స్మార్ట్‌ఫోన్లో మనం కుప్పలు తెప్పలుగా ఫొటోలను పోగు చేస్తూ ఉంటాం. అయితే చాలామంది తమ ఫొటోలను గూగుల్ ఫొటోల్లో దాస్తూ ఉంటారు. ఇది ఆటోమెటిక్‌గా జరిగిపోతూ ఉంటుంది. అయితే మనం ఫోన్లో మనకు అవసరం లేని ఫొటోలను డిలీట్ చేసుకుంటూ ఉంటాం. దీని వల్ల మెమరీ వృథా కాకుండా చూసుకుంటాం. కానీ గూగుల్ ఫొటోస్‌లా అలా కుదరదు మనం తీసిన ఫొటోలన్నీ నేరుగా గూగుల్ ఫొటోస్‌లో సేవ్ అయిపోతూ ఉంటాయి. దీని వల్ల మెమరీ కూడా అయిపోతూ ఉంటుంది. మరి ఫోన్లో ఉన్న ఫొటోలను డిలీట్ చేయకుండా కేవలం గూగుల్ ఫొటోలను మాత్రమే డిలీట్ చేయడం ద్వారా ఈ ఇబ్బంది నుంచి బయటపడొచ్చు. మరి అదెలాగో తెలుసా?
డిఫాల్ట్‌గా మన ఫోన్ బ్యాక్ అప్ మరియు సింక్ ఆప్షన్‌లను గూగుల్ ఫొటోస్ డిజేబుల్‌గా ఉంటాయి. మనం ఫోన్‌ను ఉపయోగించడం మొదలుపెట్టిన తర్వాత దాన్ని అనేబుల్ చేస్తే చాలు మనకు సంబంధించిన అంతా మెమరీ నేరుగా గూగుల్ ఫొటోస్‌లో సేవ్ అయిపోతూ ఉంటుంది. క్లౌడ్ స్టోరేజ్‌తో లింక్ అయి ఉండడం వల్ల ఫొటోలు, వీడియోలు కూడా ఇందులో సేవ్ అయిపోతూ ఉంటుంది. సింక్ ఆప్షన్ వల్లే ఈ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. సింక్ ఆప్షన్ ద్వారా గూగుల్ ఫొటో యాప్‌ను ఉపయోగించుకున్నప్పుడు ఇది రెండు కాపీలను క్రియేట్ చేస్తుంది. ఒకటి ఆన్‌లైన్ రెండు డివైజ్. దీనిలో మీకు ఒకటి మాత్రమే కనిపిస్తుంది. మీ ఫోన్లో స్పేస్‌ను ఆదా చేయాలనుకుంటే డివైజ్ కాపీని మీరు డిలీట్ చేసుకోవచ్చు. ఇలా చేయాలంటే నాన్ సింక్డ్ ఫోల్డర్‌ను ఫైల్ మేనేజర్ ద్వారా వాడి మీరు గూగుల్ ఫొటోలను డిలీట్ చేసుకోవచ్చు.
1. ఫైల్ మేనేజర్ యాప్ ఓపెన్ చేసి ఇంటర్నల్ స్టోరేజ్‌లో ఒక కొత్త ఫోల్డర్‌ను క్రియేట్ చేయాలి. ఈ ఫోల్డర్‌కు ఏదో ఒక పేరు పెట్టుకోవాలి
2. ఆ తర్వాత ఫైల్ మేనేజర్‌ను ఉపయోగించి ఇంటర్నల్ స్టోరేజ్ మెమెరీని క్లిక్ చేయాలి . ఆ తర్వాత డీసీఐమ్.. కెమెరా ఆప్షన్లు క్లిక్ చేయాలి. ఫోన్ కెమెరా నుంచి ఉపయోగించి తీసే ఫొటోలు ఈ ఫోల్డర్‌లో స్టోర్ అవుతాయి.
3. ఆ ఫోల్డర్ ఓపెన్ చేసి మీరు గూగల్ ఫొటోల నుంచి డిలీట్ చేయాలనుకున్న ఫొటోలను సెలక్ట్ చేసుకోవాలి. ఆపై మూవ్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి
4. మీరు టెస్టు చేయాలనుకున్న టెస్టు ఫోల్డర్‌ను ఓపెన్ చేసి అందులో ఈ ఫొటోలను పేస్ట్ చేయాలి. ఇలా చేస్తే మీరు గూగుల్ ఫొటోస్ డీలీట్ చేయాలనుకున్న ఫొటోలు ముందుగానే డిలీట్ అయిపోతాయి.