ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్న వాళ్లకు రింగ్‌టోన్ గురించి తెలిసే ఉంటుంది. ఒకప్పుడు రింగ్ టోన్స్ మార్చడం పెద్ద ఫ్యాషన్‌గా ఉండేది. కానీ ఇప్పుడు ఇది కాస్త తగ్గినా.. ఇంకా రింగ్ టోన్స్ మారుస్తూ వాడే వాళ్లు చాలామంది ఉన్నారు. అయితే మనం ఒక్కోసారి రింగ్ టోన్ మార్చినా అది మారదు. మనం మార్చిన రింగ్ టోన్ కాకుండా డిఫాల్ట్‌గా ఉండే రింగ్ టోన్ వినిపిస్తుంది. ఇలా జరగడానికి కారణం ఏమిటి? ఈ సమస్యని ఫిక్స్ చేయాలంటే ఏమి చేయాలి?
రీస్టార్ట్ ఫోన్
ఏమైనా సాఫ్ట్‌వేర్ సమస్యలు ఉంటే మీ రింగ్ టోన్ ప్లే కాదు. ఆగిపోతుంది.ఇందుకోసం ఫ్యాక్టరీ రీసెట్టింగ్స్ లోకి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇందుకోసం మీ సెట్ట్సింగ్స్‌లో కొన్ని సరి చేసుకుంటే చాలు మళ్లీ రింగింగ్ అవుతుంది. మరి ఈ సెట్టింగ్స్ ఏమిటి? మనం ఎలా రీసెట్ చేయాలి. ఒక్కోసారి చిన్న ట్రిక్‌తో కూడా మీ సమస్యలు సాల్వ్ అయిపోతాయి. జస్ట్ రీస్టార్ట్ చేసి చూస్తే చాలు మీ ఫోన్లో మళ్లీ రింగ్ టోన్ మోగే అవకాశాలు ఉన్నాయి.
సైలెంట్ మోడ్ తీసేయండి
మీ ఫోన్లో సైలెంట్ మోడ్ ఎనేబుల్డ్‌గా ఉందేమో ఒకసారి చెక్ చేసుకోవాలి. మీ స్టేటస్ బార్‌లో సైలెంట్ మోడ్ సింబల్ కనిపిస్తే దాన్ని టర్న్ ఆఫ్ చేయాలి. లేకపోతే చాలా ఫోన్లు సౌండ్ మోడ్స్ వాల్యూమ్ బటన్స్ ద్వారానే ఆపరేట్ అవుతాయి. ఇందుకోసం సెట్టింగ్స్‌లోకి వెళ్లి సౌండ్ మీద క్లిక్ చేసి రింగ్‌టోన్ వాల్యూమ్ మీద క్లిక్ చేస్తే చాలు. మీ రింగ్ టోన్ మళ్లీ యాక్టివ్ అవుతుంది.
టర్న్ ఆఫ్ డునాట్ డిస్టర్బ్
మీ రింగ్‌టోన్ వినపడకపోవడానికి మరో కారణం డునాట్ డిస్టర్బ్ ఆప్షన్. మీ ఫోన్ డునాట్ డిస్టర్బ్ మోడ్‌లో ఉంటే కనుక వెంటనే సెట్టింగ్స్‌లోకి వెళ్లి దాన్ని డిజేబుల్ చేయాలి. ఇందుకు టర్న్ ఆఫ్ బటన్ ప్రెస్ చేయాలి. ఇది సైలెంట్ మోడ్ కన్నా భిన్నంగా ఉంటాయి. డునాట్ డిస్టర్బ్ ఆప్షన్ షెడ్యుల్డ్ ఆప్షన్‌గా ఉంటే దాన్ని తీసేయాలి