కంప్యూటర్ అందుబాటులో ఉందంటే ఆన్‌లైన్‌లో ఏదో ఒకటి చూడడటానికే ప్రయత్నిస్తాం. ముఖ్యంగా హాట్‌స్టార్ వచ్చాక సినిమాలు, క్రికెట్ మ్యాచ్‌లు, సీరియల్స్, టీవీ షోలు నెట్లో చూడడం అనేది చాలా సాధారణ విషయం అయిపోయింది. అయితే మనం ఏం చూసినా అది ఆన్‌లైన్ ఉన్నంత వరకే. నెట్ లేకపోతే ఇవేమీ మనకు అందుబాటులో ఉండవు. మరి ఇంటర్నెట్ లేకపోయినా వీటని ఎలా చూడాలి? మనకు ఇష్టమైన సినిమాలను, టీవీ షోలను ఆఫ్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకుని చూడడం ఎలా?
1. ఆఫ్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలంటే ముందుగా ఆన్‌లైన్‌తో పని ఉంటుంది. మీకు ఆన్‌లైన్ ఉందా లేదా చూసుకోండి. లేకపోతే వైఫై, మొబైల్ డేటాను చెక్ చేసుకోవాలి. ఏమైనా ఇబ్బంది ఉంటే వెంటనే సరిచేసుకోవాలి.
2. నెట్ ఓపెన్ చేసి హాట్‌స్టార్ యాప్‌ను క్లిక్ చేయాలి. మూవీస్, టీవీ షోస్ ఆప్షన్ క్లిక్ చేసి మీకు నచ్చిన వాటిని సేవ్ చేసుకోవాలి. మీకు నచ్చిన మూవీ మీద ట్యాప్ చేస్తే డిటైల్స్ పేజీ ఓపెన్ అవుతుంది. మీ డివైజ్ పోట్రాయిట్ ఒరియెంటేషన్‌లో ఉంటే మీకు డిటైల్స్ మాత్రమే కనబడతాయి. అందుకే మీరు డివైజ్‌ను టర్న్ చేసి చూడాలి.
3. కేటగిరిల్లో ఏ మూవీస్ డౌన్‌లోడింగ్‌కు అందుబాటులో ఉన్నాయో గుర్తించాలి. మీకు డిటైల్స్ పేజీలో ఒక చిన్న యారో డౌన్‌వార్డ్స్‌కు చూపిస్తూ ఉంటుంది. దాని అర్థం ఆ మూవీ డౌన్‌లోడ్ అవుతుందని. ఒకవేళ మూవీ అందుబాటులో లేకపోతే ఆ యారో క్రాస్ చేసి ఉంటుంది.
4. మూవీ డౌన్‌లోడ్ అయ్యే అవకాశం ఉంటే మీకు డిటైల్స్ పేజీలో తెలిసిపోతుంది. ఒకవేళ లేకపోతే మీరు ఏం అఫిషియల్‌గా డౌన్‌లోడ్ చేయలేరు.
5. డౌన్‌లోడ్ ఆప్షన్ క్లిక్ చేయగానే అందులో క్వాలిటీ, ఫైల్ సైజ్ ఆప్షన్లు ఉంటాయి. ఈ క్వాలిటీనే మన మూవీ క్లారిటీని నిర్దేశిస్తుంది. ఉదాహరణకు తక్కువ క్వాలిటీ ఉన్న బాహుబలి సినిమా (180 పీ)కి 272 ఎంబీ డేటా అవసరం అవుతుంది. అదే ఎక్కువ క్వాలిటీ ఉంటే (720పీ) 2307 ఎంబీ అవసరం అవుతుంది. మీకు ఎంత క్వాలిటీ కావాలో మీరే డిసైడ్ చేసుకోవాలి
6. సినిమాను చూడటానికి హోమ్ స్క్రీన్‌కు వెళ్లి మెనూ బటన్ క్లిక్ చేయాలి. దానిలో మై డౌన్‌లోడ్స్ అనే ఆప్షన్ ఉంటుంది.
7. మై డౌన్‌లోడ్స్‌లో మనం డౌన్‌లోడ్ చేసి సినిమాల తాలూకా వివరాలు ఉంటాయి. ఫైల్ డౌన్‌లోడ్ అయిన తర్వాత దాని మీద టాప్ చేయాలి. వెంటనే సినిమా మొదలు అవుతుంది. కావాలంటే మీరు టాప్ చేసి ఈ మూవీని డిలీట్ చేసుకోవచ్చు. మీరు డౌన్‌లోడ్ చేసిన ఫైల్స్‌ను హాట్‌స్టార్ యాప్ ఉపయోగించి మాత్రమే చూసే అవకాశం ఉంటుంది.