టీమ్ వీవర్.. ఒక సిస్టమ్‌ను ఉపయోగించి ఒకేసారి ఎక్కువమంది పని చేయడానికి వాడే టూల్. అయితే టీమ్ వీవర్‌తో ఎన్ని ఉసయోగాలు ఉన్నాయో అన్ని ప్రమాదాలు కూడా ఉన్నాయి. అవేంటంటే మనకు తెలియకుండా కొన్ని ఆపరేషన్లు జరగడం. అంటే మన నాలెడ్జ్ లేకుండానే ఫైల్స్ ట్రాన్స్‌ఫర్ అయిపోతుంటాయి ఒక్కోసారి. మరి పొరపాటునో లేదా మీకు తెలియకుండా ఫైల్స్ ట్రాన్స్‌ఫర్ జరిగిపోతుంటాయి. మరి ఇలా ట్రాన్స్‌ఫర్ అయిన ఫైల్స్‌ను ఆపడం ఎలాగో చూద్దాం..
రాన్సమ్‌వేర్ అటాక్
కంప్యూటర్ అనగానే వైరస్‌లు కామన్.. కానీ కొన్ని ప్రమాదకర వైరస్‌లు ఉంటాయి. వీటితోనే ఇబ్బంది. రాన్సమ్ వేర్ కూడా ఆ కోవకు చెందిందే. ముఖ్యంగా టీమ్ వీవర్ లాంటి టూల్స్ యూజ్ చేసేటప్పుడు కచ్చితంగా రాన్సమ్‌వేర్ లాంటి వైరస్‌లకు అటాక్ చేయడానికి అవకాశం దొరుకుతుంది. అయితే మీకు కన్ఫ్‌మ్ చేస్తేనే మీ ఫైల్ ట్రాన్సఫర్ అవుతుంది. కానీ మీకు తెలియకుండానే ఆ కన్ఫర్మేషన్ వెళ్లడమే ఇక్కడ ఆందోళన కలిగించే అంశం. అయితే ఒకవేళ ఫైల్స్ మీకు తెలియకుండానే ట్రాన్సఫర్ అయినా కూడా మీరెం కంగారు పడక్కర్లేదు. రాన్సమ్‌వేర్ అటాక్ కు గురైన ఫైల్స్‌ను మనం కొన్ని ట్రిక్స్ యూజ్ చేసి వెనక్కి రప్పించుకోవచ్చు.
ఏం చేయాలంటే..
టీమ్ వీవర్ ఓపెన్ చేసి ఎక్స్‌ట్రాస్ మీద క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఆ తర్వాత టీమ్ వీవర్ ఆప్షన్లు ఓపెన్ అవుతాయి. ఆ తర్వాత జనరల్ సెట్టింగ్స్ సెక్యూరిటీ మీద ట్యాప్ చేయాలి. ఆ పై అడ్వాన్స్‌డ్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. డ్రాప్ డౌన్ అయిన మెనూలో ఫుల్ యాక్సెస్ క్లిక్ చేయాలి. ఆ తర్వాత సెట్టింగ్స్‌లో కన్ఫిగర్ ఆప్షన్ ఎంచుకోవాలి. అందులో మీకు యాక్సెస్ కంట్రోల్ డిటైల్స్ వస్తాయి. ఆ తర్వాత కన్ఫర్మేషన్ లేదా డినైన్‌ను ఎంచుకోవాలి. మీకు ఏదైతే ఆప్షన్ కావాలో దాన్ని క్లిక్ చేయాలి. ఆ తర్వాత ట్రాన్సఫర్ అయిన ఫైల్‌ను ఎంచుకుని బ్లాక్ చేయాలి. ఆ తర్వాత మీకు సంబంధించిన ఫైల్స్‌కు సెక్యూరిటీ పెట్టుకోవాలి.