ఆండ్రాయిడ్ ఫోన్లలో మనకు తరుచూ వచ్చే నోటిఫికేషన్ల వల్ల మనకు పని సులభం అవుతుంది. ఏ మెసేజ్ వచ్చిందో మనం జస్ట్ ఒక గ్లాన్స్‌తో చూసేయచ్చు. అవసరమైన వాటినే మాత్రమే ఓపెన్ చేసుకోవచ్చు. అయితే కొన్ని నోటిఫికేషన్ల వల్ల ఉపయోగం ఉంటే కొన్నింటి వల్ల మాత్రం చాలా ఇబ్బంది ఉంటుంది. అవే మిస్డ్ కాల్ నోటిఫికేషన్లు.. ఎప్పుడో వచ్చిన మిస్డ్ కాల్స్‌ని కూడా ఇవి చూపిస్తూ ఉంటాయి. దీని వల్ల మనం గందరగోళంలో పడతాం. మరి ఇలాంటి నోటిఫికేషన్లను ఫిక్స్ చేయాలంటే ఎలా?
రీస్టార్ట్ చేసేయండి..
మనం చాలాసార్లు ఏదైనా ఇబ్బంది ఎదురైనా ఫోన్‌ను వెంటనే రీస్టార్ట్ చేస్తాం. వెంటనే కొన్ని సమస్యలు పోతాయి. ఎందుకంటే ఫోన్ మళ్లీ తన వ్యవస్థలను ఒకసారి సరి చూసుకుంటుంది దీనిలో ఉన్న సమస్యలు సరి చేస్తుంది. అందుకే ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. మిస్డ్ కాల్స్ నోటిఫికేషన్లను సరి చేయాలన్నా కూడా ఒకసారి ఫోన్‌ను ఆఫ్ చేసి ఆన్ చేస్తే అంటే రీస్టార్ట్ చేస్తే సరిపోతుంది.
డిఫాల్ట్ ఫోన్ యాప్
రీసెంట్‌గా ఏదైనా థర్డ్ పార్టీ డయిలర్ యాప్‌ని ఇన్‌స్టాల్ చేశారా? ..లేకపోతే డిఫాల్ట్ ఫోన్ యాప్ ఏదైనా ఉందా చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఉంటే ఆ డిఫాల్ట్ ఫోన్ యాప్‌ని చేంజ్ చేయాలి. ట్రూ కాలర్ లాంటివే ఇందుకు ప్రధాన కారణం. వెంటనే ఇలాంటి వాటిని అన్ ఇన్‌స్టాల్ చేయాలి. వెంటనే ఇలాంటి నోటిఫికేషన్లు మీకు రావు.
క్లియర్ క్యాచె
మీ ఫోన్ యాప్‌లోని డేటా ఒక్కోసారి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఇలాంటప్పుడు మీరు ఈ డేటాను ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవాలి. ఇలా క్లియర్ చేయడం వల్ల మీ కాల్ హిస్టరీ డేటా మొత్తం పోయి ఫ్రెష్ అయిపోతుంది. ఇందుకోసం సెట్టింగ్స్‌లోకి వెళ్లి యాప్స్, అప్లికేషన్స్ సెక్షన్‌లోకి వెళ్లి ఆల్ యాప్స్ మీద క్లిక్ చేయాలి. ఇందులో త్రి డాట్ ఐకాన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి క్లియర్ క్యాచె చేస్తే చాలు మీ ఫోన్ కాల్ డేటా ఎరేజ్ అవుతుంది.