మనం ఎంతో ఇష్టంగా మ్యూజిక్ వినాలని అనుకుంటాం. మనకు బాగా అందుబాటులో ఉండేదేంటి మొబైల్ ఫోన్. ఆండ్రాయిడ్ ఫోన్లో మనకు నచ్చిన పాటలు పెట్టుకుని వింటూ ఆస్వాదిస్తాం. అయితే మ్యూజిక్ వింటున్నప్పుడు ఆండ్రాయిడ్ నోటిఫికేషన్లూ వస్తూనే ఉంటాయి. ఇవి సంగీతం విననీయకుండా ఇబ్బందిపెడుతూ ఉంటాయి. ఒక రకంగా చికాకు కలిగిస్తాయి. మరి మనం మ్యూజిక్ వింటూనే ఆండ్రాయిడ్ నోటిఫికేష్లను డిసేబుల్ చేయడం ఎలా? .. దీనికో మార్గం ఉంది. ఒక టూల్ అందుబాటులో ఉంది. మాక్రోడ్రాయిడ్ అనే ఆటోమాషిన్ యాప్ ద్వారా మనం ఆండ్రాయిడ్ నోటిఫికేషన్లను డిజేబుల్ చేసే అవకాశం ఉంది. అదెలాగో చూద్దాం...
నోటిఫికేష్లను డిసేబుల్ చేయడం ఎలా అంటే..
మాక్రోడ్రాయిడ్ యాప్‌ను ప్లేస్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి. దీన్ని రెండు రకాలుగా ఉపయోగించుకోవచ్చు. ఒకటి డీఎన్‌డీ పద్ధతి... రెండోది..మ్యూజిక్ పూర్తయిన తర్వాత డిజేబుల్ అయ్యేది.
1. ముందుగా మాక్రోడ్రాయిడ్ యాప్ ఓపెన్ చేసి యాడ్ మాక్రో ఐకాన్ మీద క్లిక్ చేయాలి. డివైజ్ ఈవెంట్స్ మీద క్లిక్ చేసి మ్యూజిక్, సౌండ్స్ ప్లేయింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. తర్వాత స్టార్టెడ్ ఆప్షన్ క్లిక్ చేయాలి
2. ఆ తర్వాత యాక్షన్స్ ట్యాబ్ మీద ట్యాప్ చేయాలి. ఆపై స్క్రోల్ డౌన్ చేసి వాల్యూమ్.. ప్రయారిటీ మోడ్, డునాట్ డిస్టర్బ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి తర్వాత ఆలో ప్రయారిటీ నోటిఫికేషన్స్ మీద క్లిక్ చేయాలి.
3. తొలిసారి మాక్రోడ్రాయిడ్ యాప్‌ను యూజ్ చేస్తున్నట్లైతే సిస్టమ్ లెవల్ పర్మిషన్స్ ఇవ్వాలి. పర్మిషన్ ఇచ్చిన తర్వాత బ్యాక్ బటన్ క్లిక్ చేయాలి
4. కాంస్ట్రాంట్స్ యాడ్ చేయడం తప్పనసరేం కాదు. మీకు కావాలనుకుంటే ఎంచుకోవచ్చు. కాంస్ట్రాంట్స్ అంటే డివైజ్ స్టేటస్ లేదా టైమ్ డేట్ లాంటివి