సోషల్ మీడియా అనగానే వెంటనే గుర్తొచ్చే పేరు ఫేస్‌బుక్, ట్విటర్. అయితే ఫేస్‌బుక్ వాడినంత స్వేచ్ఛగా ట్విటర్‌ను మన దేశంలో వాడరు. చాలామందికి వాడాలని ఉన్నా దీనిలో వారికి నచ్చే ఫీచర్లు తక్కువగా ఉండడంతో పట్టించుకోరు. ఐతే ట్విటర్‌ను సమర్థవంతగా ఉపయోగించుకుంటే ఒక సూపర్ పవర్ మీ చేతిలో ఉన్నట్లే. ఐతే చాలామందికి ట్విటర్‌లో ఫాలోవర్లను ఎలా సంపాదించుకోవాలో తెలియదు. ఫేస్‌బుక్‌లో అయితే మీకు తెలిసిన వారు ఆటోమెటిక్‌గా కనబడతారు కాబట్టి వెంటనే రిక్వెస్ట్ పెడతారు. ఐతే ట్విటర్లో అలా కుదురదు. మీ స్నేహితులను సంపాదించుకోవాలంటే వెతుక్కోక తప్పదు. ఆ వెతకడం కూడా ఒక పద్ధతి ప్రకారం ఉండాలి. అప్పుడే మీకు అవసరాలకు తగ్గట్టు, మీ అభిరుచులకు తగ్గట్టు స్నేహితులు మీకు దొరుకుతారు. ట్విటర్లో స్నేహితులను ఎలా సంపాదించుకోవాలో. మీ ఫ్రెండ్స్ యూజర్ బేస్‌ను ఎలా పెంచుకోవాలో ఒకసారి చూస్తే...
ఇంపోర్ట్ చేసుకోండి
ముందుగా మీరు మీ ట్విటర్ అకౌంట్లోకి లాగిన్ కావాలి. ఆ తర్వాత మీ అకౌంట్ పేజ్‌లోకి వెళ్లాలి. అక్కడే లెఫ్ట్ నేవిగేషన్లో ఉన్న పైండ్ ఫ్రెండ్స్ అనే ఆప్షని క్లిక్ చేయాలి. ఇనిషియల్‌గా మీ స్నేహితులను మీరు మొదట సంపాదించుకోవాలి. అదేలాగంటే మీ మొయిల్ కాంటాక్ట్‌లో ఉన్న ఫాలోవర్లను ఇంపోర్ట్ చేసుకోవాలి. పైండ్ ఫ్రెండ్స్ ఆప్షన్ క్లిక్ చేయగానే మీరు ఏ మెయిల్‌లో కాంటాక్ట్‌లను ఇంపోర్ట్ చేయాలనుకుంటున్నారని అడుగుతుంది. మనకు నచ్చిన మెయిల్ నుంచి కాంటాక్ట్‌లను ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఉదాహరణకు మీకు యాహూ మెయిల్‌లో కీలకమైన కాంటాక్ట్‌లు ఉంటే యాహూ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆ మొయిల్ నుంచి కాంటాక్ట్‌లు ట్విటర్‌కు ఇంపోర్ట్ చేసేసుకోవచ్చు. దీని వల్ల ముక్కు మొహం తెలియన వారితో కాకుండా మీ స్నేహితులు, బాగా తెలిసిన వారితోనే కాంటాక్ట్‌లో ఉండే అవకాశం ఉంది.
ఇతర మార్గాల ద్వారా కూడా
ఇంపోర్ట్ ద్వారా కొంతమంది ఫాలోవర్లను సంపాదించుకుంటే ఇనిషియల్‌గా మీరు కొంత యాక్టివిటీ చేయడానికి ఉపయోగపడుతుంది. ఐతే మీకు అవసరమైన కాంటాక్ట్‌లను పొందాలంటే మాత్రం సెర్చ్ చేయక తప్పదు. అంటే కొంతమంది మీ కాంటాక్ట్‌లో ఉండకపోవచ్చు. అలాంటి వారి కోసం మీరు సెర్చ్ బటన్లో వారి పూర్తి వివరాలతో సెర్చ్ చేస్తే మీకు దొరికే అవకాశం ఉంది. కొంతమంది ఇంటిపేర్లతో, ఊర్ల పేరుతో సెర్చ్ చేసినా దొరికే అవకాశాలు ఉన్నాయి. అయితే ట్విటర్లో ఫేక్ అకౌంట్లు కొల్లలుగా ఉన్నందున సెలబ్రెటీ అకౌంట్ల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అఫీషియల్ అని ట్విటర్ గుర్తించి అకౌంట్లను మాత్రమే ఫాలో కావాలి. లేకపోతే మీరు తప్పుదోవ పట్టే అవకాశాలున్నాయి.