సోషల్ మీడియా ఇప్పుడు ప్రపంచాన్నంతా కమ్మేసింది. స్మార్ట్‌ఫోన్ ఉన్న వాళ్లందరికీ ఇంచుమించుగా ఒకటి రెండు సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాంల్లోనయినా అకౌంట్స్ ఉంటాయి. వీటిలో డిఫరెంట్ ఫ్రెండ్స్ సర్కిల్స్ ఉండొచ్చు. కాబట్టి అందరికీ తెలిసేలా ఏదైనా ఒక కంటెంట్‌ను పోస్ట్ చేయాలంటే ఒకదాని తర్వాత ఒక ఫ్లాట్‌ఫాంలో డివిడిగా పోస్ట్ చేయాల్సిందే. అదే లైవ్ చేయాలంటే ఒకదాని తర్వాత ఒకటి చేయడం కుదరదు.. మరి ఏంటి సొల్యూషన్ అనుకుంటున్నారా? అయితే మీ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాంలన్నింటిలోనూ ఒకేసారి లైవ్ చేయడానికి ఓ ఆప్షన్ ఉంది. అదేంటో ట్రైం చేద్దాం రండి.
లూలా
లూలా అనేది ఓ ఫ్రీ ఆన్‌లైన్ సర్వీస్. ఒకేసారి మల్టిపుల్ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాంల మీద లైవ్ ఇవ్వడానికి ఇది సూపర్ ఆప్షన్. దీంతో మీరు వివిధ రకాల సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాంలపై ఒకేసారి లైవ్ హోస్ట్ చేయొచ్చు.
ఏయే ఫ్లాట్‌ఫాంలను సపోర్ట్ చేస్తుంది?
యూట్యూబ్
ఇన్‌స్టాగ్రామ్
టిక్‌టాక్
లైవ్‌మీ
అప్‌లైవ్
17 లైవ్
ఒకేసారి లైవ్ చేయడం ఎలాగంటే?
* లూలా సర్వీస్‌లోకి వెళ్లి పైనున్న సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాంల లిస్ట్‌లో నుంచి మీరు లైవ్ హోస్ట్ చేయాలనుకున్నవాటిని సెలెక్ట్ చేయండి.
* తర్వాత కుడివైపున పైనున్న Go Live బటన్‌ను క్లిక్ చేయండి.
* వెంటనే Loola మీ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాంలు అన్నింటిలోనూ ఒకేసారి లైవ్ చాట్, లైవ్ స్ట్రీమింగ్ చేస్తుంది.
* లైవ్ నడుస్తున్నప్పుడే total views, likes ఎన్ని వచ్చాయో రైట్‌సైడ్‌లో టాప్ కార్నర్‌లో కనిపిస్తాయి.
* లైవ్ ఆపేయాలి అనుకుంటే కింద కుడివైపున enable/disable the camera, mic input ఆప్షన్లుంటాయి. వాటిని వాడుకోవచ్చు.
స్పెషల్ ఫీచర్లు
లైవ్ చేస్తూనే వాటికి ఎన్నో ఫీచర్లు యాడ్ చేసుకునే సౌకర్యాన్ని లూలా మీకు అందిస్తుంది.
మ్యూజిక్: మీ లైవ్ వీడియోకు మ్యూజిక్ యాడ్ చేయొచ్చు.
గివ్ ఎవేస్: లైవ్ వీడియోకు గివ్ ఎవేస్ ఇవ్వొచ్చు.
లేఅవుట్: టెక్స్ట్ కూడా ఓవర్ లే అయ్యేలా వీడియో లేఅవుట్‌ను మార్చుకోవచ్చు.
ఎఫెక్ట్స్: లైవ్ వీడియోకు ఎఫెక్ట్స్ యాడ్ చేయొచ్చు.
బ్యాక్‌గ్రౌండ్: వీడియో బ్యాక్‌గ్రౌండ్ మార్చుకోవచ్చు.
పోల్స్: మీ లైవ్ వీడియోకు పోల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు.
లైవ్ పూర్తయ్యాక..
లైవ్ పూర్తయ్యాక ఆ ప్రోగ్రాంకి సంబంధించిన సమ్మరీని మీకు చూపిస్తుంది.Total Views, Max Concurrent Views, New Followers, Likes, వంటివన్నీ ఫ్లాట్‌ఫాంల వారీగా చూపిస్తుంది. అంతేకాదు మీ లైవ్ వీడియోను ఈ డిటెయిల్స్, స్టాటిస్టిక్స్ అన్నింటితో సహా డౌన్‌లోడ్ కూడా చేసుకునే సదుపాయాన్ని లూలా మీకు కల్పిస్తుంది.