• తాజా వార్తలు

ఆండ్రాయిడ్ ఓఎస్ పాత వెర్ష‌న్‌కి డౌన్‌గ్రేడ్ కావ‌డం ఎలా?

  • - ఎలా? /
  • 5 సంవత్సరాల క్రితం /

ఆండ్రాయిడ్ ఓఎస్‌లో ఎప్ప‌టిక‌ప్పుడు మార్పు చేర్పులు జ‌రుగుతూనే ఉంటాయి.  బ‌గ్‌ల‌ను ఫిక్స్ చేసుకుంటూ కొత్త వెర్ష‌న్లు వ‌స్తూనే ఉంటాయి. కొన్ని ఓఎస్‌లు మాత్రం చాలాకాలం నిలిచి ఉంటాయి. ఎక్కువ‌మంది ఈ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌ల‌నే వాడుతూ ఉంటారు. కానీ కొత్త వెర్ష‌న్ రాగానే మారిపోతూ ఉంటారు. అయితే కొత్త వెర్ష‌న్ క‌న్నా పాత వెర్ష‌నే న‌యం అనిపించిన‌ప్పుడు పాత వెర్ష‌న్ మ‌ళ్లీ యూజ్ చేయ‌డం ఎలా? మ‌ళ్లీ ఆ పాత వెర్ష‌న్‌ను డౌన్‌లోడ్ చేసుకోవ‌డం ఎలా?

ఒడియ‌న్ యూజ్ చేసి..
పాత ఓఎస్‌ను డౌన్‌లోడ్ చేసి వాడుకోవ‌డానికి కొన్ని టూల్స్ ఉన్నాయి. వాటిలో బాగా పాపుల‌ర్‌గా ఉంది ఒడియ‌న్ ఫ్లాష్ టూల్‌. ఇది శాంసంగ్ ఆండ్రాయిడ్ ఫోన్ల యూజ‌ర్ల‌కు బాగా యూజ్ అవుతుంది. శాంసంగ్‌లో బై డీఫాల్ట్‌గా ఈ టూల్‌ని ఇస్తున్నారు. దీంతో మ‌నం నేరుగా పాత సాఫ్ట్‌వేర్‌ల‌ను డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. ఈ టూల్‌ని ఓపెన్ చేసి అందులో పీడీఏ బ‌ట‌న్ క్లిక్ చేయాలి. రిపార్టిష‌న్ ఆప్ష‌న్‌ని డీసెల‌క్ట్ చేసుకోవాలి. ఆటో రీబూట్‌, ఎఫ్ రీసెట్ టైమ్ అనే ఆప్ష‌న్ల మీద చెక్ మార్క్ చేసుకోవాలి. మీ డివైజ్‌ని ప‌వ‌ర్ ఆఫ్ చేయాలి. వేల్యూమ్ డౌన్‌, హోమ్‌, ప‌వ‌ర్ బ‌ట‌న్స్ ఒక‌సారి ప్రెస్ చేస్తే మీ ఫోన్ రీబూట్ అయి డౌన్‌లోడ్ మోడ్‌లోకి వెళుతుంది. యూఎస్‌బీ కేబుల్ ద్వారా ఈ ఫోన్‌ని కంప్యూట‌ర్ కి క‌నెక్ట్ చేసి ఒడియ‌న్ మీద స్టార్ట్ కొట్టాలి. అప్పుడు మీ ఫైల్ ఫ్లాష్ అవ‌గానే డివైజ్ రీబూట్ అవుతుంది.

ఫాస్ట్ రీబూట్‌
గూగుల్ పిక్స‌ల్ ఫోన్ల‌కు వేరే మార్గం ఉంది. ఫ్యాక్ట‌రీ ఇమేజ్ అనే వెర్ష‌న్‌ని మీ డివైజ్‌లోకి డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్‌లోడ్ కాగానే ఈ ఫైల్‌ని ఎక్స్‌ట్రాక్ట్ చేసుకోవాలి. ఆ త‌ర్వాత ఫాస్ట్ బూట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. అదే ఫోల్డ‌ర్‌లోకి దీనికి సంబంధించిన ఫైల్స్‌ని ఎక్స్‌ట్రాక్ట్ చేసుకోవాలి. మీ ఫోన్లోకి వెళ్లి సెట్టింగ్స్‌లోకి సిస్ట‌మ్‌, డెవ‌ల‌ప‌ర్ ఆప్ష‌న్స్‌, ఒఈఎం అన్‌లాకింగ్, యూఎస్‌బీ డిబ‌గింగ్ మీద క్లిక్ చేయాలి. ఆ త‌ర్వాత మీ ఫోన్‌ని కంప్యూట‌ర్‌కి క‌నెక్ట్ చేసి షిప్ట్ ప‌ట్టుకుని రైట్ క్లిక్ చేసి  ఓపెన్ క‌మాండ్ విండో ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. ఏబీడీ రీబూట్ బూట్‌లోడ‌ర్ అనే క‌మాండ్ టైప్ చేసి ఎంట‌ర్ కొట్టాలి. మీ డివైజ్ బూట్ లోడ‌ర్ మోడ్‌లోకి వెళ్లిపోతుంది.

జన రంజకమైన వార్తలు