షియోమి ఫోన్ తరచూ సతాయిస్తోందా? అయితే ఓసారి ఫ్యాక్టరీ రీసెట్ చేసి చూడండి. సమస్య చాలా వరకు పరిష్కారమయ్యే అవకాశాలున్నాయి. అయితే ఫ్యాక్టరీ రీసెట్ చేస్తే ఫోన్‌లో ఉన్న మీ డేటా (కాంటాక్స్ట్, యాప్స్, ఫోటోస్, వీడియోస్) అంతా పోతుంది. అంతకంటే పెద్ద సమస్య ఒకటి ఉంది. అది మీ ఎంఐ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోవడం.
పాస్‌వర్డ్ మర్చిపోయినా
ఎంఐ ఫోన్ యూజర్లందరికీ ఎంఐ అకౌంట్ ఉంటుంది. దానితో లాగిన్ అయితేనే ఫ్యాక్టరీ రీసెట్ చేయడమైనా, ఇంకేదైనా సమస్య వచ్చినా పరిష్కరించగలం. ఒకవేళ మీరు ఎంఐ పాస్‌వర్డ్ మర్చిపోయి, మీకు ఇంటర్నెట్ కనెక్షన్ అందుబాటులో లేకపోతే ఆ పాస్‌వర్డ్ కూడా రికవర్ చేయలేరు. అలాంటప్పుడు ఫోన్ ఫ్యాక్టరీ రీసెట్టింగ్ కూడా చేయలేరు. అంటే మీ ఫోన్ దాదాపు డెడ్ అవుతుంది. అయితే దీనికో చిట్కా ఉంది. ఎంఐ పాస్‌వర్డ్ మర్చిపోయినా కూడా షియోమి ఫోన్లను ఫ్యాక్టరీ రీసెట్ చేసే ఆ చిట్కా మీకోసం..
ఇదీ ప్రొసీజర్
1. ఎంఐ ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేయండి.
2. వాల్యూమ్ అప్, పవర్ బటన్‌ను ఒకేసారి నొక్కిపట్టుకోండి.
3. ఇప్పుడు ఫోన్ స్క్రీన్‌మీద ఓ మెనూ ఓపెన్ అవుతుంది. reboot, Wipe and reset the phone తదితర ఆప్షన్లు ఉంటాయి. వాల్యూమ్ కీలతో మీరు పైకి కిందకీ మూవ్ అయి ఆప్షన్లు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఫోన్ ఆఫ్‌లో ఉంటుంది కాబట్టి టచ్ స్క్రీన్ పనిచేయదు. అందువల్ల మీరు వాల్యూమ్ బటన్స్‌తోనే మూవ్ చేసుకోవాలి. wipe and reset సెలెక్ట్ చేసుకున్నాక పవర్ బటన్ నొక్కి మెనూను సెలెక్ట్ చేయండి.
4. Wipe all dataను సెలెక్ట్ చేసి Yes ఆప్షన్ క్లిక్ చేసి కన్ఫర్మ్ చేసుకోండి.
5. దీంతో ఫోన్‌లో ఉన్న డేటా అంతా పోయి ఫోన్ రీసెట్ అవుతుంది.
6. ఇప్పుడు మీ ఫోన్‌ను రీబూట్ చేస్తే ఫ్యాక్టరీ రీసెట్టింగ్ పూర్తయినట్లే.