ట్రాయ్ కొత్త నిబంధనల ప్రకారం మీ సిమ్‌కార్డు వ్యాలిడిటీ అయిపోతుందా? అయితే మీరేం ఆందోళన చెందక్కర్లేదు. మీ సెల్‌ఫోన్ మొయిన్ బ్యాలెన్స్ నుంచి కూడా మీరు సిమ్‌కార్డు వ్యాలిడిటీని మాన్యువల్‌గా పెంచుకునే అవకాశం ఉంది. వ్యాలిడిటీని పెంచుకోవడం కోసం రూ.35 లేదా రూ.25 రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ యుఎస్ఎస్‌డీ కోడ్‌ని డయిల్ చేసి ఇన్‌స్టంట్‌గా యాక్టివేషన్ చేసుకోవాలి. మరి మన మెయిన్ బ్యాలెన్స్ నుంచి సిమ్ కార్డ్ వ్యాలిడిటీని ఎలా పెంచుకోవాలో చూద్దాం..
ఎయిర్‌టెల్‌లో ఇలా..
*121*51#
ఈ కోడ్ కొట్టిన తర్వాత మీ మెయిన్ బ్యాలెన్స్ నుంచి రూ.23 కట్ అవుతుంది. మీకు 28 రోజుల పాటు సిమ్ వ్యాలిడిటీ లభిస్తుంది. ఇదే కాకుండా *121# కోడ్‌ను మీ ఎయిర్‌టెల్ నుంచి డయల్ చేయాలి. ఆ తర్వాత స్మార్ట్‌ప్యాక్‌ను ఎంచుకుని రూ.23 సెలక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత 1 నంబర్ మీద క్లిక్ చేసి యాక్టివేట్ చేయాలి.
ఐడియా సిమ్‌తో ఇలా..
*369*24# లేదా *150*24# నంబర్లు డయల్ చేయాలి. మీకు 28 రోజుల పాటు సిమ్ వ్యాలిడిటీ వస్తుంది. ఇందుకోసం ఐడియా మెయిన్ బ్యాలెన్స్ నుంచి మనకు రూ.24 కట్ అవుతుంది.
వొడాఫోన్ సిమ్‌తో ఐతే..
*121*# లేదా *444*24# క్లిక్ చేయాలి. మీ వొడాఫోన్ నుంచి రూ.23 ఛార్జ్ అవుతుంది. మీకు 28 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అదే డొకొమోలో ఐతే *141# డయల్ చేయాలి. ఇందుకు రూ.23 ఖర్చు అవుతుంది మీ మొయిన్ బ్యాలెన్స్ నుంచి.