఎస్‌డీ కోడ్స్
1. మీ జియో నెంబర్ తెలుసుకోవడానికి *1# డయల్ చేయాలి
2.మెయిన్ బ్యాలన్స్ తెలుసుకోవడానికి *333#
3. లోకల్ కాల్ మినిట్స్ బ్యాలన్స్ తెలుసుకోవడానికి *367*2#
4. డేటా బ్యాలన్స్ తెలుసుకోవాలంటే *333*1*3*#
5. మిస్ కాల్ అలర్డ్ యాక్టివేట్ చేయడానికి *333*3*2*1#
6. మిస్ కాల్ అలర్డ్ డీయాక్టివేట్ చేయడానికి *333*3*2*2#
7. ఇంటర్నెట్ బ్యాలన్స్ చెక్ చేయడానికి *333*1*3#
8. VAS బ్యాలన్స్ చెక్ చేయడానికి *333*1*4*1#
9. ఎస్ఎంఎస్ బ్యాలన్స్ చెక్ చేయడానికి *367*2#
10. స్క్రాచ్ కార్డ్‌తో జియో రీఛార్జి చేయడానికి *368#
11. రిలయన్స్ జియో కాలర్ ట్యూన్ యాక్టివేట్ చేయడానికి *333*3*1*1# (చార్జీలు వర్తిస్తాయి)
12. రిలయన్స్ జియో కాలర్ ట్యూన్ యాక్టివేట్ చేయడానికి *333*3*1*2#
13. జియో స్పెషల్ డీల్స్ అండ్ ఆఫర్స్ తెలుసుకోవడానికి *789#
14. జియో కస్టమర్ కేర్ *333 లేదా *369