• తాజా వార్తలు

జియోమి రెడ్‌మి నోట్ 7లో ఫ్యాక్ట‌రీ రిసెట్ చేయ‌డం ఎలా?

  • - ఎలా? /
  • 5 సంవత్సరాల క్రితం /

మ‌నం స్మార్ట్‌ఫోన్ వాడుతున్న‌ప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాం. స‌డెన్‌గా బ్లాక్ అయిపోవ‌డం లేక‌పోతే స్ట్ర‌క్ అయిపోవ‌డం, ఫొటోలు తీసుకునేట‌ప్పుడు స‌డెన్‌గా ఆగిపోవ‌డం లేదా.. వేడి ఎక్క‌డం లాంటి ప్రాబ్ల‌మ్స్ స్మార్ట్‌ఫోన్ల‌లో చాలా కామ‌న్ విష‌యాలు. అయితే మ‌నం స్మార్ట్‌ఫోన్ కొన్న ఏడాది వ‌ర‌కు ఫెర్మార్‌మెన్స్ బాగానే ఉంటుంది. కానీ ఏడాది దాటిన త‌ర్వాత ఇబ్బందులు మొద‌ల‌వుతాయి. ఇలాంటి ప్రాబ్ల‌మ్స్‌ను ఫిక్స్ చేయ‌డానికి కొన్ని ఆప్ష‌న్లు ఉన్నాయి. వాటిలో కీల‌క‌మైంది ఫ్యాక్ట‌రీ రీసెట్‌. ఈ ఆప్ష‌న్ యూజ్ చేయ‌డం వ‌ల్ల ఫోన్‌లో ఉండే డేటా మొత్తం తుడిచిపెట్టుకుపోయి మ‌ళ్లీ ఫ్రెష్‌గా త‌యార‌వుతుంది.  దీని వ‌ల్ల ఫోన్ వేగం పెరుగుతుంది. మెమ‌రీ మిగులుతుంది.  ఈ ఫ్యాక్ట‌రీ రీసెట్ ఆప్ష‌న్ ఒక్కో ఫోన్లో ఒక్కోలా ఉంటుంది. మ‌రి రెడ్‌మి నోట్ 7 ఫోన్లో ఫ్యాక్ట‌రీ రీసెట్ చేయ‌డం ఎలాగో తెలుసుకుందామా?


ఫ్యాక్ట‌రీ రీసెట్ ఎలా అంటే..
1. సెట్టింగ్స్‌లోకి వెళ్లి అడిష‌న‌ల్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయాలి

2. బ్యాక్ అప్ అండ్ రీసెట్ అనే ఆప్ష‌న్ మీద ట్యాప్ చేయాలి

3. ఆ త‌ర్వాత ఫ్యాక్ట‌రీ డేటా రీసెట్ అనే ఆప్ష‌న్ ఎంచుకోవాలి

4. ఆపై రీసెట్ ఫోన్ బ‌ట‌న్ మీద క్లిక్ చేసి 10 సెక‌న్లు వెయిట్ చేయాలి

5. ఆ త‌ర్వాత నెక్ట్ మీద క్లిక్ చేసి కొద్ది సేపు ఆగి ఓకే బ‌ట‌న్ నొక్కాలి

6. అంతే.. మీ ఫోన్ ఆటోమెటిక్‌గా రీబూట్ అయిపోతుంది. ఈ ప్రోసెస్ చాలా వేగంగా జ‌రుగుతుంది. 

రిక‌వ‌రీ మోడ్ ద్వారా..
1. ముందుగా మీ ఫోన్‌ను ప‌వ‌ర్ ఆఫ్ చేయాలి

2. ఆ త‌ర్వాత వాల్యూమ్ అప్ మ‌రియు ప‌వ‌ర్ కీల‌ని క‌లిపి ప్రెస్ చేయాలి. స్క్రీన్‌పై ఎంఐ లోగో క‌నిపించేదాకా ప్రెస్ చేయాలి

3. ఆ త‌ర్వాత రెండు బ‌ట‌న్‌ల‌ను వ‌దిలేయాలి

4. రిక‌వ‌రీ మోడ్ ద్వారా వైప్ డేటా అనే ఆప్ష‌న్ క్లిక్ చేయాలి
ఇందు కోసం వాల్యూమ్ కీస్‌, పవ‌ర్ బ‌ట‌న్ క‌లిపి ప్రెస్ చేయాలి

5. అంతే.. మీ ఫోన్ డేటా తుడిచిపెట్టుకుపోతుంది. 

6. ఆ త‌ర్వాత మెయిన్ మెనూ ద‌గ్గ‌ర‌కు వెళ్లి రీబూట్ సెల‌క్ట్ చేసుకుని.. రీబూట్ టు సిస్ట‌మ్ క్లిక్ చేయాలి. అంతే డివైజ్ ఎంఐయూఐ వ‌ర‌కూ వెళ్లే దాకా బూటింగ్ చేయాలి. 

జన రంజకమైన వార్తలు